పర్యాటకం

నవగ్రహాలకు నిలయాలు ఈ గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యోతిష శాస్త్రం అనేది గ్రహ గతులపై ఆధారపడిఉండేది. . సౌరమండలంలోని తొమ్మిది గ్రహాల భ్రమణాన్ని బట్టి మానవుడి జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో, ఎలా ఉండనున్నాయో భవిష్యద్దర్శనం చేసేది జ్యోతిష శాస్త్రం. గ్రహాల నుంచి వచ్చే కిరణాలు ఆయా సమయాల్లో జన్మించే జీవరాసులపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. భౌగోళిక, అక్షాంశ, రేఖాంశాలను బట్టి గ్రహాల కిరణ ప్రసారాన్ని లెక్కగట్టి దాన్ని బట్టి జీవ రాసుల చిత్తవృత్తులను జ్యోతిష శాస్త్రం విప్పి చెప్తుంది. ఈ గ్రహాలు చల్లని కిరణాలు ప్రసారించాలని కోరుతూ వాటికి పూజలు చేసే సంప్రదాయం భారత దేశమంతటా ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని దేవాలయాల్లో ఈ గ్రహాలకు పూజలు చేసే పద్ధతి పూర్వకాలం నుంచీ వస్తున్నది. దక్షిణ భారత దేశంలో దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ నవగ్రహాలకు పూజలు జరుగుతుంటాయి. అంతేకాక సర్వ సృష్టి నియంతలైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు, లేక మహాశక్తి అమ్మవారికి 108 సంఖ్యతో అష్టోత్తరాలు చేయడం వెనుక కూడా ఈ గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయ.
సాధారణంగా దేవాలయాలలో నవగ్రహ మండపం ఉంటుంది. ఆ మండపంలో నవగ్రహాలకు ఒకే చోట ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజిస్తారు. సూర్య, శని గ్రహాలకు విడివిడిగా ఆలయాలు ఉండటమూ మనం చూస్తున్నాం. కానీ, తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ప్రత్యేకమైన ఆలయాలు, అదీ తొమ్మిది గ్రామాలలో ఉండటం నిజంగా అరుదైన సంఘటన. ఆలయాలకు ఆలవాలం తమిళనాడు. అందులోని తంజావూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుంభకోణానికి అరవై కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్కో గ్రామంలో ఒక్కొక్కటిగా తొమ్మిది గ్రహాలకు అపురూపమైన ఆలయాలను నిర్మించారు. భారతదేశంలో మరెక్కడా నవగ్రహాలకు ఇలా విడిగా ఆలయాలు లేవు.
సూర్యనారాయణ ఆలయం: కుంభకోణానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో సూర్యనారాయణ దేవాలయం ఉంది. 1100 సంవత్సరంలో కుళోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ విశ్వానికి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు మానవులకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
చంద్రుడు: తింగలూరు గ్రామంలో చంద్రుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏ కాలంలో నిర్మించారో ఇంతవరకు పరిశోధకులకు బయటపడలేదు. చివరకు దేశంలో భక్తి ఉద్యమం ప్రారంభం కావడానికి చాలా ముందుగానే సుమారు ఏడో శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు నిర్ధారించారు. తింగల్ అంటే తమిళంలో చంద్రుడు అని అర్థం. తింగలూరుకు ఆ పేరు రావడానికి చంద్రుని ఆలయం అక్కడ ఉండటమే కారణం. ఈ ఆలయాన్ని సందర్శిస్తే, జీవితం సాఫీగా సాగిపోవడానికి చంద్రుడు అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు.
చంద్రుడు చల్లగా ఉంటాడు. చంద్రుడి కిరణాలు సోకినంత మాత్రాన మనిషిపై ఒత్తిడి తగ్గిపోతుందనేది నేడు నిత్యమూ అనుభవించే విషయమే.
