పఠనీయం

ఆసక్తికర అంశాలతో ‘గాడ్స్ ఆన్ అర్త్ ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాడ్స్ ఆన్ అర్త్
రచన:దేవిరెడ్డి సుబ్రమణ్యం తిరుపతి, ఫోన్:9849584324
=======================================================
తిరుమల గురించీ, తిరుపతి గురించీ, వేంకటేశ్వరస్వామి గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. ఇక ముందు కూడా వస్తాయి. ఈ పుస్తకాలు కూడా రకరకాలుగా ఉంటాయి. రకరకాల వ్యక్తులు రాస్తుంటారు. అయితే దేవిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డిగారి మూడు వందల పుటలు ‘గాడ్స్ ఆన్ అర్త్’ ‘తిరుమల చరిత్ర’ అనే గ్రంథం విభిన్నమైనదే.
చారిత్రక ఆధారాలతో ఆసక్తికరంగా రాయబడిన పుస్తకం. హడావుడి, రంగులు, స్వామి ఫొటో వగైరాలు లేకుండా ఒక శాసనం అట్టమీద కనబడి ఆకర్షింపజేస్తుందీ పుస్తకం. అయితే శీర్షికలో కొంత ఇంగ్లీషు, మరికొంత తెలుగు ఉంది. ఎందుకు అనే ప్రశ్న పొడసూపుతుంది.
రచయితకు ‘గాడ్స్ ఆన్ అర్త్’ అనే మాటలమీద మక్కువ ఉంది. ముందుమాటలో తను గౌరవించే వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపే సమయంలో కూడా ఈ మాటలు వాడారు. 47 అంశాలుగా రాయబడిన ఈ పుస్తకం రెండు విభాగాలుగా కనబడుతుంది. తొలిభాగాన్ని వేంకటేశ్వరుని భక్తి తత్వం పుట్టుక, వ్యాప్తి అనీ, తిరుమల ఆలయ ఆర్థిక పుష్టి, ప్రతిష్టలు అనీ రెండవ భాగం కనబడతాయి. 24 పాత ఫొటోలు ప్రత్యేక ఆకర్షణలు.
భారతీయ సంస్కృతి మూలాలు అనే ముందుమాట- గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, విశ్వపు ‘బిగ్‌బ్యాంగ్’ సంతానం అని మొదలవుతుంది. పుస్తకం ఎలా సృజింపబడిందీ, తన వాదం ఏమిటో ఇందులో ప్రస్ఫుటమవుతుంది.
గాడ్స్ ఆన్ అర్త్ అనే తొలి ఖండిక ఉపశీర్షిక- సైన్స్, ఆర్కియాలజీ, టెంపుల్ ఆర్ట్, హిస్టరీ చెబుతున్న నిజం అంటూ కనబడుతుంది. ముందుమాటలో కనబడే తొలి వాక్యానికి వివరణలాగా సాగిన ఈ అధ్యాయం చివర మనిషికి భక్త్భివన, ఆధ్యాత్మిక చింతన గురించి చర్చించి వేంటేశ్వరుడనే ప్రతీక, భావన ఎలా మొదలైందో వివరిస్తారు.
తొలినాళ్ళలో తిరుమల, తిరుచానూరు, తిరుపతి, తిరుపతి పుట్టుక, పుల్లిరాజు ఆవిర్భావం, తొండమాన్ ఆలయం పెరుగుదల, ఆచార్య పురుషులు, హరిదాసులు, అన్నమయ్య, పురందరదాసు, త్యాగయ్య, వెంగమాంబ, నాటకత్తెలు ఇలా విభజించుకుని పుస్తకం సాగుతుంది. ప్రాచీన తెలుగునేల హద్దుల్ని తెలుపుతోన్న తిరుమల చరిత్ర అందునా ఆసక్తికరమైన కోణంలో కూడా చర్చ చేస్తారు. ఇది మరింత లోతుగా వుంటే బావుండేది.
అంతేకాదు, పల్లవరాణి, పేటందేవి, యాదవరాజులు, శింగయ్య, విజయగండ గోపాలుడు, సాళువ నరసింహరాయలు, కృష్ణదేవరాయలు, పోర్చుగీసు యాత్రికుడు గాస్పక్ కొవీయ, పోర్చుగీసు గోవా గవర్నర్ మార్పిం అఫాన్సో డీసౌజా, సుదర్శన రాయలు, కేట్రీ రచనలు, చంద్రగిరిలో అడుగుపెట్టి వ్యాపించిన క్రైస్తవం, దానాలు, ప్రసాదాలు, ఆర్కాడు నవాబులు మహంతులు- ఇలా సాగుతుందీ రచన.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగపు ఆచార్యులుగా పదవీ విరమణ చేసిన దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి సంబంధిత అంశాలలో ఇదివరకే పరిశోధన చేశారు, రచనలు వెలువరించారు. చాలా విషయాలు ఒకచోట చేర్చిన పుస్తకంగా ప్రత్యేక విలువ గల్గి ఉంది.
ఉదాహరణకు తిరుపతి కీ.శ.1130 సం. ఫిబ్రవరి 24 సోమనామ సం. ఫల్గుణ పౌర్ణమి ఉత్తర నక్షత్రం సోమవారం అని చర్చించి వివరిస్తారు. అప్పటికి ఆ ఊరు తిరువీధి, కర్నలవీధి, చేరి వీధి, గాంధీరోడ్లమధ్య అంటే గోవిందరాజ స్వామి ఆలయంతోపాటు నాలుగు మాడ వీధులన్నమాట ప్రారంభించింది రామానుజాచార్యులు. అప్పటికి వారి వయసు 102 సంవత్సరాలు.

-నాగసూరి వేణుగోపాల్ 9440732392