పఠనీయం

ఇదొక రామాయణ నవీన వ్యాఖ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకథా విప్లవం
9848161208
మూల్యం : రూ.200
ప్రతులకు
నవోదయ పబ్లికేషన్స్, ఆర్య సమాజ్ మందిర్ ఎదురుగా,కాచిగూడక్రాస్ రోడ్స్, హైదరాబాద్
040- 24652387
ఫ్లాట్ నెం. 102,105, 302, అలేఖ్య రెసిడెన్సీ, కూరగాయల మార్కెట్ రోడ్, నల్లకుంట
హైదరాబాద్- 44 , 040-27610063
*
భారతదేశంపై శ్రీరామతత్వానికి ఉన్నంత ప్రభావం స్ఫూర్తి మరో గ్రంథానికి లేదు అనటం అతిశయోక్తి కాదు. అందుకే మరల నిదేల రామాయణంబు అంటూ విశ్వనాథ వారు ప్రశ్న వేసుకొని తన జీవునివేదనను ఆవిష్కరించారు. రామాయణానికి వివిధ మత కర్తలతో బాటు వివిధ దృక్పథాలకు చెందిన సామాజిక శాస్తవ్రేత్తలు కవులు కళాకారులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇపుడు పారుపల్లి వెంకటేశ్వరరావు ఒక నవల రచించారు. దీనికి రామాయణ విషవృక్షం కాదు- రామకథా విప్లవ వృక్షం అని పేరు పెట్టారు. దీనిని నవల అనటంకన్నా ఒక ఆధునిక వ్యాఖ్యానం అనటం సమంజసంగా ఉంటుంది. సమాజంలో పీడితులు తాడితులు ఎందరో ఉన్నారు. పాలకుడు దుర్మార్గుడైనాడు. అప్పుడు ప్రజాశక్తి ఒక వీరునిగా ఆవిర్భవించి ఈ దుర్మార్గుల దోపిడీని నిరోధిస్తుంది. ఇది తరతరాలుగా వివిధ దేశాల్లో జరుగుతున్న చరిత్రకు అదే రామాయణ కాలంలోనూ జరిగింది అంటారు పారుపల్లివారు. రావణుడు ప్రజాకంటకుడు. జనస్థానంలో జరిగినది ధర్మబద్ధమైన విప్లవ శక్తులకు - దోపిడీదారులకూ మధ్య జరిగిన పోరాటం అంటే విప్లవశక్తి జయించింది. అదే శ్రీరామ పట్ట్భాషేకం.........
‘‘రాముడు మహాపురుషుడైతే సీత మహామహిళ’’- రామ రావణ సంగ్రామం తరం తరం నిరంతరం మానవాళిలో జరుగుతున్న దైవాసుర సంగ్రామం. ఈ దృష్టితో రామాయణాన్ని కథారూపంలో ఆవిష్కరించడానికి పారుపల్లి వెంకటేశ్వరరావుగారు చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేశారు. శైలి సరళం, భావం నిశితం, భాష వ్యావహారికం.. భాష్యం నవీనం. ఎంతో పాత కథకు నేటి దేశ కాల పరిస్థితులకు అనుగుణమైన ఆమోదయోగ్యమైన వ్యాఖ్యానం. దీనిని ఒక నవలగా కాక ఒక సామాజిక శాస్త్రంగా అధ్యయనం చేయటంలో పారుపల్లివారి అవగతం అర్థమవుతుంది. పుస్తకం చిన్నదే అయినా ఆలోచన మిన్నది.
రైతు లేనిదే రాజ్యం లేదు. పంచవటి విప్లవ కేంద్రం అన్నారు రచయిత. ఇదొక అభినవ దర్పణం అన్నారు వ్యాఖ్యాతలు. అంటే రామాయణానికి ఇదొక శ్రామిక భాష్యం. దీనికి నవీన విశే్లషణాత్మక పౌరాణిక నవల అని పేరు పెట్టడం బడాయి కాదు ఆత్మస్తుతి అంతకన్నా కాదు. ఈ వ్యాఖ్యానం కొత్తగా గమ్మత్తుగా ఉంది. చదవండి. తోటివారితో చదివించండి. ఇది సంప్రదాయబద్ధ ఐతిహాసిక గద్య ప్రబంధం కాదు. ఇదొక రామాయణ నవీన ఆర్థిక సామాజిక భావజాలం. పారుపల్లి వారి విజయదశమిలో ఇదొక పారు వేట- అభినందించండి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్