పఠనీయం

స్వర్ణశిల్పి మలిచిన ఆభరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కప్పస్తంభం
-చింతకింది శ్రీనివాసరావు
వెల: రూ.120
ప్రతులకు: శ్రీనిజ పబ్లికేషన్స్
రవీంద్రనగర్, విశాఖపట్నం. మరియు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
*
కథ, కథనం.. ఈ రెండూ బండికి కట్టిన జోడెద్దుల్లాంటివి. రెండూ బావుంటే, కథ కచ్చితంగా పండుతుంది. రెండూ బావుంటేనే గమ్యానికి సాఫీగా, సుఖంగా చేరుతాం. ఈ జోడెద్దుల బండిని నడిపేవారు సిద్ధహస్తులైతే, పాఠకుల నాడి తెలిసిన వారైతే, కథ ఇంకా రక్తి కడుతుంది. పాఠకుల మనసులు కొల్లగొడుతుంది. కథ, కథ కంటే మహా గొప్పగా కతనం - మన ముందుంచగలిగేరు ఈ కథా సంకలన రచయిత చింతకింది శ్రీనివాసరావు. ఉత్తరాంధ్రత్వం గుబాళించే ఈ కథల్లో కళింగాంధ్ర మాండలికాన్ని ‘గాలి పల్లకి’ ఎక్కించి ఊరేగించారు.
ఎట్నుంచి ఎటు, ఎంత సీరియస్‌గా లెక్కెట్టినా ఈ సంకలనం ఉన్నవి పట్టుమని పది కథలు! అయినా ఇవి ‘మూస’ కథలు కావు. రసికజన ‘మాస్’ మెచ్చే కథలు. మళ్లీ మళ్లీ చదవాలనిపించే ‘చేవ’ ఉన్న కథలు. అదనపు ఆకర్షణ - గమనం; వర్ణన. మచ్చుకు - ‘సింహాద్రి అప్పన్నకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో, అంత పేరూ ప్రతిష్టలున్నాయి అప్పన్న సన్నిధిలోని కప్పస్తంభానికి. ఒకనాటి ఉదయాన ఆ కప్ప స్తంభం మాయమవుతుంది. ఆ విషయం ఆ నోటా ఈ నోటా అడవివరం పాకిపోయింది. గోపాలపట్నంలో తెలిసిపోయింది. పెందుర్తి చేరిపోయింది. చోడారం, మాడుగుల, పాడేరు దాటేసింది. విశాఖ నగరమంతా అల్లేసింది. ఉత్తరాంధ్ర ముట్టుకు పోయింది. ఒరిస్సా అంటుకుపోయింది. హైదరాబాద్ అగ్గయిపోయింది’ (పే.60) అంటూ, మాయమవటాన్ని ళౄఔ్ద్ఘఒజఒళ చేస్తూ, ఇంత రాస్తారు. చివరకు కప్ప స్తంభం యథాస్థానానికి చేరటం - అది వేరే సంగతి. చదువుతున్నంతసేపూ పాఠకుడు కూడా ఆందోళన పడతాడు.
మరో కథ ‘బుక్కావీధి’. ప్రథమ పురుషలో చెప్పబడే ఈ కథ ఆనాటి కళావంతుల సామాజిక అవసరాలు, అటు సాని నాగరత్నమ్మ, ఇటు కథకుడి తాతగారిల మధ్య పైకి చెప్పుకోలేని అనుబంధం. తెలియని పాశమేదో వెంటబడి కథకుడితో నాగరత్నమ్మ పాడెకు భుజాన్ని వేపిస్తాడు. రుణానుబంధం గొప్పతనాన్ని వివరిస్తుందీ కథ. వంటితోలు విచిత్రంగా పుట్టిన ‘లండనోడు’ ఆ ఊరికంతటికీ ఎట్లా ఆరాధ్యనీయుడైనాడో ‘లండనోడు’ కథ చదవాల్సిందే.
ఒకనాటి పాల్ఘాట్ అయ్యరు హోటళ్లు, అంతకు ముందున్న పాపారావు పాకా విలాస్‌ను సింహాచలం తాటాకు వోటేలును అమ్మాజమ్మ టీకొట్టును మూసేయించాయి. ‘అలుడ్ని బలుడు కొడితే బలుడ్ని బ్రెమ్మదేవుడు కొట్టినట్లు’ మెస్సులొచ్చి అయ్యర్లని సాగనంపగలిగాయి. కాలంతోబాటు మార్పు సహజం అని చెప్పే, ‘పాపం పాకావిలాస్’ కథ.
