పఠనీయం

సమకాలీన జీవన ప్రతిఫలనాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకుబంతి కథలు
-డా.శాంతినారాయణ
వెల: రూ.50
ప్రతులకు: శ్రీమతి ఆర్.విమల ఎస్‌ఎస్ అపార్ట్‌మెంట్స్ మారుతీనగర్, అనంతపురం

*** ***** ********************

ఒకానొక సంఘటనకు సాక్షీభూతమైనపుడు ఆ వ్యక్తి ఉద్వేగానికి లోనవుతాడు. మామూలు వ్యక్తులు మరుక్షణం ఆ సంఘటనను మరిచిపోతారు. ఆ వ్యక్తి మనసున్నవాడై, మీదు మిక్కిలి రచయిత అయితే తీవ్ర ప్రభావానికి లోనై, తర్కించుకుని తర్కించుకుని మంచి చెడ్డల్ని మధించి తనదైన ఆలోచనలను జోడించి కాగితం మీద పెట్టేదాకా ఆయన మనసు నిలవదు. ఉద్విగ్నత ఎంత తీవ్రంగా ఉంటే, కథ అంత బాగా పండుతుంది.
‘బతుకు బంతి’ కథాసంపుటి రచయిత డా.శాంతినారాయణ గారికి కూడా ఇదే అన్వయిస్తుంది. ఇది వారి ఆరో సంకలనంగా చెప్పుకున్నారు. వారి ఇతర రచనలు చదవలేదు. బతుకు బంతి చదివాక రచయిత బాగా పరిణతి చెందినవాడనిపిస్తుంది. ఇవి నేటి దేశ, జీవిత ప్రతిఫలనాలు అనిపిస్తాయి. ఆడదాని శరీరం మొదలుకుని అమ్మ పాలు వరకు అన్నీ అంగడి సరుకులై పోయాయనిపిస్తుంది. జీవితం అనే బండికి బిగించి ఉంచి ‘నీతిశీలలు’ వదులై పోతున్నాయనిపిస్తుంది. సంప్రదాయాల పేరిట బడుగు బ్రతుకులు నలిగిపోతున్నాయనిపిస్తుంది.
ప్రపంచంలో అన్నింటికన్నా క్లిష్టమైనవి మానవ సంబంధాలు. అందులో మరీ క్లిష్టమైనవి ఎదిగిన స్ర్తి పురుషుల మధ్య సంబంధాలు. స్వభావరీత్యా పురుషుడు పరుషంగా ఉంటే, భార్యగా, తల్లిగా, ఇల్లాలిగా పలు పాత్రల్ని పోషిస్తూ, అందరి తప్పుల్ని కడుపులో దాచుకోవాలి స్ర్తి. ఆమే... కట్టుతప్పితే, నర్సింహారెడ్డి లాంటి భర్తలు తల నరికి ఊరవాకిలికి వేలాడదీస్తారు. ఓబయ్య అంతగా చదువుకోలేదు. కాని గొప్ప విచక్షణ ఉన్నవాడు. భార్య పద్మావతికి పెద్దింటి సెంద్రన్నతో ‘అఫైరు’ ఉందని తెలిసి కూడా ‘సంసారం సెడి సెటాకులు గాకుండా అట్టనే నెట్టుకుని వస్తా వుంటాడు!’ రమేష్, నిర్మల, ఓబయ్య, పద్మావతి, క్యాంపు మనిషి రంగయ్య- అందరివీ ‘కాంప్రమైజ్’ జీవితాలే ‘ఓబయ్య’ కథలో. మన పి.ఎం. మోదీగారి ‘స్వచ్ఛ భారత్’లోని భాగమే. బహిరంగ మలవిసర్జనను అరికట్టటం. అయితే ‘కక్కసుదొడ్డి’ నిర్మించుకోవటంలో ఎన్నో సాధక బాధకాలు. శుభ్రపరచటం, అవసరమైనన్ని నీళ్లు ఏర్పాటు చేయటం, రక్షణ; ఇవేవీ లేనపుడు పథకాలు విజయవంతం కాలేవు అని చెప్పే ‘అసలయినవి లేనపుడు’. పేదరికం మనిషిని ఏ నిర్ణయానికి కట్టుబడనీయదు (పే.51) భూమి పోగొట్టుకోకూడదని నీతి తప్పుతుంది తల్లి లక్ష్మి. నాయిన కర్మలు గనంగా చేసి ఆయన ఆత్మశాంతికి, బ్రతికి ఉన్న తల్లి మనఃశాంతికీ, డబ్బు అవసరం. అందుకని కూతురు శిరీష నీతి తప్పుతుంది.
చితికిపోయిన కుటుంబాల్లో ఈ కర్మకాండ తంతు ఓ ‘్ఫర్సు!’ వచ్చిన బంధువులు తాగి, తినీ నానా అల్లరి చేస్తారు. విసిగిపోయిన కూతురు ‘ఈ ముదనష్టపు కార్యం చేయకుంటే నాన్న ఆత్మ శాంతించదా అమ్మా! నా మానాన్ని అమ్మింది ఈ అసయ్యమైన పనికేనా అమ్మా’ అని (పే.75) చివరకు శిరీషతో ప్రకటింప చేసి మంచి సందేశం ఇప్పిస్తాడు ‘బతుకు బంతి’లో. కథాగమనం, చిత్రణ బావుంది.
