పఠనీయం

అరాజకం నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తచరిత్ర
రచన: వుప్పల నరసింహం, వెల:రూ.250/-,
ప్రాప్తిస్థానం: వివిధ పుస్తక విక్రేతల కేంద్రాలల్లో.
===========================================================
పారిశ్రామిక యుగం యూరప్‌లో ప్రారంభమైన తర్వాత కొత్త సౌకర్యాలతోబాటు సరికొత్త సమస్యలుకూడా వచ్చాయి. ఉత్పత్తి సాధనాలు కొందరు ధనవంతుల చేతిలోకి వెళ్లిపోగా శ్రామిక వర్గం ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలల్లో ఏర్పడింది. ఫ్రాన్సు, రష్యా, చైనా, నేపాల్ వంటి చాలా దేశాల్లో రాచరికం కూలిపోయి ప్రభుత్వాలు సామన్యవాదుల చేతిలోకి వెళ్లాయి. ఐతే ఫ్రాన్సులో రష్యాలో చైనాలో తత్పూర్వ ప్రభుత్వాలను మించిన అరాచక శక్తులు అధికారం చేజిక్కించుకున్నాయి. ఫలితంగా ప్రజలకు ప్రాథమిక హక్కులు అంతరించి కన్నీళ్లు మిగిలాయి.
ఈ దశలో 1947 తర్వాత భారతదేశం కూడా బ్రిటన్ సామ్రాజ్యవాద శక్తులు స్వాతంత్య్రం ఇచ్చినట్లు నటించి దేశంపై మతం మార్పిడులతో పట్టు బిగించారు. చైనా, ఆసియాలో తన సామ్రాజ్య విస్తరణకు భారత్ నేపాల్ శ్రీలంక వంటి దేశాలలో తన ఏజెంటు సంస్థలను ఏర్పాటుచేసుకున్నది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సంపాదించాలనే మావోసేటుంగ్ నినాదాన్ని ఒక రక్తవిప్లవంగా మార్చింది. ఇదే కలకత్తాలో కమ్యూనిజానికి అంకురార్పణ.
నక్సల్‌బరి అనే చోట సాయుధ పోరాటవాదం పుట్టింది. ఫలితంగా ఇండియాలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ, పల్నాడు, వైనాడ్, జాఫ్నావంటి ప్రాంతాలు మరుభూములుగా మారిపోయాయి. తెలుగులో లోగడ ప్రొఫెసర్ ఎస్.వి.శేషగిరిరావు, పిరాట్ల వెంకటేశ్వర్లు వంటి మేధావులు ఈ అంశంపై ఆంగ్లంలో గ్రంథాలు వెలువరించారు. ఇపుడు వుప్పల నరసింహం తెలుగులో గ్రంథ రచన మొదలుపెట్టారు. లోగడ ఆంధ్రభూమి దినపత్రిక వంటి వాటిలో వచ్చిన వివిధ వ్యాసాలను సంకలనాలుగా తీసుకొనివచ్చారు. ఆ పరంపరలో రక్తచరిత్ర అనే గ్రంథం రెండవది.
భారతదేశానికి సంబంధించినంత వరకు 1950 నాడు చాలా బలంగా వున్న కమ్యూనిస్టు ఉద్యమం 2019 నాటికి అదృశ్యమై భారత సాంస్కృతిక జాతీయవాదం బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో బలపడింది. ఇదంతా కాల్పులు తెచ్చిన మార్పు.
మానవీయ విలువల గూర్చి మార్క్సు పట్టించుకోకుండా కేవలం సంఘర్షణనే నమ్మాడు. చిన్న తుపాకీతో వ్యక్తులు వస్తే, పెద్ద తుపాకీతో ప్రభుత్వం వస్తుంది. ఐతే వ్యక్తుల హింసను ఆపటం కోసం ప్రభుత్వం చేసే ఎన్‌కౌంటర్లను రాజ్యహింస అంటున్నారు. స్వాతంత్య్రం రాకముందు పంజాబ్, బెంగాల్ వంటి ప్రాతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. అప్పటి పోరాటం తెల్లదొరమీద. నేటి పోరాటం అవినీతిపరులైన నల్లదొరలమీద. మరి హింస అవినీతికి పరిష్కారమా?
ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో వుంది. కాని తలలు నరికి అధికారంలోకి రావటంకన్నా తలలు లెక్కించి అధికారంలోకి వచ్చే ప్రక్రియ నేడు ప్రపంచమంతా వ్యాపించింది.
ఉప్పల నరసింహంగారు స్థలాలు తేదీలు గణాంకాలతో సహా ఎక్కడెక్కడ మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు జరిగాయో సోదాహరణంగా ఈగ్రంథంలో ప్రదర్శించారు. ఆదిభట్ల కైలాసం పంచాది నిర్మల వంటి శ్రీకాకుళం గిరిజన ఉద్యమకారుల తొలితరం నుండి నేడు రక్తచరిత్ర చాలా మార్పులకు చేర్పులకు లోనయింది. బడా వ్యాపారస్థులనుండి భారీ నిధులను బెదిరించి వసూలు చేసిన లక్షల కోట్ల డబ్బు అడవులల్లో మూలుగుతూ ఉంది. 2017లో జరిగిన పెద్ద నోట్ల రద్దువలన ఆ ధనం నిష్పలమవగా ఈ పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లు ఇవ్వవలసిందిగా మళ్లీ ఆ పారిశ్రామికవేత్తలనే ఈ ఉగ్రవాదులు బెదిరించిన వివరాలు వుప్పల నరసింహంగారు చాలా ప్రామాణిక ఆధారాలతో ఇచ్చారు.
మావోల దాడుల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్లా, సల్వాజుడుం నేత మహేంద్ర కర్మ, వందలాది సిఆర్‌పిఎఫ్ జవాన్లు సుకుమా జిల్లా వంటి చోట్ల ప్రాణాలు కోల్పోయారు. ఎలిమినేటి మాధవరెడ్డి, హయగ్రీవాచారి, డి.శ్రీపాదరావు వంటి ఎందరో నాయకులు బలి అయినారు. ఫలితంగా జరిగిన ఎన్‌కౌంటర్లలో నక్సలైట్ల దళాలు చాలా తుడిచిపెట్టుకొనిపోయాయి. రక్తచరిత్ర సాధించిందేమిటి? భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వంటి ప్రముఖులను హత్యచేయాలని చేసిన వ్యూహరచన రోనా విల్సన్ లేఖలలో వెలుగుచూసింది.
ఒకవైపు మందుపాతరలు పేలుతూనే వున్నాయి మరోవైపు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అగ్ర నాయకులు లొంగిపోగా రమాకాంత్ వంటివారు ఆత్మహత్య చేసుకున్నారు. కిడ్నాపులు, ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనుల హత్యలు ఎన్నో జరిగాయి. సుకుమా ప్రాంతం, కేరళలోని వైనాడ్ ప్రాంతంలోని గహనారణ్యాలు, ఎపిలో అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడుపుతూ తాము బలి అవుతూ ఎందరో ప్రజలను భద్రతా బలగాలను బలితీసుకున్నారు.ఈ గ్రంథానికి ప్రాక్క్థనంగా లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చేసిన విశే్లషణ ఆలోచింపజేసేదిగా ఉంది. వుప్పల నరసింహం గారి పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకీ కేంద్రానికి కూడా ఒక రిఫరెన్స్ బుక్‌గా ఉపయోగపడుతుంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246