మొగుడు చచ్చిన ముండ సోవమ్మ. సోవమ్మ మనవరాలు సరస. సరసకి బుర్ర బాగోదు. మతిభ్రమణం. ఒంటిమీద గుడ్డుందో లేదో చూసుకోకుండా బయటకి వెళ్లిపోయే’ రకం. తలిదండ్రులు సరసని భరించలేక రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో వదిలి వస్తారు. సంగతి తెలిసిన సోవమ్మ రాజమండ్రి నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ ‘మా సరస కనిపించిందేంట్రా?’ అని ఒకటే అడగటం. మొదటి సగంలో సోవమ్మ ప్రయోజకత్వం రెండో సగంలో సరస - రెంటికీ అతి సమర్థవంతంగా ముడేశారు. ‘మా సరస కనిపించిందా..?’ కథలో. కథ ముగింపు చదువరి మనసుని దేవిరిస్తుంది.
అందలం ఎక్కిన వారిని చూసి ‘అబ్బో’ అనుకుంటాం కాని, అలా ఎక్కి కూర్చున్న వారి అవస్థలు గుచ్చుకునే మేకులు మనకు కనబడవు కాని శ్రీనివాసరావు గారికి కనిపిస్తాయి. ‘సవారీ జడుపు’ కథ చదివాక సత్యవతీ దేవమ్మ గారికి పెట్టె పల్లకి (మేనా) ప్రయాణం అంటే ఆమెకు ఎందుకు జడుపో తెలుస్తుంది. అయినా సంప్రదాయం సంప్రదాయమే.. తప్పదు. స్వాతంత్య్రానికి పూర్వం రాజుల గారింట్లో ఘోషాలు, పెట్టె పల్లికి ప్రయాణాలు, ఎంతటి అసౌకర్యాన్ని కలుగచేసేవో - చెబుతుందీ కథ.
వెండి కంచాలు, విరుగుడు చేవకర్రతో చేసిన భోజనాల బల్ల, మద్దిచెక్క కర్ర కుర్చీ, సిసలు కొమ్ముల నకలు లేడి తల - లాంటి వివరణలు, పొడ పాములన్నీ కలిసి తన పక్కలో పుట్ట పెట్టినంతగా ఠారు (పే.121), పల్లకీ ఎక్కినట్లు లేదు. పాడెక్కినట్టుగా ఉందనటం (పే.124), చెరుగ్గడలా నిట్టనిలువు (పే.47) కోడై కూయటం, కుక్కై అరవటం (పే.61) లాంటి పదాల వర్ణనలోని ‘డెప్త్’ను తెలియజేస్తాయి.
ఇక శ్రీనివాసరావుగారి మాండలిక పద జాలం పాఠకుడికి షడ్రసోపేతమే! వికటాలాడటం, చెడుపులు చిల్లంగులు (పే.46), నల్లకిల్ల పాము (పే.47), సంపెంగ తీగల్ని చిక్కిచిక్కి పోయటం (పే.64), వర్తన సాగించటం (పే.71) లాంటి పదాలు కథల నిండా కనబడుతూ - శ్రీరమణ గారి ముందు మాటలో ఇవి చక్రపొంగలిలో జీడి పలుకులు!
కనులకు కట్టినట్లు, సన్నివేశాన్ని మన ముందు నిలిపే ఈ పేరా - సన్నని చల్లని గాలి రివట ఆయన అంగవస్త్రాన్ని సుతారంగా కదిలిస్తోంది. ఆ కాసింత గాలికే చేతిలోని దీపం రెపరెపలాడుతోంది.
దానికి తగిలించిన చిన్నపాటి గాజు చిమ్మే వెలుగును కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది’. (పే.67) అందుకే ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజు అట్టమీది బొమ్మగా వేశారు.
సద్యస్ఫూర్తి, వక్త, మాటకారి, వృత్తినిష్ట కలిగిన పాత్రికేయులు చింతకింది శ్రీనివాసరావు గొప్పగా రాసిన కథల్లో ఈ పదీ చేరుతాయి. తప్పక చదవవలసిన సంకలనం ఇది. చింతకింద కాదు; ఆ మహావృక్షం కొసకొమ్మల్లో రచయితను నిలిపే కథలివి!

-కూర చిదంబరం 8639338675