పఠనీయం

ఇది ఒక జిల్లా అంతర్వాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్వాహిని -
రచన: భీమనాదం హనుమారెడ్డి
వెల: అమూల్యం,
ప్రతులకు: రచయిత
రాజా పానగల్ వీధి,
ఒంగోలు (ఎ.పి)- 523002
*
ప్రతి కళాకారుడు గుర్తింపును కోరుకుంటాడు. కాని ఇతరుల గుర్తింపు కోసం తపన పడేవారెందరున్నారు? కవి గాయక బృందాలకు తానే మైక్‌గా మారినవారిలో హైదరాబాద్‌లో పోతుకూచి సాంబశివరావు, ఒంగోలులో భీమనాదం హనుమారెడ్డిగారు ఈ తరంలో అరుదైన వ్యక్తులు.
ఒంగోలుకు సమీపంలోని అద్దంకి ఒకప్పుడు అనవేమారెడ్డిగారు రాజధాని. కవిత్రయంలోని ఎర్రా ప్రగడను పోషించింది ఈ రెడ్డి రాజులే. అక్కడ ఒక వ్యవసాయ కుటుంబంలో హనుమారెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ముగించుకుని లాలో పట్టా సంపాదించి న్యాయవాదిగా ఒంగోలులోని రాజాపానగల్ వీధిలో స్థిరపడ్డారు. అక్కడికి సమీపంలో లాయరుపేట వుంది. అంటే ఎందరో ప్లీడర్లు ఉన్నారు. ఐతే వారెవరూ చేయలేని రెండు పనులు భీమనాదం వారు చేశారు. ఒకటి అద్దంకిలో నేటికి 1400 సంవత్సరాల పూర్వం నాటి పండరంగని శిలాశాసనానికి గుడి కట్టించటం. ఈ శాసనాలలో తరువోజ దేశీఛందం ఉంది. అంటే తెలుగు భాషా ఛందస్సుల వికాసంలో ఇదొక ప్రధానఘట్టం అని సాహివేత్తలకు తెలుసు. ఇక రెండవ పని ప్రకాశం జిల్లా రచయితల సంఘం స్థాపించి దానికి అధ్యక్షునిగా ఉండి కవుల సంకలనాలను ఆదరించటం గ్రంథాలను ప్రచురించడం. ప్రకాశం జిల్లా కీర్తిని రాష్టమ్రంతా వ్యాపింపజేయటం.
నిజానికి ప్రభుత్వ సాహిత్య సాంస్కృతిక శాఖ నిర్వహింపవలసిన గురుతర బాధ్యతను ఒక వ్యక్తి తన భుజస్కంధాలపైకెత్తుకుని చేయటం ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కూడా కల్గిస్తుంది. ఈ పనిరాక్షసుడు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కుటుంబ కష్టసుఖాలను పరిగణనలోనికి తీసుకోకుండా సమాజంకోసం అంకితం కావటం యాదృచ్ఛికమా? దైవ నిర్ణయమా?
కొంతకాలం క్రితం మధుర కవితలు వెలువరించారు. తర్వాత అద్దంకి, ఒంగోలు ప్రాంతాలలోని రెడ్డి రాజుల ప్రామాణిక చరిత్రను పరిశోధనాత్మక గ్రంథంగా వెలువరించటం ఇపుడు అంతర్వాహిని పేరుతో తన స్వీయ చరిత్రను లోకార్పణం చేయటం. ఇంతేకాదు ‘వర్గకవి శ్రీశ్రీ’ అనే విశే్లషణాత్మక గ్రంథం వెలువరించి సంచలనం సృష్టించారు. శ్రీశ్రీ కవిత్వానికి నీరాజనం అందించారు.
ఐతే ఆయన మహాప్రస్థానం వ్రాసేనాటికి మార్క్సిజం ప్రాథమిక సూత్రాలు తెలియవు. ఆ తెలివిడి వచ్చిననాటికి శ్రీశ్రీలోని కవి అంతరించి ఓ సినిమా పాటల రచయిత మాత్రమే మిగిలాడు. వర్గ కవి శ్రీశ్రీ గ్రంథం హనుమారెడ్డికి అశేష ఖ్యాతిని తెచ్చిపెట్టినట్లే కొందరు ప్రత్యర్థులనుకూడా మూట కట్టుకునేటట్లు చేసింది. ఐతే హనుమన్న న్యాయవాదం సుప్రీంకోర్టు తీర్పు వంటిది. అందుకని అంతా శిరసావహింపవలసిందే. ఈయన కవి జనపక్షపాతి. పుట్టిన గడ్డ ఋణం తీర్చుకున్న సహృదయుడు. పల్లెకు దండం పెడతా- మావూరు మొలకెత్తింది వంటి దీర్ఘ కవితలలో రెడ్డిగారు తాను పుట్టిన సమాజానికి ఐదు పది చేసి నుతులు అర్పించారు. పావని సంక్షిప్తంగా జీవన పరిణామాన్ని వర్ణించిన రచన. వెనె్నల గీతం వృద్ధాప్యం ఇతివృత్తం.
మహిళా రిజర్వేషన్లు విద్యార్థి రాజ్యాంగం పరిశోధనాత్మక సామాజిక సమస్యా విశే్లషణాత్మక వ్యాసాలు. ఇవి వ్రాయడానికి ఆయన న్యాయవాద పాండిత్యంతోబాటు సామాజిక స్పృహ కూడా సహకరించింది. చాలారోజుల తర్వాత హనుమారెడ్డిగారి అంతర్వాహిని అక్షరరూపం దాల్చింది. ఇది కేవలం ఒక రచయిత ఆత్మకథ మాత్రమే కాదు, ఒక జిల్లా 20వ శంతాబ్దపు సాంస్కృతిక చరిత్ర? పరిశోధక విద్యార్థులకు పాఠేయం. ఉపాధేయం!
78 సంవత్సరాల వయస్సులో త్రవ్విపోస్తున్న జ్ఞాపకాల రాసులు, అంతర్వేదన - సంఘర్షణ - సమన్వయం. రచయిత స్వంత మాటల్లో ‘విధ్వంసపు జ్ఞాపకాల అగ్గిబుగ్గి విచ్చుకున్న సంకల్పాలు పేర్చుకున్న సమాలోచనలు’-

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్