పఠనీయం

సుమధుర సాహితీవేదికే ఇది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పునాస సాహిత్య త్రైమాసిక ప్రారంభ సంచిక
ప్రచురణ: తెలంగాణ సాహిత్య ఎకాడమీ కళాభవన్, రవీంద్ర భారతి, హైదరాబాద్- 500 004.
=========================================================
తెలంగాణ సాహిత్య ఎకాడమీ ప్రారంభం అయి కొన్ని సంవత్సరాలే అయినా, రుూ కొద్దికాలంలో దాదాపు 30 పుస్తకాలు ప్రచురించి, ప్రజలకు వినిమయం చేయడంతో ఆగకుండా ప్రస్తుతం ‘పునాస’ అనే త్రైమాసిక ప్రారంభం చేసింది. ఈ సంచికలో సంపాదకులు స్పష్టపరచిన విషయాలు కొన్ని అమూల్యమయినవి. ‘‘తెలుగు నేలమీద మంచి సాహిత్య పత్రిక లేకపోవడం విషాదం. ఒకటి రెండు పత్రికలు వెలువడుతున్న క్రమం తప్పటమొక బాధ. రచయితలకు, పాఠక సహృదయులకు స్ఫూర్తిగా నిలిచే పత్రిక అవసరం అని భావిస్తున్నాం. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దే భాషా సాహిత్యాలను ఉన్నతీకరించే వేదికగా నిలవాలన్న సంకల్పానికి రూపమే ‘పునాస’. సాహిత్య పదార్థంలో కళావిలువలు, జీవన విలువలు కరువు అవుతాయనే విమర్శ వాస్తవం.’’
- ఈ పత్రికకు ‘పునాస’ అని ఎందుకు నామకరణం చేశారో వివరించలేదు. నిఘంటువుల ఆధారంగా పునాసలు అంటే ‘సూర్యుడు పునర్వసు నందున్నప్పుడు చల్లిన రాగులు లోనగు ధాన్యము’. దీనికి ప్రాంతీయంగా మరేదయినా వ్యుత్పత్తి వున్నదేమో తెలియదు. అయినా, తెలంగాణలో చల్లిన సాహిత్య విత్తులు ఎలా సమంతరంగా, సమగ్రంగా విస్తరిస్తూ వస్తున్నాయో రుూ సంచికలోని వ్యాస పరంపరలు, కథలు, కవితలు చవి చూస్తే తెలిసి వస్తుంది. తెలంగాణకు మొదటినుంచీ సాహిత్య విమర్శకులకు, నిర్దేశకులకు పెట్టిందిపేరు. విశ్వకథా ప్రారంభకుడు, నిర్వాహకుడు కరీంనగర్‌కు చెందిన ‘గుణాభ్యుడు’ అన్న విషయం కొందరికీ తెలిసినదే అయినా, అందరికీ విస్తృత పరచవలసిన ఆవశ్యకత వున్నది.
ఈ ప్రారంభ సంచికలో నిండుగా కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు వున్నాయి. వర్తమాన కవితామూర్తి డాక్టర్ ఎన్.గోపి వ్రాసిన ‘మనిషి కోసం’ అన్న గేయంతో ప్రారంభంఅయి యింకా పధ్నాలుగు కవితలు యిందులో చోటుచేసుకున్నాయి. కథల ప్రస్తావన చేయాలంటే, శ్రీ పెద్దింటి అశోక్‌కుమార్ రచన ‘ఆట’ సామాజిక పరిస్థితులకు ప్రామాణికమయినది. పాము-ముంగిస పోరాటంలో ముంగిస గెలుపును కళాత్మకంగా చూపించారు. తన మొగుడిని చంపినోళ్లను తన పాములతో దండించాలని చేసిన వృధాప్రయత్నం యిందులో కథావస్తువు. భార్యాభర్తల మధ్య వివాదాలు రావడం, వాటిని సమరసంగా సమాధానపరుచుకోకుండా అనేక (నిడశ్రీ్గఱఉ నిజనిఉడ) భంగపడిన కుటుంబ వ్యవస్థలను మనం చూస్తూ వున్నాం, యిప్పటి సమాజంలో. వీటికి పరిష్కార మార్గం సూచించే మంచి కథ శ్రీమతి ఎన్.నీరజ వ్రాసిన ‘హార్ట్ టు డిలీట్’ అనేది. ఇంకా యితర కథలతోపాటు ఒక అనువాద కథను కూడా జోడించడం (‘ఆన్ మేరీ క్రోసో’ కథ లేడి) సముచితమయిన పద్ధతి. అలాగే అనువాద కవిత్వాలు, కవిత్వ పుస్తకాల మీద సమీక్షా వ్యాసాలు చదువరుల్లో ‘సాహిత్య అభిరుచి’ని రేకెత్తిస్తాయి.
మరచిపోయిన మంచి కవి దేవులపల్లి సుదర్శనరావు గురించి అంపశయ్య నవీన్ వ్రాసిన వ్యాసం చాల ప్రయోజనకరమయినది. ఇలాంటి అజ్ఞాత కవులను వర్తమాన పాఠకులకు సవివరంగా పరిచయం చేయడం శ్రేయస్కరం అయిన పని. అయిదు సమీక్షా వ్యాసాలు యిందులో సరికొత్త వెలుగులను చూపుతున్నాయి. అందులో ముఖ్యంగా తెలుగు సాహిత్య ఎకాడమి ప్రచురణలను గురించిన వ్యాసం యేకంగా 15 కొత్త పుస్తకాలను (కొన్ని పాతవే, పునర్ముద్రణ భాగ్యం పొందినవి.) కొత్త పాఠకులకు పరిచయం చేయడం ప్రయోజనకరం అయిన పని. తెలంగాణ ఉద్యమాన్ని గురించి, యిక్కడ ప్రభవించి ప్రపంచం అంతటా వెల్లివిరిసిన సాహిత్య భాండారం గురించి రుూ పత్రిక ముందు ముందు మరింత ఉత్తేజంగా ప్రవహిస్తుందని ఆశించవచ్చు. ఈ పత్రికను కేవలం తెలంగాణ పాఠకులకే పరిమితం చేయకుండా, ప్రపంచం నాలుగు దిక్కులలోను పరిశ్రమిస్తున్న తెలుగువారికి అందరికీ అందే యేర్పాటుచేస్తారని ప్రకాశకులకు మనవి. ఈ ప్రయోగాలు అన్నిటికీ మూలమూర్తి అయిన డా.నందిని సిధారెడ్డిగారు అభినందనీయులు. ఈ కృషికి సాహిత్యాభిమానులు సర్వజన హితం కల్పించేవారు. ఉపేక్షించకుండా సహకార సహృదయాలను సమర్పించాలని మనవి.

- శ్రీవిరించి