శనీశ్వరుడు: తిరునల్లార్ గ్రామంలో శనీశ్వరునికి అద్భుతమైన దేవాలయం ఉంది. మనిషిపై శని ప్రభావం సామాన్యమైందేమీ కాదు. ఏలినాటి శనిప్రభావం ప్రారంభమైతే ఏడున్నర సంవత్సరాల దాకా వదిలిపెట్టదని ప్రతీతి. ఇక్కడ తైలాభిషేకం చేయడం ద్వారా శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుందంటారు. తైలాభిషేకం అనంతరం నల్ల నువ్వులను దానం చేస్తారు. ఈ ఆలయంలో 3నల తీర్థం2 చాలా ముఖ్యమైంది. నలుడు ఇక్కడ శనేశ్వరునికి పూజలు చేసిన దానికి గుర్తుగా ఈ నలతీర్థం ఉందని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ ఆలయానికి వచ్చిన వారు తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేస్తారు.
శుక్రుడు: కంచనూరు గ్రామంలో శుక్రుడికి చక్కని ఆలయం ఉంది. దీనిని శివస్థలం అని అంటారు. ఈ ఆలయాన్ని మదురై మీనాక్షి దేవస్థానం వారు నిర్వహిస్తారు. తిరువాదుతురై అన్న ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పలాసవనం అనీ, బ్రహ్మపురి అనీ, అగ్నిస్థలమని కూడా ఈ ప్రాంతానికి పేర్లున్నాయి. శివ పార్వతులు వివాహం చేసుకుంటారని బ్రహ్మ ఇక్కడి నుంచే దర్శించాడని పురాణ కథ ఉంది. శుక్రుడిని సేవించినట్లయితే దంపతుల మధ్య గొడవులు రావు.
గురుడు: అలంగుడి అన్న ప్రాంతంలో గురుస్థలం ఉంది. ఇక్కడ గురు గ్రహానికి ఆలయం ఉంది. పరమగురువైన దక్షిణామూర్తి ఇక్కడ భక్తుల పూజలందుకుంటాడు. గురుడు వివిధ రాశుల్లోకి ప్రవేశించిన సందర్భాల్లో అసంఖ్యాకంగా భక్తులు వచ్చి పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని అమృతపుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.
బుధుడు: తిరువెంకాడులోని బుధుడి ఆలయం గురించిన ప్రస్తావన వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఈ ఆలయం దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమైనదనే చెప్తారు. బుధుడు ప్రతిభ, మేధస్సులను పరిపుష్టం చేస్తాడట.
రాహువు: తిరునాగేశ్వరం గ్రామంలో అతి పెద్ద దేవాలయం రాహు గ్రహం కోసం నిర్మించారు. చాలామందికి రాహుదోషం ఉంటుంది. దీన్ని తొలగించు కోవడానికి రాహుపూజలు చాలామంది నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాన పూజ రాహువుకే జరుగుతుంది. కాని ఇక్కడ ఆదిశేషువు, శివుడు కూడా కొలువై ఉన్నారు.వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. రాహు దశ నడుస్తున్న వారు రాహువుకు జపాలను చేస్తారు.
కేతువు: కేజ్‌పెరుంపాల్లం అన్న పేరు కేతు ఆలయం ఉండటం వల్లనే వచ్చింది. భారత దేశంలో అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రం ఇది. ఇక్కడ కేతువుతో పాటు మిగతా నవగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. రాహు కేతువులు ఎప్పుడూ అభిన్నులు కారు. వారికి పూజ చేస్తే గ్రహచారం బాగుంటుందని విశ్వాసం.
అంగారకుడు:ప్రఖ్యాతమైన వైదేశ్వరన్ కోయిల్‌లో అంగారకుడికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈయనను తమిళులు సెవ్వయ్ అని కూడా పిలుస్తారు. ఈయన శక్తికి, సామర్థ్యానికి, విజయానికి సంకేతం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముంగా సిద్ధామృత కుండంలో స్నానం చేసి ఆ తరువాత స్వామిని దర్శించుకుంటారు. ఈ కుండంలోని నీరు ఔషధ జలం. చర్మ సంబంధమైన జబ్బులను ఈ నీరు పోగడుతుంది. నాడీ జ్యోతిషానికి వైదేశ్వరన్ కోయిల్ దేశమంతటా ప్రసిద్ధి చెందినది.
నవగ్రహాల ఆలయాలు అన్నీ కూడా అపురూపమైన శిల్పసంపదను అలరారుతున్నవి. దక్షిణాది శిల్ప, నిర్మాణ సంప్రదాయాలను పుణికిపుచ్చుకున్న ఈ ఆలయాలను దర్శించాల్సిందే.

- జంగం శ్రీనివాసులు