Others

రాగమరుూ రావే... చిత్రం భళారే విచిత్రం (నాకు నచ్చిన పాట .)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం భళారే విచిత్రం పాట చలన చిత్ర చరిత్రలో ఒక అద్భుతం. ఆనవాయితీగా వచ్చే నాయకానాయికల యుగళ గీతాల గతాన్ని చెరిపేసి, ప్రతి నాయకుడికి యుగళ గీతాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్‌కే చెల్లింది. పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన సినారె రచన ‘చిత్రం భళారే విచిత్రం’ ఒక చిత్ర గీతమే కాదు.. పాటల తోటలో ప్రత్యేకంగా అరవిరిసిన ఆహ్లాదాల గులాబీ.. ఒక సమ్మోహనాస్త్రం.
సుయోధనుడిని అభిమాన ధనుడిగా నాయకత్వ గుణాలున్న ప్రతి నాయకుడిగా ప్రేక్షకులు మెచ్చేలా పాత్రను తీర్చిదిద్ది, అందులోకి ఓ పాటనుచేర్చి ఆ పాత్రకు ప్రాణంపోసిన ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. పాటకు పరవశించిపోయారు. ప్రతి నాయకుడి పాటా...? అనుకున్న వాళ్లను ‘వావ్...’ అనిపించింది. పాటలోని ప్రతీ పదానికి అర్థాన్ని వినిపించింది. సినారె కలం వాయిద్యాల హోరులో వినిపించిన పాట కాదు.. స్వరాల నేపథ్యంలో జాలువారే గంగా ప్రవాహం. ప్రతీ మాట వినిపిస్తుంది. పల్లవి పులకించిపోతుంది. చరణాలు పరవశించిపోతాయి. భావాలు పురివిప్పిన మయూరాలు అవుతాయి. అక్షరాల్లో కిలికించితాలు... ఎక్కడా ద్వందార్థాలు ధ్వనిమాత్రమైనా వినిపించవు.
పాత ఎత్తుగడలోనే చిత్రంలోని విచిత్రాన్ని ఆవిష్కరించిన నేపథ్యము అద్భుతం. రాచరికపు జిత్తులతో, రణ తంత్రపుటెత్తులతో సతమతమయ్యే మదిలో మధనుడు సందడి చేయుట చిత్రం.. అని చెప్పడంలో ఎంతటి మహారాజైనా ఎపుడో ఏకాంతంలో తన కాంతను స్మరించుట చిత్రం.. అని చెప్పడంలో వైవాహిక జీవితంలోని మధురోహాల గురించి చెప్పిన విధానం... ఆ పాటలో ఎన్టీఆర్, ప్రభల నటన.. పలికించిన హావభావాలు మహాద్భుతం. దానవీరశూరకర్ణలో నటుడిగా, విభిన్న పాత్రలు పోషించడం ఒక ఎత్తయితే.. దర్శకత్వం మకుటాయమానం. దుర్యోధనుడికి యుగళగీతాన్ని పెట్టి చరిత్రను తిరగరాయటం కారణజన్ముడికే సాధ్యమైంది. 1977లో విడుదలైన ఈ చిత్రాన్ని కర్త కర్మ క్రియ అన్నీ నందమూరి తారక రాముడే. బాక్స్ ఆఫీస్ వసూళ్లను పైస్థాయిలోకి తీసుకువెళ్లిన ఈ చిత్రం భళారే.. అనిపించే విచిత్రమే.

-తేజారాణి తిరునగరి, హైదరాబాద్