సెల్‌ఫోన్ల రాక ప్రపంచపు రూపురేఖల్ని మార్చింది. ఈ సౌకర్యాన్ని ఆసరాగా చేసుకుని మోసగింపు వాళ్లెందరో పుడుతున్నారు. సుజాత వంటి అమాయకులెందరో ఉచ్చులో పడుతున్నారు. అక్క పెళ్లికని తండ్రి దాచిన డబ్బులు ‘అభిషేక్’ అనే సెల్‌ఫోన్ స్నేహితుడికి ఇచ్చి దారుణంగా మోసపోతుంది సుజాత. కథ చివర ‘ఈ పాపానికి కారకులెవరు? విజ్ఞానశాస్త్ర ఫలితాలా? ప్రభుత్వమా? వ్యాపార రంగమా? మానవ పశుగణమా?’ అంటూ ప్రశ్నిస్తాడు కథకుడు. సరైన కట్టుబాట్లు, కోరల్లేని చట్టాలు, అమలు చేయలేని ప్రభుత్వాలు అని అనుకోవాలి ‘ఈ పాపం ఎవరిది’లో.
మనిషి డబ్బుకు ఇస్తున్న విలువ మరి దేనికీ ఇవ్వటంలేదు. దాని ముందు అన్నీ దిగదుడుపే అవుతున్నాయి. తల్లి పదకొండో దినకర్మకు మోడికాళ్ల (శైవులు) వారింటికి ఇవ్వబడ్డ చెల్లెళ్లు, వైష్ణవుల ఇంటికర్మల (తల్లి అయినా సరే)కు రామంటారు. రాకూడదంటారు. అయితే, తల్లి వంటిమీది బంగారం ఆశ, వారి ఈ ఆచారాలన్నీ ప్రక్కకు నెట్టి రప్పిస్తుంది’ మైల పడుతున్న మనుషులు’లో.
ప్రసిద్ధ కాలమ్నిస్టు ‘జేమ్స్ క్రాబ్ ట్రీ’ మోదీగారి నోట్ల రద్దును ఇలా వ్యాఖ్యానిస్తాడు. నిఆ జఒ యశళ యచి ఆ్దళ ఇజళఒఆ ౄజఒఆ్ఘరీళ యఛి ఘోళశజ్ఘూ యజూక’ఒ ఖళ. నిఆ (ళ్యౄశజఆజఒ్ఘఆజ్యశ) జఒ ఘ పళూక ద్ఘూజూ ఆ్దజశ ఆ్య ఖఒఆజఛిక. నిఆ ఘౄక ద్ఘ్పళ ౄజశ్యూ ఇళశళచిజఆఒ. (నోట్ల రద్దు పి.ఎం. నరేంద్ర మోదీ యొక్క పెద్ద తప్పు. ఏ మాత్రమూ సమర్థనీయము కాలేదు. ఏవేవో చిన్నచిన్న ప్రయోజనాలు (దేశానికి) కలిగాయేమో!) ఇదే నాగన్న అనే సామాన్య రైతు ద్వారా రచయిత అనుభవపూర్వకంగా చెప్పిస్తాడు ‘తిక్కోని చేతిలో రాయి’లో. సామాజిక స్పృహ లేకపోతే, ప్రజలు ఏ విధమైన కష్టాల్ని ఎదుర్కుంటారో చెబుతుంది ‘మకురు’. ముట్టయితే స్ర్తిని దూరంగా ఉంచటం ఒకప్పటి సాంఘిక ఆచారం. అయితే, ఈ ఆచారంలో ఆమె ఎదుర్కొనే కష్టాలు ఏమిటో వివరించేది ‘ముట్టుగుడిసెలు’. ప్రజల సహకారం లేనిదే ఎన్ని చట్టాలు తెచ్చినా ‘జల్లికట్టు జాతర’ నాటి నిబంధనల మాదిరి నీరుకారిపోతాయని చెబుతుంది ‘చన్నుకట్టు జాతర’. ఈ జాతర రచయిత ఊహాకల్పితమై ఉండాలి. అమ్మ పాలు కూడా ‘అంగడి సరుకై..’ ఎగుమతి అవుతున్నాయన్న నిరసన ఈ కథలో ప్రకటించబడింది.
గొప్ప శైలి, శిల్పం, రచయిత గీచిన వర్ణ(న) చిత్రాలు, ఈ సంకలనంలోని ప్రత్యే‘కతలు’. ‘కనుగుడ్ల మీద నీళ్లు పారాడటం’ (పే.27) ‘పెదవుల్ని నోట్లోకి అదుముతూ, తిక్కచూపులు చూడటం’ (పే.35), ‘శబ్దం చేయని ఆలోచనలు’ (పే.62), ‘కాంచనం అంటే కాంక్షణం’ (94), ‘ఆవుల్ని చంపి చెప్పుల్ని దానం చేయటం’ (పే.165) లాంటి వర్ణనలు బావున్నాయి.
ఓబయ్య భార్య పద్మావతి ‘ఎక్కడో’ వేపించుకున్న పచ్చబొట్టు ప్రసక్తి; ‘ఎక్కడో తడి అవటం’ (పే.62) లాంటి వాక్యాలు లేకున్నా, కథలు రక్తి కట్టగలిగేవే ననుకుంటాను.
రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిగారి ముందు మాట సంకలనానికే హైలైట్! రాయలసీమ యాస, భాష, కథలకు గొప్ప సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. కథా రచయితగా ‘తనకు తాను వర్తమానీకరించుకున్నాడు’ అన్న రాచపాళెం గారి కితాబు నూటికి నూరుపాళ్లు నిజం.

-కూర చిదంబరం 8639338675