పఠనీయం

ఔను.. తెలుగే గొప్ప భాష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
వంగూరి ఫౌండేషన్ ఇండియా, కేరాఫ్ వంశీ రామరాజు, హైదరాబాద్. సెల్:9849023852
============================================================
వంగూరి ఫౌండేషన్ అమెరికా వారి ఆధ్వర్యంలో.. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ.. కనుమరుగవుతున్న తెలు గు భాషను కాపాడుకుందామంటూ పోరుపల్లి కోదండరామయ్యగారు ఓ గ్రంథాన్ని వెలువరించారు. వృత్తిరీత్యా హైదరాబాద్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ నుంచి చీఫ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు భాషపట్ల మక్కువ వున్న ఆయన.. కనుమగరువుతున్న తెలుగు భాషను కాపాడుకుందామంటూ.. ‘తెలుగే గొప్ప భాష’ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషపట్ల క్రమంగా శ్రద్ధ్భాక్తులు కొరవడుతున్న నేపథ్యాన్ని దృష్టియందుంచుకొని.. ప్రమాదం అంచుకు చేరిన మన భాషను మనం కాపాడుకుందామన్న సత్ సంకల్పంతో.. విభిన్న కోణాల్లో తెలుగు యొక్క ప్రాశస్త్యాన్ని సోదాహరణంగా విశే్లషిస్తూ ఈ గ్రంథంలో తమ రచనను కొనసాగించడం ప్రశంసనీయం. ప్రపంచంలో ఏ భాషకూ లేని ప్రత్యేకతలను.. మన భాషా వైశిష్ట్యాన్ని తెలియజెబుతూ.. ఇకనైనా అప్రమత్తులమై పాలకులను.. జనాన్ని చైతన్యపరచడానికి చేయాల్సిన కృషిని విపులంగా చర్చించారు.
తెలుగు భాషలోని గమ్మత్తులను.. ధ్వని, వర్ణ, పద వాక్యాలతో పాటు పదాల అంతర్థాలు.. నుడికారాలు, అభిధ, లక్షణ, వ్యంజన తదితర అంశాలను ప్రస్తావిస్తూ తెలుగు భాషా సొబగులను ఈ గ్రంథంలో పొందుపరిచారు. అమ్మ నుడి సమస్యలన్నింటినీ ఒకచోట చేర్చి కూర్చి వాటి పరిష్కారానికి సూచనలందజేసిన తీరు శ్లాఘనీయం. తెలుగు భాషను కాపాడుకోవల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఇందులో రేఖామాత్రంగానైనా చాలా విషయాలను సందర్భోచితంగా ప్రస్తావించారు. తెలుగు భాషను నేర్పడం ద్వారానే మనవారికి చిన్ననాటినుంచి మంచి అలవాట్లను.. నైతిక విలువలను.. ఈ దేశంపట్ల సంస్కృతి పట్ల, తోటివారిపట్ల, సమాజంపట్ల ముఖ్యంగా మహిళలపట్ల గౌరవభావాన్ని పెంపొందించుకోగలుగుతామని పేర్కొన్నారు. తెలుగు జాతి కనుమరుగవ్వకుండా అందరినీ జాగృతపరిచేందుకు రచయిత చేసిన కృషి అభినందనీయం.
