పఠనీయం

కాలాన్ని బట్టి పరిస్థితులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్లూరి అయోధ్య రామకవి రచనలు- తెలంగాణ మంటల్లో కధలు, హైదరాబాద్‌పై పోలీసు చర్యలు - బుర్రకథ
=======================================================
అడ్లూరి అయోధ్య రామకవి వరంగల్ జిల్లాలోని తాటికొలకలో పుట్టి, తెలంగాణ సాయుధ పోరాటాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను వివరించిన కథకుడు. అనేక సాహిత్య సంస్థలకు ఆద్యుడు. పత్రికా సంపాదకుడు. ఈయన వ్రాసిన ‘తెలంగాణ మంటల్లో’ సాయుధ పోరాటాన్ని వివరించే కథా సంపుటి.
ఈ కథలు బుర్రకథ కూడా 1948లోనే ప్రచురణ అయి, ఇపుడు తెలంగాణ సాహిత్య అకాడమీ వారి కర్తృత్వంలో పునర్ముద్రణ పొంది ప్రస్తుత పాఠకులకు ఆనాటి చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని కలుగజేస్తున్నాయి.
కె.పి.అశోక్‌కుమార్ రుూ పుస్తకానికి వ్రాసిన ముందుమాటలలోనే, ఆ కథల ప్రామాణికత, అప్పటి సామాజిక పరిస్థితులు స్పష్టంగా వర్ణించారు. ప్రతి పనికీ కాలం కలిసిరావాలి అని ఎదురుచూడకుండా, కాలాన్ని, పరిస్థితులను మనమే ఏర్పాటు చేసుకోవాలనీ, నియంత్రించాలని సందేశం యిచ్చే కథ ‘కాలాన్ని తేవాలి’. రజాకార్ల దురాగతాలను వివరిస్తాయి అన్ని కథలూ. అప్పటి చరిత్రను యిప్పటి తరంవారు తెలుసుకోవలసిన అవసరాన్ని రుూ కథలు నొక్కి చెబుతున్నాయి.
చరిత్ర గతంనుంచే వర్తమానానికీ భవిష్యత్తుకూ పరుగులు తీస్తుంది. మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పులు, దురాగతాలకు చూచి తట్టుకోలేని హృదయాలు.. యివన్నీ కథలలో, బుర్రకథలో ప్రస్తావన అవుతాయి. అకాడమీ వారు ప్రవేశికలో చెప్పినట్లు రుూ కథలన్నీ ‘్భస్వామ్యంమీద, ఆధిపత్యంమీద, అణచివేతమీద సాయుధ పోరాటం చేసిన ప్రజల కథలు’. ఇక్కడ మత, కుల ప్రసక్తి ఏమీలేదని గ్రహించాలి.
చరిత్ర కాలగతంలో కలిసిపోతున్నా, అప్పటి స్థితిగతులు- ఎప్పటికీ పరిణామ ప్రక్రియకు దోహదం చేస్తాయి. ఇటువంటి సదుద్దేశంతో ఈ పుస్తకాల పునర్ముద్రణ చేయడం ముదావహం అయిన పని. *

-శ్రీవిరించి