పఠనీయం

లాభనష్టాలను బేరీజు వేసే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.ఉమాదేవి కథలు
జె.వి.పబ్లికేషన్స్, వెల:రూ.120/-
ప్రచురణ సి.ఉమాదేవి వింగ్స్, ఫ్లాట్ నెం.501, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్-73
====================================================================
పదిహేడు కథల సి.ఉమాదేవిగారి సంపుటిలోని ఆమె ఎన్నుకున్న ఇతివృత్తాలు కుటుంబ జీవనానికి, సమాజ జీవనానికి సంబంధించినవే. సమస్యలు లేనిదే జీవితమే లేదు. కానీ పరిష్కారం లేని సమస్యలుండవు అనిపింపజేస్తారు రచయిత్రి. సంపుటిలోని తొలి కథ ‘అద్దం’లోనే భర్త తన సమస్యలతో భార్యను సతాయించక ఇంటి ఇల్లాలిని అర్థం చేసుకుని ఆమె చేసే పనులకు ప్రశంసలనూ, గుర్తింపునూ అందజేస్తే ఇల్లు అద్దంలా తళతళలాడుతుందనీ, లేకుంటే బీటలువారుతున్నట్లవుతుందనీ సందేశమిస్తారు.
చిన్న చిన్న అజాగ్రత్తలే ఒక్కసారి ఇబ్బందులపాలు జేస్తాయి. ఏ.సి రిపేరుకు వచ్చిన మనిషి ఏసీ పోతుందని బాత్రూం తలుపు చూసుకోకుండా గడియపెట్టడంతో లోపల వుండిపోయిన ముసలాయన అవస్థను అపార్ట్‌మెంట్ కల్చర్‌ల ప్రమాదాలను ‘కిటికీలో చెయ్యి’ కథ చెబుతుంది. అందుకే అసలు వృద్ధులు బాత్‌రూమ్స్‌కు వెళ్లినపుడు లోపల గడియ పెట్టుకోకుండా లోపల తామున్న గుర్తుగా ఏ లైట్ స్విచ్‌నో ఆన్ చేసి వుండాలంటూంటారు.
దీపావళి టపాసుల ‘వెలుగురేఖలు’ కథ టపాసులు కొనే స్థోమత లేని పేద పిల్లలచేత వారి ఆశలు వెలిగించేలా టపాసులు కాల్పించడంలో అసలు దీపావళి వుందని చెబుతుంది. ‘‘కాలం మనకన్నా తెలివైనది. నేటి యువతీ యువకులకు ఏమీ తెలియదనుకుంటాం. కానీ పెద్దవారి జీవితాలను దగ్గరగా చూసినవారు తప్పొప్పుల సమతూకంలో తాము పోషించాల్సిన పాత్రను అర్థం చేసుకోగలుగుతున్నారు’’ అని ‘నిన్నటిదాకా శిలనైనా’ కధ ద్వారా నవతను సమర్థిస్తారు.
జీవితానుభవాలను మించిన బ్రతుకు పాఠాలు వేరే లేవని రామచంద్రం పాత్ర ద్వారా ‘బ్రతుకు పాఠం’ కథలో వివరిస్తారు. పెద్దలు పదే పదే చెబుతున్నారనే విసుగు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుందని యువతకు హితవు పలుకుతారు.
ఒకరి కష్టాన్ని అయాచితంగా లాక్కొని లబ్దిపొందాలనుకునేవారుంటారు. కానీ మంచికి నిలబడి పరోపకారార్థం చేసే పనులకు సహకారం అర్థం చేసుకున్న వారినుంచి లభించకపోదు అని మంచిని నిలబెట్టే కథ ‘కళ్యాణమంటపం’. పుట్టిన ఊరికోసం ఏదైనా చేయాలని కళ్యాణమంటపం పట్టుదలగా నిర్మించి సమస్యలను ఎదుర్కొని వైరి ఫణీంద్ర చేత ప్రారంభోత్సవం చేయించిన కళ్యాణ్ వ్యక్తిత్వం నిజంగా కథలో గొప్పది.
పెరుగుతున్న సాంకేతికత సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లు తల్లిదండ్రులను కూడా లెక్కచేయకుండా యువతను ఎలా వశపరచుకుంటున్నయో ‘అవును తప్పే’ కథలో చెప్పారు. అమెరికాలో మనం మన సంస్కృతిని కాపాడుకుంటూ మన దేశంలోనే పాశ్చాత్య నాగరిక పరిణామాలకు బానిసలవడాన్ని హెచ్చరికగా చెప్పారు.
ఏమైనా ఉమాదేవి కథలు ఉమ్మగిలిన అన్నంలా సారవంతమైనవి. స్వాదుభరితమైనవి. తెలుగుతనం నింపుకున్న కథలు, రచయిత్రికి అభినందనలు.

-సుధామ 98492 97958