బిజినెస్

ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నవంబర్‌లో 10 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో ఆటోమొబైల్ రంగం తిరిగి పుంజుకుంటోంది. గత 12 నెలలు వరుసగా పెరిగిన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నవంబర్‌లో మరో 10.39 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది నవంబర్‌లో 1,56,811 కార్ల అమ్మకాలు జరగ్గా ఈసారి అవి 1,73,111 యూనిట్లకు చేరుకున్నట్లు భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో 2,12,432 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జరగ్గా ఈసారి అవి మొత్తం మీద 11.4 శాతం పెరిగి 2,36,664 యూనిట్లకు చేరుకున్నాయని ‘సియామ్’ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ న్యూఢిల్లీలో విలేఖర్లకు వివరించారు. ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన మారుతీ ‘బాలెనో’, రెనాల్ట్ ‘క్విడ్’ తదితర కార్ల వలన ఈ వృద్ధి నమోదైందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వాహన అమ్మకాలు చాలా మందకొడిగా ఉన్నాయని ఆయన తెలిపారు. ‘దేశంలో కార్ల అమ్మకాలు క్రమేపీ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇవి అంత ప్రోత్సాహకరంగా లేవు’ అని ఆయన అన్నారు.