పఠనీయం

విశే్లషణాత్మక పౌరాణిక నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాంచాలి పంచభర్తుృక కాదు ద్రౌపది అర్జునుని ధర్మపత్ని ( పౌరాణిక నవల )
రచన:పారుపల్లి వెంకటేశ్వరరావు, వెల:రూ.250/-, ప్రతులకు:
రచయిత, 102, అలేఖ్యా రెసిడెన్సీ, కూరగాయల మార్కెట్ రోడ్, నల్లకుంట, హైదరాబాద్-500044.
===============================================

శ్రీయువత పారుపల్లి వెంకటేశ్వరరావుగారు సుమారు 90 ఏళ్ళుగా లోకం పోకడల్ని గమనిస్తున్నారు. కలాన్నీ, ములుగర్రను రెంటినీ ఒడుపుగా పట్టుకుని, ఇటు సాహిత్య కేదారాలను, అటు సస్య కేదారాలను సుసంపన్నం చేస్తున్న ఆలోచనాశీలి. ఆరు ఆధ్యాత్మిక గ్రంథాలు, పలు నవలలు, వ్యాసాలు, కథలు రాసి తెలుగు పాఠకులను మెప్పించిన ప్రతిభాశాలి.
ఎత్తుకున్న విషయాన్ని కూలంకషంగా చర్చించి, పరిశోధించి, ఉచితానుచితాలు గమనించి రాయటం వారి ప్రత్యేకత. మహాభారతంలోని ద్రౌపది పాత్రపై ‘‘పాంచాలి పంచభర్తుృక కాదు- ద్రౌపది అర్జునుడి ధర్మపత్ని’’ అన్న శీర్షికతో సుమారు 150 పేజీలు మహాభారతముపై తనదైన శోధన వ్యాఖ్యానము వ్రాసినారు.
శ్రీ పారుపల్లి ఆలోచన ప్రకారము- ‘‘ఒక రాజుకు ఇద్దరో ముగ్గురో రాణులున్న చరిత్ర ఉంది. కానీ ఐదుగురు సోదరులకు ఒకే ఒక భార్య (పట్టమహిషి) ఉండటం అసంబద్ధం’’అంటారు. ‘‘అభ్యుదయ సామాజిక పరిణామం, అనాగరిక దశకు మళ్లింది. ఇది ‘కుహనావ్యాసులు’ చొప్పించిన ప్రక్షిప్తాలు’’ (పే 6) అంటూ అభ్యంతర పెడతారు. తనదైన వ్యాఖ్యానంగా రచయిత ‘మత్స్య యంత్రాన్ని ఛేదించి పాంచాల రాజు కుమార్తె ద్రౌపదిని అర్జునుడొక్కడే చేపట్టినట్లుగా చెబుతున్నారు. కారణాలు ఇవి అని వివరించబడలేదు.
కాని, రచయిత ధర్మరాజును చిత్రించిన తీరు భిన్నంగా వుంటుంది. తన తమ్ముడు గెలుచుకున్న కన్యను తనకీయమంటాడు (పే 61). పాంచాలి తమ అయిదుగురికి భార్య కావాలని అంటాడు (పే. 64). ధౌమ్యుడు లాంటి పెద్దలు మరియు తమ్ముల ఆక్షేపణతో తన కోరిక నుపసంహరించుకుంటాడు (పే 66).
తర్వాతి కాలంలో ధర్మరాజుకు గోవాసనుడి కూతురు దేవికతో, భీమునకు జలంధరతో, నకులునకు రేణుమతి మరియు సహదేవునకు విజయ అను రాకుమార్తెలతో వివాహాలు జరిగినట్లుగా రచయిత పేర్కొంటారు.
ఇంద్రప్రస్థపుర నిర్మాణం, రాజమిత్ర యాగం (రాజసూయ యాగం కాదు) మాయాద్యూతం (పే.131) పాండవులు వనవాసానికి పోవటంతో, పుస్తకం ముగుస్తుంది.
పారుపల్లివారి ఈ కథనానికి ఆధారాలు, గ్లోజరీ లాగా ఇస్తే, ఈ రచనకు నిబద్ధత చేకూరేది. ఈ సందర్భంలో శ్రీ నాయుని కృష్ణమూర్తిగారి ‘జయమ్’ (మహాభారత మూలకథకు నవలారూపం) పేర్కొనదగ్గది (ప్రకాశకులు:విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి) తన ‘నవల’కు ఆధారంగా ఉపకరించిన గ్రంధాల పట్టిక ఇచ్చారు.
ఆ మాటకు వస్తే, ఉత్తర భారతదేశంలోని పంజాబు ప్రాంతపు కొన్ని పల్లెల్లో ‘బహుభర్తుృత్వం’ నేటికీ కొనసాగుతున్నదని- ఇది వారికి తరతరాలనుండి వస్తున్న ‘ఆచారం’ .కనుక ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోన్నదని కొనే్నళ్ళక్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
నవీన, విశే్లషణాత్మక నవలగా చెప్పబడిన ఈ రచన, ఊహామయ అంశాలకు, చారిత్రక పౌరాణికాలను జోడించి వివరించటం శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావుగారి ఊహాశక్తికి నిదర్శనం.

-కూర చిదంబరం 8639338675