‘చచ్చే భాషల యొక్క లక్షణాలు ఏమిటి?’ శీర్షికతో రాసిన వ్యాసంలో పొందుపరిచిన అంశాలు ఆలోచనాత్మకంగా వున్నాయి. కొత్త మాటలు అవసరం వచ్చినపుడల్లా వేరే భాషలనుంచి పదాలను తెచ్చుకుంటామని గుర్తుచేశారు. అంతేగాక వేరే భాషలనుంచి వచ్చిన మాటలను కూడా తమ భాషా సంప్రదాయాల ప్రకారం రాయడం జరుగుతుందని వివరించారు. మన భాషలో పేరు పెట్టుకోవడంలో మనవారు కొందరు ఆత్మన్యూతాభావంతో ఉండటాన్ని రచయిత తప్పు పట్టారు. కళలు అంతరించిపోతుండడంతో కూడా అమ్మ నుడి బతుకు భారమవుతుందని, ఫలితంగా భాషలో అందంగా మాట్లాడలేమని, సంఖ్యలను కూడా పలుకులేని దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుందని.. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి చిన్ననాటినుంచే తెలుగు భాషకు సముచిత స్థానం కల్పించాలని పేర్కొన్నారు. తెలుగు పిల్లలకు పోతన, తిక్కన, ఆదిభట్లలు తెలిపేలా సుమతీ, వేమన తదితర శతకాల ధారణ చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఔను.. తెలుగు గొప్ప భాష అనడానికి నేలమీద మొత్తం 6500 దాకా నుడులుంటే... అందులో ఐదు మాత్రమే అజంత భాషలున్నాయని.. అందులో తెలుగు ఒక్కటి కావడం విశేషమని తెలిపారు. అజంత భాష అంటే ఏమిటో తెలుపుతూ.. ఆ నుడిలోని ప్రతి మాట చివర అచ్చు ఉంటుందని.. అచ్+అంత అజంత అంటూ సోదాహరణంగా చర్చించారు. తెలుగు నేర్చుకున్నవారే ఇతర భాషలు మాట్లాడగలరని.. సంగీతానికి సైతం తెలుగే అనువైన నుడి అని తెలిపారు. అష్టావధాన ప్రక్రియతోపాటు పద్య, నాటక, పద్యరాగాల సంప్రదాయం తెలుగువారికే సొంతమని రచయిత తెలుగు భాష యొక్క స్వాభిమానాన్ని చాటి చెప్పారు. తెలుగులో మాత్రమే ప్రశ్నోత్తరాలంకారం విస్తృతంగా ఉందని, తెలుగులో ఒక క్రియా వాచక పదం నుంచి కొన్ని పదుల వేల మాటలను పుట్టించవచ్చని వివరించారు. తెలుగులో వున్నన్ని క్రియాపదాలు.. ఏ భాషలో లేవని సోదాహరణంగా వివరించారు.
తెలుగువారికి ఇతర భాషలు గొప్పగా కనపడతాయని.. తెలుగు కళలను కూడా ఆదరించరని.. మొదటినుంచీ తెలుగు రాజులకు సైతం పరాయి భాషలే గొప్ప కనపడేవని రచయిత వాపోయారు. ఆంగ్ల భాషపై వ్యామో హం పెరగడంవల్ల తెలుగు భాష ప్రమాదం అంచుల్లోకి చేరిందని పేర్కొన్నారు.
గ్రంథం చివరలో తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో సుదీర్ఘంగా తమ సలహాలు, సూచనలు చేశారు. గుడి, బడి, ఏలుబడి, రాబడి, పలుకుబడి రంగాల్లో తెలు గు రాణించాలని కాంక్షించారు. కొత్త మాటలను తెలుగు కుదురు మాటలనుంచి పుట్టించుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంస్థల ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగును ఒక తప్పనిసరి పరీక్షగా పెట్టాలని సూచించారు. అన్నింటికిమించి మన మనస్సుల్లో స్పష్టత రావాలని, తెలుగు భాషపట్ల మక్కువ పెంచుకోవాలని కాంక్షించారు. ఔను.. తెలుగే గొప్ప భాష అంటూ నిర్థారణకు వచ్చేలా రచయిత కోదండరామయ్యగారు ప్రకటించిన భావాలు అందరికీ ప్రేరణనిచ్చేలా వున్నాయి.. తెలుగు భాషా ప్రేమికులు ప్రతి ఒక్కరు చదువదగిన గ్రంథమిది!

-దాస్యం సేనాధిపతి 9440525544