పర్యాటకం

సర్వేశ్వరుడు సంగమేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర భారతావనిలోని అనేక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పాలమూరు జిల్లాలోని సంగమేశ్వరము ఒకటి. ఇది కృష్ణ, తుంగభద్రలకూడలిగా ప్రసిద్ధమైంది. ఈ కూడలి గ్రామ వాసులు ఒక్కోచోట కాక పలుప్రదేశాల్లో నివసిస్తున్నట్టు తెలుస్తుంది. అలంపురం పట్టణంలో పునఃనిర్మించిన సంగమేశ్వరుని, ప్రతి శివరాత్రి ఉత్సవాలకు కూడలి గ్రామవాసులు శ్రమ, ప్రయాసలు పడి అందరు కలిసి, ఆ దేవదేవుని శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. అందరు సంఘటితమై వారి వారి యోగక్షేమాలు తెలుసుకొని, బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తమతమ గ్రామాలకు చేరుకుంటున్నారు.
పాలమూరు జిల్లా యందు అలంపురము తాలూకాలో కృష్ణా, తుంగభద్రల సంగమము (కూడలి) దగ్గర వెలసిన పుణ్యక్షేత్రంమే సంగమేశ్వరం. ఈ సంగమేశ్వరం కొల్లాపూర్ తాలూకాకు, అటు కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా సరిహద్దులో కృష్ణ, తుంగభద్రల నడుమ వెలసి, నయనానందముగా చూపరులను ఆకర్షించు ప్రకృతి దృశ్యములకు ఆటపట్టు.
ఆ క్షేత్రము మహాశివరాత్రి పర్వదినమున వేలాది జన సమూహంతో, శివార్చనలతో దశదిశల మారుమ్రోగుచుండేది. కర్నూలు నుండి అలంపురమువరకు బస్సులో, అక్కడి నుండి కాలినడకన లేదా గుఱ్ఱము బండ్లమీద ప్రయాణించి సంగమేశ్వరానికి వెళ్తుంటారు. పాలమూరు వాసులు నాగర్‌కర్నూలు, కొల్లాపురం మీదుగా ఆర్టీసి బస్సులో ప్రయాణించి, తర్వాత చెల్లెపాడు బస్సులో ప్రయాణించి అయ్యవారి పల్లెలో దిగి, అక్కడినుంచి కాలినడక లేక బాడుగ ఎద్దుల బండ్లు కట్టించుకొని రెండు కిలోమీటర్లు ప్రయాణించి సంగమేశ్వరంచేరుకొంటారు.
కర్నూలు జిల్లా వాసులు ఆత్మకూరు మండలం, నందికొట్కూరు తాలూకాలోగల నెహ్రూనగర్ లేక నాగటూరు, కొణిదేలకు చేరుకొని అక్కడినుంచి నదిలో పడవలలో ప్రయాణించి సంగమేశ్వరానికి వస్తారు. వేసవి కాలములో అయితే కాలినడకన నదిని దాటి ఆ క్షేత్రాన్ని దర్శించవచ్చును. కాని, ఈ క్షేత్రం అంతగా అభివృది చెందలేదు.
1958 సం.లో శ్రీశైల క్షేత్రము దగ్గర జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణము చేయుటకు శంకుస్థాపనతో ఈ క్షేత్ర అభివృద్ధి కార్యక్రమములు ఆగిపోయినవి. ఈ క్షేత్రము జల విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో మునిగిపోయింది. శ్రీశైల ప్రాజెక్టు నీరు ముంపు కాకముందు, పురావస్తుశాఖవారు, సంగమేశ్వరాలయాన్ని కడు జాగ్రత్తతో ఆలయ శిలలను తొలగించి తమ చాకచక్యముతో అలంపుర క్షేత్రంలో కూడలి దగ్గర ఎలా ఉన్నదో అలానే చూడముచ్చటగా నిర్మించి, వేద పండితులతో సంగమేశ్వరుని పునఃప్రతిష్ఠించారు. ఇట్టి ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర క్షేత్ర పుట్టుపూర్వోత్తరములనుమన తర్వాతి తరాలకు తెలసిఉండడం మంచిదని నా భావన. ద్వాపర యుగంలో కౌరవుల మాయాజూదంలో పాండవులు పరాజితులయ్యారు. దానివల్లనే పరిసర అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని నివసించేవారు. కౌరవులు వారిని మరింత అవమానపరచాలని, ‘‘ఘోష యాత్ర’’ నెపంతో బయలుదేరారు. మార్గమధ్యంలో గంధర్వులు, కౌరవులను తమ శత్రువులుగా భావించి, యుద్ధంలో కురువీరులందరిని పట్టి బంధించారు. ఈ విషయం తెలిసిన పాండవాగ్రజుడు అక్కడనే ఉన్న కౌరవ వీరులందరిని బంధవిముక్తులను గావించి రమ్మని భీమార్జునులకు ఆనతిచ్చాడు. తత్ఫలిముగా కురువీరులు గంధర్వుల చెరనుండి వీడి ఘోర పరాభవంతో హస్తినాపురికి చేరారు.
