పఠనీయం

పల్నాటియుద్ధం - చారిత్రక రూపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోగడ తెలుగులో చాలా చారిత్రక నాటకాలున్నాయి. ‘బొబ్బిలియుద్ధం’ ‘ఖిల్జీ రాజ్యపతనం’ ‘రోషనారా’ వంటివి ప్రదర్శనయోగ్యమైనవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జొన్నాభట్ల నరసింహశాస్ర్తీ రచించిన ‘పల్నాటి యుద్ధం’ రూపకం వెలుగులోకి వచ్చింది. దీనిని రచించి దాదాపు నలభై సంవత్సరాలైంది. ఐనా ముద్రణలోకి రాలేదు. వారి కుమారులు జొన్నాభట్ల నరసింహ ప్రసాద్ తండ్రి రుణం తీర్చుకోవటం కోసం ఇప్పుడు దీనిని ముద్రించారు. పల్నాటి యుద్ధంలోని కథ సుపరిచితమే. నేటికి దాదాపు 800 సంవత్సరాలకు పూర్వం జరిగిన ఒక తెలుగు ఇతివృత్తం ఒకరకంగా అభినవ భారత గాథ అనవచ్చు. ఇందులోను కృష్ణుడు దుర్యోధనుడు అభిమన్యుడు వంటి పాత్రలున్నాయి. భారతంలో సంజయ రాయబారం కృష్ణ రాయబారం వంటివి ఉన్నట్టే ఇందులోనూ అలరాజు రాయబారం వంటి ఘట్టాలున్నాయి. ఈ విధంగా ఈ కథను లోగడ శ్రీనాథుడు ద్విపద కావ్యంగా తీర్చిదిద్దారు. ఇందులోని పాత్రలు చారిత్రక ప్రామాణ్యంగల సంఘటనలపై ఆధారపడ్డవి. వాటిని ప్రదర్శనయోగ్యంగా రచయిత చిత్రీకరించటంలో కృతకృత్యులయ్యారు. ఈ రచనపై తిరుపతి వెంకట కవుల ప్రభావం కన్పడుతున్నది. పద్యాల ఎత్తుగడలో రాయబారం పోలికలున్నాయి. అదిగో ద్వారక - అయినను పోయి రావలయు హస్తినకున్ - ముందుగ వచ్చితీవు వంటి తిరుపతి వెంకట కవుల చాలా పద్యాలు ఈ కృతి చదువుతున్నప్పుడు మనకు స్మరణలోకి వస్తాయి. పల్నాటి వీరగాథ లోగడ సినిమాగా కూడా వచ్చింది. ఇది నిజంగా 12వ శతాబ్దంలో జరిగిన యదార్థ గాథ కావటంవల్ల, ఆనాటి సాంఘిక సామాజిక మత పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇలాంటి గ్రంథాలు ఉపయోగపడతాయి. జొన్నాభట్ల నరసింహశాస్ర్తీగారి శైలి సరళమైనది. లోగడ వీరు ‘్భక్త మార్కండేయ’ వంటి కొన్ని రచనలు చేశారు. అది వారి సమకాలీన సమాజంలో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ తరం వారికి జొన్నాభట్ల వారిని పరిచయం చేయడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది. నాటకం ప్రదర్శించినప్పుడే పూర్తిగా పరిపుష్టమవుతుంది. అంటే రూపకానికి రంగస్థలమే ప్రాణం కాబట్టి నటులు దీనిని ప్రదర్శిస్తారని ఆశిద్దాము. ప్రదర్శకులకు పాత్రల సంఖ్య పెరిగిన కొద్దీ సమస్యలు ఏర్పడుతాయి. ఇందులో 12 పాత్రలున్నాయి. ఏదో ఒక పాత్రను పెంచి తక్కిన వానికి గౌణ స్థాయిని కల్పించడం రచయిత చేయలేదు. అందువలన అన్ని పాత్రలను పోషించే నటీనటవర్గం సంతృప్తి పడుతుంది. ఇది చారిత్రక నాటకం కావటంవలన రచయిత ముందుగా పరకాయ ప్రవేశం చేసినప్పుడే పాఠకులను ప్రేక్షకులను రస స్థాయికి తీసుకొని పోగలడు. జొన్నాభట్ల వారు తెలుగు భాషా పండితులు కావటం వలన తాన స్వీకరించిన కార్యానికి న్యాయం చేశారు. వేదికపై యుద్ధం ప్రదర్శింపరాదని ప్రాచీన లాక్షణికులు నియమించారు. అది ప్రదర్శనకు కష్టసాధ్యం కూడా. ఈ నాటకంలో యుద్ధ సన్నివేశాలు తెర వెనుక చెప్పించారు. రసవంతమైన కథా ప్రధానమైన ఘట్టాలనే రచయిత తీర్చిదిద్దారు. ఇది ట్రాజిడీయే అయినా అలరాజు పాత్రకు కొంత ప్రాధాన్యమిచ్చి దీనిని సుఖాంతంగా ముగించటంలో రచయిత మంగళ భావన ద్యోతకమవుతుంది. ఈ గ్రంథాన్ని ముద్రించిన జొన్నాభట్ల నరసింహ ప్రసాద్ అభినందనీయులు. ఈ కృతి నూజెండ్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారికి అంకితం చేయబడింది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్