జాతీయ వార్తలు

పఠాన్‌కోట్‌కు పాక్ దర్యాప్తు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో గత జనవరిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి విచారించేందుకు పాకిస్తాన్‌కు చెందిన దర్యాప్తు బృందం మంగళవారం పఠాన్‌కోట్‌కు బయలుదేరింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే.దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు పాక్ ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో నియమించిన దర్యాప్తు బృందం ఇక్కడికి చేరుకుంది. పఠాన్‌కోట్ ఘటనపై విచారణకు పాక్ బృందాన్ని అనుమతించడం సబబు కాదని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పఠాన్‌కోట్‌లో పాక్ బృందాన్ని అడ్డుకుంటామని ఆప్ నేతలు హెచ్చరించడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.