పర్యాటకం

కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనేశ్వరుని గురించి తెలియని వారుండరు. శనికి ప్రీతి కలిగించాలని శనేశ్వరుని వల్ల బాధలు ఉండకూడదని శనేశ్వరునికి తైలాభిషేకాలు, శనికి ప్రదక్షిణలు చేస్తుంటారు. శని పూజలను కూడా చేస్తారు. తిలలు దానం చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయ్యప్ప పూజ చేస్తే శని సంతోషిస్తాడని మాలదీక్షలు కూడా చేపడుతారు. వేంకటేశ్వరుని పూజిస్తే వేంకటేశ్వర వ్రతం చేస్తే కూడా శని ప్రీతి చెందుతాడని ఆ కలియుగ దేవుని వ్రతమూ చేయస్తుంటారు.
అట్లాంటి శనేశ్వరునికి ప్రత్యేక ఆలయాలు చాలా ఉన్నాయ. ప్రతి ఆలయంలో నవగ్రహ మండలాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు. సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శనేశ్వరుడని ప్రఖ్యాతి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనేశ్వరుడని అంటారు.
శనేశ్వరుడు కొలువు తీరిన క్షేత్రాల్లో మహిమాన్వితమైన క్షేత్రమే పావగడ. దేశంలో ఉన్న ప్రముఖ శనైశ్చర స్వామివారి క్షేత్రాలలో పావగడ కూడా ఒకటి. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శనేశ్వర స్వామివారు, శీతల అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండల నడుమ ఉన్న ఈ దివ్య క్షేత్రం శ్రీ శనేశ్వరస్వామి లీలా విశేషాలతో, మహత్వాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
సత్యం, న్యాయం శనీశ్వరుని రెండు కళ్ళు.
పూర్వకాలంలో ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక సాధువు శనేశ్వరస్వామి వారి పటాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తూ కాలం గడిపేవాడట. అయితే స్వామి వారి దృష్టి తమపై పడకూడదనుకున్న భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి దూరంనుంచే స్వామివారిని దర్శించుకునేవారట. తర్వాత కట్టా కృష్ణయ్యశెట్టి, ఎ.నర్సింగరావు అనే భక్తులు విరాళాలు సేకరించి స్వామివారికి ఒక చిన్న మందిరాన్ని కట్టించారట.
ఈ ప్రదేశంలో నివసిస్తున్నవారు ఈ శనేశ్వర స్వామిదర్శనం చేసుకొన్నందుననే తమ సుఖసంతోషాలు లభిస్తున్నాయని అనుకొన్నారు. వారంతా ప్రతిరోజు స్వామిని దర్శించడం తమ దైనందిన కార్యంగా పెట్టుకొన్నారు. స్వామి వారి ఆదేశంతో ప్రఖ్యాత శిల్పకారుల సహకారంతో నిర్మించిన నవగ్రహాలను తిప్పయ్య అనే భక్తుడి నేతృత్వంలో ప్రతిష్టించడం జరిగింది. ఆనాటి నుంచి నేటివరకూ ఈ ఆలయం దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది.
ఈ శనేశ్వరస్వామి దర్శించుకుందా మనుకొని ఇక్కడికి వచ్చిన భక్తులు ఓం శనైశ్వరస్వామినే నమః
సత్యశక్తి స్వరూపం.......
సంకట హరణం దేవాం
శనీశ్వరాం ప్రణమామ్యహమ్
అంటూ భక్తిశ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో ముందు గా ప్రధానాలయానికి వెలుపల శని దేవుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. ఇదే ఆలయంలో మరో పక్క పంచముఖ ఆంజనేయస్వామి వారు విచ్చేసిఉన్నారు.
గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవి దర్శనమిస్తారు.
. స్వామివార్లకిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
శనీశ్వరస్వామి గర్భాలయానికి మరోపక్క శీతలామాత ఆలయం ఉంది. ఈ ఆలయానికి ముందు చండి, ప్రచండి మూర్తులున్నారు. ప్రధానాలయంలో ఎడమవైపున సత్యనారాయణస్వామి, కుడివైపున వినాయకుడు, దత్తాత్రేయుని మూ ర్తుల దర్శనం లభ్యవౌతుంది. గర్భాలయంలో శ్రీ శీతలామాత వారి దివ్య మంగళ రూపం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.
పావగడ శ్రీ శనైశ్చరస్వామి ఆలయంలోని స్వామి వారికి తిల తైలాభిషేకాలతోపాటు అఖండ హారతి నిర్వహిస్తే సమస్త గ్రహ బాధలనుంచి శని దేవుడు విముక్తి కల్గిస్తాడని భక్తులు నమ్ముతారు.
స్వామి దర్శనం, పూజానంతరం తమ గ్రహదోషాలు, శనిపీడలు, ఇతరత్రా బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెడుతున్నామంటూ వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దూరమవుతాయన్న నమ్మకంతో ఈ సంప్రదాయాన్ని ఇక్కడ పాటిస్తారు.
ఈ ఆలయంలో శని త్రయోదశికి, శని జయంతికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు.

పావగడ క్షేత్రానికి దారిదే
ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం జిల్లా హిందూపురం వరకు వచ్చి అక్కడనుంచి మరో వాహనంలో చేరుకోవచ్చు. అలాగే కళ్యాణదుర్గం నుంచి అరవై కిలోమీటర్లు దూరంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రం చేరుకోవడానికి ప్రయివేటు బస్సులు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

-గున్న కృష్ణమూర్తి