విషయం తెలిసిన వాసుదేవుడు, పాండవులను చేరి మీరు ఇక్కడినుంచి బహుదూరంలో ఉన్న దండకారణ్యంలో కొంతకాలం గడిపి రమ్మని ఆదేశించాడు. శ్రీకృష్ణుని ఆనతి మేరకు దండకారణ్యంలో పాండవులు ప్రవేశించి జీవించసాగారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి మన్ననలను పొందుతూ సంచార జీవితం గడిపేవారు. అలా సంచరిస్తూ కృష్ణ, తుంగభద్రల సంగమం (కూడలి) చేరుకున్నారు.ఇక్కడి ప్రకృతి, ఈ నదుల కూడలి ప్రదేశం చూడగానే వారందరూ ఎంతో ఆనందపరవశులయ్యారు. ఇక్కడే పర్ణశాల నిర్మించుకొని కృష్ణ, తుంగభద్రల కూడలిలో నిష్కాములై తమకు సంభవించిన కష్టాలను, బాధలను, అవమానాలను మరచి సుఖ జీవితాన్ని సాగించారు. పాండవులు, ఒకనాడు ధర్మరాజు తమ్ములను, ద్రౌపదిని పిలిచి ఈ సుందర ప్రదేశం రెండు నదుల సంగమం కావున శివుని పూజిస్తే బాగుంటుం దని సంగమ స్థలం కనుక ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటే సంగమేశ్వరలింగంగా ప్రసిద్ధి వస్తుందని తన మనసులో మాటను చెప్పాడు. వారంతా కూడా శివపూజ కు తమ సంసిద్ధతను తెలియపర్చారు.
వెంటనే భీమసేనుడు, కాశీక్షేత్రం చేరి అన్నపూర్ణ, విశ్వనాథులను ప్రార్థించి, అక్కడ నున్న ఒక పవిత్ర శివలింగాన్ని తీసుకొని కృష్ణా, తుంగభద్రల సంగమానికి చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండు నదుల కలయిక గట్టుపై ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజా కార్యక్రమాలు సాగించారు. అలా కొంతకాలంపాండవుల పూజలందుకున్నాడు సంగమేశ్వరుడు. ఆ తరువాత ద్వాపర యుగం ముగిసింది. కలియుగం వచ్చింది. అధర్మం మూడు పాదాలతో నడిచింది. ఆ సమయంలో మానవ జాతిని జాగృతం చేయడానికి ఒక మహానుభావుడు ఉదయించాడు. అతడే బసవేశ్వరుడు. అంతరించిపోతున్న మానవ సంస్కారాలను, ధర్మాలను, కర్తవ్యాలను, భక్తిజ్ఞానాలను, జాగృతం చేసి సరికొత్త మానవ జగత్తుకు మూలపురుషుడైనాడు. నేటి కర్ణాటక తుంగభద్రల సంగమం (కూడలి)లో తపస్సుచేసి ఈశ్వరుని సాక్షాత్కారం పొందాడు. భక్తి మార్గం గొప్పదని మానవులకుతార్కాణంగా నిలిచాడు. శివభక్తిని ప్రచారం చేస్తూ దక్కను పీఠభూమిలో సంచరిస్తూ కృష్ణ, తుంగభద్రల కూడలికి వచ్చాడు. ధర్మరాజుచే ప్రతిష్ఠగావింపబడిన శివలింగాన్ని పూజించాడు. తన భక్తిజ్ఞానాల ద్వారా ఆ ప్రాంత విశిష్టతను సంపూర్ణంగా గ్రహించాడు. తాను ఆశ్రమం నిర్మించుకొని, కొంతకాలం శివపూజను చేస్తూ అక్కడున్నవారికి కూడా శివుని పూజ చేయమని ప్రబోధించాడు.
ఆ తర్వాత చాళుక్యరాజులు పాలన వచ్చింది. వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయం చెంతనే కూడలి గ్రామము నిర్మించారు. ఆ దేవదేవుని నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ జంగమయ్యను నియమించారు. ఆనాడు చాళుక్యులు నియమించిన జంగమయ్య వంశీకులే నేడు కూడా పూజాదికాలు నిర్వహిస్తున్నారు.

- సాయికృష్ణ