పఠనీయం

పూసపాటి వారి గ్రంథం నేటి కవితరానికి పూసకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటి నాగేశ్వరరావు
బహుముఖీన ప్రతిభ
రచయిత: పూసపాటి శంకరరావు
సెల్: 9885898297
పుటలు: 500, వెల: రూ.350/-
ప్రతులకు: శ్రీమతి పూసపాటి జయలక్ష్మి, 103ఎ, అట్లాంటిక్ సిటి అపార్ట్‌మెంట్స్, దీప్తి శ్రీనగర్,
మియాపూర్, హైదరాబాద్.
*
సాహిత్యమూర్తి, రచయిత, అవధాని, కవి ఇలా ఉండాలి అనే చూపే పూసపాటి నాగేశ్వరరావు అనే మహాకవి యొక్క సాహితీ జీవనయానాన్ని ప్రస్తుత తరానికి నూతన కవితానే్వషకులకు, అక్షర సేద్య కృషీవలురలకు అందించిన పూసపాటి శంకరరావు విరచితం ‘పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ’ అనే పూసపాటి వారి గ్రంథం నేటి కవితరానికి ‘పూసకట్టు’ కాగలదు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల అనే గ్రామం సాహిత్య అగ్రహారంగా పేరొందని చెప్పవచ్చు. తిక్కన సోమయాజి లాంటి మహాకవికి బంధుత్వాన్ని ఏర్పర్చుకున్న ఆ వూరు పద్మ పురాణాధికృతులు రచించిన మడికి సింగన్నకవి జన్మస్థలం. శ్రీ వీరబ్రహ్మేంద్ర జీవిత చరిత్ర, ఆదర్శ పద్మిని, శిల్ప సుందరి లాంటి పరిశోధనా గ్రంథాలు రచించిన లబ్దప్రతిష్ఠులైన పూసపాటి నాగేశ్వరరావు గ్రామం కూడా రావెల. సాహితీమూర్తి, అవధాన బ్రహ్మ స్వర్గీయ పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ అనే గ్రంథాన్ని డా.పూసపాటి శంకరరావు రచించి భవిష్యత్ తరానికి సాహిత్య వెలుగును చూపారు. స్వర్గీయ పూసపాటి నాగేశ్వరరావుసాహిత్య నడక, నడత ఏ దారిన పయనించిందో గ్రంథం దిక్చూచిగా నిలిపి శంకర్‌రావు కృతకృత్యులైనారు.
ఒక పరిశోధకునికి ఒక రచయిత బహుముఖ సాహితీ వ్యక్తిత్వాన్ని వడిసిపట్టి చూపాలన్న అంతటి శక్తియుక్తులు తనకీ ఉండవల్సిందేనన్న గ్రంధకర్త కలం నాగేశ్వరరావు గారి ప్రతిభ ప్రతి అధ్యాయంలో ప్రస్ఫుటం చేసింది. నాగేశ్వరరావుగారి జన్మభూమి వైశిష్ట్యం దగ్గరనుంచి విభిన్న దృక్పథాలు కల్గిన సాహితీ ప్రముఖుల ప్రశంసలవరకు ప్రతి పథాన్ని(దారిని) వడిసిపట్టి సాహితీప్రియులకు పూసపాటి వారి సాహితీ చిక్కందనాన్ని పూసకట్టి చూపటం ఈ గ్రంథ వైశిష్ట్యం.
నేటి నవ సాహిత్య తరానికి ఈ గ్రంథం ఆదర్శ కరదీపిక- వెలుగు దివిటి కాగలదని ఆశిద్దాం.

- పి.ఎం.ఎస్.ప్రసాద్