పఠనీయం

నాగరికత మనుషుల్లోనా? పరిస్థితుల్లోనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానధనులు
ఇంగ్లీషు రచన: హోవార్డ్ ఫాస్ట్
తెలుగు అనువాదం
కె.వి.ఆర్.
వెల : రూ.150/-లు.
ప్రతులకు
డా. ఎస్. రామకృష్ణ, శాంతి నర్సింగ్ హోం
పటమట , విజయవాడ -10
సెల్ నెం 9849083137
*
హెన్రీ డేవిడ్ ధూరూ అనే ఆంగ్ల తత్తవేత్త ఇలా అంటాడు. ‘‘ఎంతటి నాగరికుడినైనా కాస్త కదిలించి చూడు, ఆయన లోని అనాగరికత బయటకు వస్తుంది’’ క్రిస్ట్ఫోర్ కొలంబస్ అనే ఇటలీ నావికుడు స్పెయిన్ ప్రభుత్వం తరఫున యాదృచ్ఛికంగా అమెరికా దేశాన్ని 1492లో కనుగొన్నాడు. ఆ తరువాత 1519 నుంచి యూరోపు నుండి వలసలు ఆరంభం అయ్యాయి. ఈ వలసదారులు, అంతకుముందే ఆదేశంలో ఉన్న రెడ్ ఇండియన్స్‌ని అనేక దుష్కుృత్యాలకు గురి చేసారు.
స్థూలంగా ‘రెడ్ ఇండియన్స్’ అనబడే వివిధ ఆదిమ జాతుల్ని ‘రిజర్వేషన్ కేంపు’ ల్లోకి తరిమారు. స్వేచ్ఛా ప్రియులైన ఈ ఆదిమ జాతులు దీనిని ప్రతిఘటించాయి. ఆధునిక ఆయుధాల ముందు ఈ ఆదిమ జాతుల బల్లేలు, కత్తులు నిలువలేకపోయాయి. పాశ్చాత్యులు పాశవికంగా ఆదిమ జాతుల్ని నిలువరించి రిజర్వేషన్ కేంపులకు పరిమితం చేశారు.
హోవర్డ్ ఫాస్టు (1914-2003) అనే న్యూయార్కు వాసి పత్రికలు మరియు ఇతర మీడియా ఈ ఆదిమ జాతుల గురించి చేస్తున్న అసత్యప్రచారాలను నిలువరించదలిచాడు. ఒక హమా రిజర్వేషన్ కేంపుల్లో ‘చెయన్నీ’ జాతుల కేంపులో ఒకడై ఉండి రాసిన The Last Frontier -1914 అనే ఇంగ్లీషు నవలకు తెలుగు అనువాదం ‘‘మానధనులు’’
క్రీ.శ. 1879 లో 300మంది చెమిన్ని ఇండియన్‌లు ఒక్లహామా రాష్ట్రంలోని రిజర్వేషన్ కేంపులోంచి తమ స్వప్రాంతమైన పౌడర్ నది ప్రాంతానికి దగ్గరే ఉన్న ‘వ్యోమాంగ్’ చేరుకునే ప్రయత్నం చేస్తారు.
అప్పటి అమెరికా ప్రభుత్వం కేప్టెన్ మునే్న నాయకత్వంలో చెమిన్నీలను నిలువరించి తిరిగి రిజర్వేషన్ కేంపుల్లోకి తరమటం - ఈ నవల లోని కథావృత్తం. గొప్ప జనాదరణ పొందిన ఈ నవల గురంచి మూల రచయిత - కేప్టెన్ ముర్రే పాత్ర మినహాయించి మిగతా నవల మొత్తం చెమన్నీల జీవనాన్ని యథాతథంగా రాసానని రచయిత చెప్పుకున్నారు.
నవలలో ఎన్నో చోట్ల అమెరికన్ల జాత్యంహంకారాన్ని వివరిస్తాడు రచయిత. అనాగరికులతోటి ఎప్పుడో 13 ఏళ్లకిందట చేసుకొన్న సంధి అప్రస్తుతమే కాకుండా, అప్రధానం కూడా (పే.78)
అనాడు ఇండియన్ల పట్ల మన వైఖరి సూచించటానికే పనికి వచ్చింది తప్ప అదేమీ (సంధి) శాసనం కాదు - పేజి. 72.
‘ఆడవాళ్లను సోదా చేస్తే సరి!
ఆడవాళ్లనా..?’ ’
‘‘ వీళ్లు తెల్లవాళ్లు కాదుగా? ఇండియన్లు కనుక ఫరవాలేదు.’ ’ - పేజి.నెం. 65.
ఇంతటి వివిక్షతయా!
‘సువిశాలమైన పచ్చిక బయళ్లల్లో ఒకనాడు.. స్వేచ్ఛగా మసిలి అత్యంత గౌరవపరులైన ఇండియన్లీ నాడు పరాధీనులై, నిస్సహాయులై చావును సమీపిస్తున్నారు’ - పేజి. 169
ఇదీ వలస వచ్చిన యూరోపియన్లు - అక్కడి ఆదిమజాతుల పట్ల రక్షణ చట్టాలున్నా చూపే ఆదరణ!!!
‘‘వాళ్లా లొంగిపోయేది! చావాలని కోరుకుంటారు తప్ప ఈ .....కొడుకులకు కావల్సింది మరేమీ లేదు. - చావు(పే.195) పుట్టి పెరిగిన నేల మీద రెడ్ ఇండియన్ల మమకారానికి ఈ వ్యాఖ్యానం అత్యంత నాగరికులుగా చెప్పబడే అమెరికన్లకు సాటి మానవుల ఎడ ఇదీ ప్రేమ!!
హోవర్డ్ ఫాస్టు రచనకు తెలుగు అనువాదం కె.వి.ఆర్ గారు చేశారు. వీరు కవి, విమర్శకుడు. అంతేకాక నాటక రచయిత మరియు మార్కిస్టు మేధావి.
అనువాదాల్లో ఒక అసౌకర్యం ఉంటుంది. మూల రచయిత దేశకాల పరిస్థితులు మరియు పాఠకుడి దేశకాల పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎంతో శ్రద్ధ, మెరుగులు పెడితే తప్ప నవలకు పఠనీయత రాదు. పొడి శయ్య ( Dry Land) పేజి. 3,
నిరుద్రేకులై నిశ్చలురై(పే.29) (‘దుర్గర్వం’) పేజి. 65
సూర్యాస్తసమయాన్ని దూరిపోసాగారు. శుష్క కోపాన- పే.120.
ఇలాంటి పదాల ఎంపిక పాఠకుడికి కొంత అసౌకర్యాన్ని కలుగచేస్తుంది. కాని ఆసాంతం చదివితే విషయం అర్థం అయి పాఠకుడు అసలు అప్పటి విషయం తెలుసుకొంటాడు.

- కూర చిదంబరం 8639338675