పఠనీయం

అంతరంగానికి సాక్షీభూతాలీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనసాక్షి కథలు
రచన: నక్షత్రం వేణుగోపాల్, వెల: రూ.100/-,
ప్రతులకు: రచయిత, నక్షత్రం జి మెయిల్ డాట్ కామ్ మరియు సంపత్ బెల్లంకొండ, 1-5-328/1, సూర్యనగర్ కాలనీ,
ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్-10
=============================================================
కారణాలు ఏవైనా కావచ్చు. కాని తెలంగాణ ప్రాంతం నుండి వెలువడాల్సినంత తెలుగు సాహిత్యం వెలుగు చూడలేదు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత రచయితలు, రచయిత్రులు ఆ పనికి ఉత్సాహంగా పూనుకుంటున్నారు. దీనికితోడు, వేరు రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సాహిత్య అకాడమీవారు డా నందిని సిధారెడ్డిగారి నేతృత్వంలో చేస్తున్న కృషి నిరుపమానమైనది. 2014 తరువాత అకాడమీవారు ఎందరో సాహితీవేత్తలకు వెన్నుదన్నై నిలుస్తున్నారు. ఇనుమడించిన ఉత్సాహంతో సాహితీ స్రష్టలు కూడా ముందుకు రావటం ఎంతో ముదావహం.
సాహిత్యంలో ‘కథ’కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కవిత్వంలో వీలుకాని విపులత, నవలలో సాధ్యంకాని క్లుప్తత కధవల్లనే సాధ్యమవుతుంది. దీనికితోడు ఉరుకుల పరుగుల ఆధునిక జీవన సరళిలో తీరికగా కవిత్వాన్ని ఆస్వాదించటం కాని ఓపికగా వారాల తరబడి సీరియల్ నవలలు చదివే వెసులుబాటు కాని ఉండటం లేదు.
పెద్దింటి అశోక్‌కుమార్, కె.వి.నరేందర్, రామచంద్రవౌళి లాంటి ప్రభృతులు తెలంగాణ కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. ఎందరో ఔత్సాహిక కథకులు జీవన సంఘర్షణలను సమర్థవంతంగా కథలుగా చిత్రీకరిస్తున్నారు.
‘వౌనసాక్షి’ కథా సంకలన రచయిత నక్షత్రం వేణుగోపాల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇటు తెలంగాణ జీవితాన్ని సామాన్య పౌరుడిగా అనుభూతించాడు. అటు ఎన్.ఆర్.ఐగా కొంతకాలం అమెరికాలో గడిపి అనుభవాలను ప్రోగుచేసుకున్నారు. కథారచనే కాకుండా లఘు చిత్ర నిర్మాణంలో కూడా తన ప్రతిభను పరీక్షించుకున్నాడు.
వర్తమాన సామాజిక పరిణామాలు మానవీయ విలువల్ని ఎట్లా క్షోభపెడుతున్నాయో గమనించాడు. గ్లోబుకు రెండు వేపులా తన అనుభవాలు, లోకం తీరు, వివిధ జీవితాంశాలలో, అదే మానవుడు ఎట్లా సంఘర్షిస్తాడో గమనించాడు. తన గమనాల్ని, ప్రోవుచేసుకున్న అనుభవాల్ని పదకొండు కధలుగా మనకు అందిస్తున్నారు.
సంకలనంలోని 5 కథలు భారతీయుల ప్రవాస జీవితాన్ని, రెండు కథలు రైల్వే అనుభవాలను, కథ బాబ్రీ మసీదు వివాదం గురించి వివరిస్తాయి. మిగిలిన కథల్లో తాను కన్నవీ, విన్నవీ, అనుభూతించినవీ చిత్రించాడు.
ఏ రచయిత అయినా, తన చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి మధనపడకుండా ఉండలేడు. అలాంటి మధనలోంచి వచ్చిన ఎన్నారై కథలు- నాతిచరామి, పిలుపు, మేకప్, సూపర్‌హీరో మరియు వెలితి. దేశ కాల పరిస్థితులు మారినా ‘ఆడది’ ఒక వస్తువు కాదని చెబతుంది నాతిచరామి కథ. భార్యాభర్తలు కేవలం డబ్బు సంపాదించే యంత్రాలుగా మారకూడదని పిలుపు కథ చెబుతుంది. సూపర్ హీరోగా ఎదిగినా, సూపర్ డూపర్ నటుడైనా తన మూలాలను మరువద్దని ప్రబోధించే కథ సూపర్ హీరో. రైల్వే డ్రైవర్ ఉద్యోగంలోని ఆటుపోట్లను రైల్వే సత్యం చెబితే- ట్రైన్‌లలో అడుక్కునే బిచ్చగాళ్ళను సైతం మనుషల్లాగానే చూడాలని ‘వౌనసాక్షి’ కధ వివరిస్తుంది. మతాలు ఏవైనా మనుషులందరూ ఒక్కటే. అందరిదీ ఒకే మతం - అదే మానవ మతం అని మృగాలమధ్య చెబుతుంది.
రారుూ, రత్నం - రెండూ ఒకేచోట పుట్టినా వాటి విలువలు వేరువేరుగా ఉంటాయి. కారణం- రత్నంగా మారకముందు ఆ రాయి ఎన్నో సంఘర్షణలకు లోనయి నిలుస్తుంది కనుక. అట్లాగే సంకలనంలోని కధలను మరింత సానపెడితే ఇంకాగొప్ప కధలవుతాయి!

-కూర చిదంబరం 8639338675