పఠనీయం

జాతి పరిణామాన్ని చెప్పే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెగడు- నాగరి‘కత’లు-
రచన:బొర్రా గోవర్థన్,
వెల:రూ.150/-,
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ గుంటూరు మరియు
విశాలాంధ్ర బుక్ హౌజ్ వారి బ్రాంచీలు.
*
‘నెగడు’ అట్టమీది వివరణ చదివాక, కథలంటే ఇవి, ఇప్పటి మన ఆధునిక జీవనంలోంచి వచ్చిన కథలు అనుకుంటాము. కాని ఇది సుమారు ఏభై లక్షల ఏళ్ళ క్రితం నాటి కథలు. ఆనాటి హోమినిడి చింపాంజీలకు సంబంధించిన కథతో మొదలై ఇరవయి అయిదువేల సంవత్సరాల క్రితం వున్న క్రో-మాగ్నన్ మానవుడి జీవిత చిత్రణతో ముగుస్తుంది. మధ్యలో ఆస్ట్రలోపితికస్, హోమొహెబిలిన్, హోమో ఎరక్టస్, హోమో ఎర్గాస్టర్ మరియు నియాండర్తల్ మానవులకు సంబంధించిన వివరాలను కధలరూపంగా మలచి ఆసక్తికరంగా వివరించారు రచయిత బొర్రా గోవర్థన్.
వర్తమానంలోంచి, లక్షల ఏళ్ళ వెనక్కు వెళ్లి అక్కడినుండి మన సుదీర్ఘ ప్రయాణపు వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తిగల పాఠకులకు, గోవర్థన్ గారి ఈ పుస్తకం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది.
ఇంతేకాకుండా, రచయిత విషయ వివరణలో కన్పరిచిన తీరు, సామాన్య పాఠకుడి స్థాయికి దిగివచ్చిన శైలి ఎంతో ఆసక్తిదాయకంగా వుంది. పెద్దగా వైవిధ్యం లేని ఆనాటి నరవానరుల జీవితం, వాతావరణం, రచయిత తన ఊహాశక్తితో లాజికల్ అనిపించే తీరులో సాగుతారుూ కథలు.
మానవుని నాగరికత, పరిణామాలను మొట్టమొదటగా వివరించినవాడు రాహుల్ సాంకృత్యాయన్ (ఓల్గా సే గంగ). ఆయనకు ధీటుగా గవర్థన్‌గారి ‘నెగడు’ ఉందనటంలో అసత్యం లేదనుకుంటాను.
ఈ కథలు ధారావాహికగా ‘స్వేచ్ఛాలోచన’ అనే పత్రికలో లోగడ వస్తున్న రోజులలో, కొందరు ఆనాటి వారి రూపురేఖలు అలాగే ఉన్నాయని మీకెలా తెలుసు? అని అడిగారట. శిలాజావశేషాలలో దొరికిన ఏ చిన్న ఆధారంతోనైనా ఆ జీవి రూపురేఖల ఊహాచిత్రణ చేయగలిగే పరిజ్ఞానం మన నేటి కంప్యూటర్లకు ఉందంటారు రచయిత.
‘నెగుడు’కు ముందుమాట రాసిన సాహితీవేత్త, జీవశాస్తవ్రేత్త డా దేవరాజు మహారాజు గారన్నట్లు- ఈ రచయిత చేసిన ఈ ప్రయత్నం ప్రత్యేకమైందే కాదు, ఎంతో విలువైంది కూడా! మరో భాగం (కొత్త రాతియుగం నుండి రాగియుగం వరకు) కూడా వీరి కలం నుండి వస్తుందని ఆసక్తిగా ఎదురుచూద్దాం.

-కూర చిదంబరం