పఠనీయం

ఈ కల్పన బాగుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కల్పన బాగుంది,
రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్,
వెల:250/-,
2-2-647, 132-బి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-500013.
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
===================================================================
నిండుగా నీరున్నపుడు తటాకం అంటాము. ఎండిపోతే అది కబరస్థాన్‌గా మారవచ్చు. అపార్ట్‌మెంట్స్, మాల్స్ కట్టే వ్యాపార స్థలమూ కావచ్చు. ఇండియాలో హిందువులు మెజారిటీలో వున్నపుడు ఇది హిందూస్థాన్ అని పిలువబడుతుంది. లేకుంటే? ఇది పెద్ద క్లాసులు చదువుకోని పిల్లలకు కూడా అర్థమయ్యే అతి సరళ రాజకీయ సామాజిక సూత్రం. ఐనా మన నాయకులకు ఎందుకు అర్థం కానట్లు నటిస్తున్నారు? అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- ఇవన్నీ నిన్న మొన్నటివరకూ భారతదేశంలో అంతర్భాగాలే. ఎప్పుడైతే అక్కడ హిందువులు అల్పసంఖ్యాకులైనారో వెంటనే అవి భారత్ నుండి విడిపోయాయి. ఇరాన్ ఒకప్పుడు ఆర్యభూమి. అయతుల్లా ఖొమేనీ విప్లవంతో 20వ శతాబ్దంలో అక్కడ ఇస్లామీకరణం జరిగిపోయింది.
గ్రీసు ఒకప్పుడు భారతదేశపు చిన్నకూతురు. ఇవ్వాళ అక్కడ దుర్గామాత లేదు- పోలో మాసిడాన్ (పశునాధ), ఎథీనాలు కూడా లేరు. ఈ విగ్రహాలన్నీ మ్యూజియంలో వున్నాయి. అక్కడ రోమన్ కాథలిక్ చర్చి రాజ్యం చేస్తున్నది. ఈ పరిణామం గ్రీసులో రోమ్‌లో క్రీ.శ.3వ శతాబ్దంలో ప్రారంభమై మొత్తం యూరపును కబళించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇండియాలో క్రైస్తవులు 0.8 శాతం ఉన్నారు. ఇవ్వాళ (2019) 15 శాతం దాటారు. వేదనాదం వినిపించే కోనసీమలో బ్రాహ్మణులు లేరు. చర్చ్‌లు వచ్చాయి. వేద పండితుల పిల్లలంతా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎందువల్ల? ఇక్కడవారికి ఉద్యోగాలు ఇవ్వకపోవటంవల్ల. వేదవిద్యకు గౌరవం లేకపోవటంవల్ల. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సనాతన భారతీయ సాంస్కృతిక జాతీయ జీవనం వికసించి ప్రపంచానికి దీపస్తంభంగా నిలబెడతారని ఆశించినవారి ఆశలు అడియాశలైనాయి. అందుకు నాయకత్వం ఎంత కారణమో వారిని ఎన్నుకొన్నవారికీ అంతే బాధ్యత వుంటుంది. 2019 జూలై నెలలో ఋషిపీఠం మత సామరస్య ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దానిని చదివి ఎందరో సంతోషించారు. కారుచీకటిలో ఓ కాంతిరేఖ మెరిసినట్లు అనిపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయి న్యూనతాభావంలో పడిపోయిన జాతికి కొంచెం ధైర్యం వచ్చింది. ఈ అంశం గురించి చాలా దశాబ్దాలు ఈ రచయిత ఆలోచించారు. ఏకం సత్ విప్రాః బహుధా వదంతి- ఇది ఋగ్వేద సూక్తి. ఉన్న పరతత్వమొక్కటే. పండితులు భిన్న భిన్న పరిభాషలతో వ్యాఖ్యానిస్తారు. అది మనం నమ్మాము. 3త్రరుూసాంఖ్యం యోగం - రుచీనాం వైచిత్య్రాత్2 - ఇది పుష్పదంతుని శ్లోకం. దీనినే చికాగోలో స్వామి వివేకానంద తన తొలి ఐదు నిమిషాల ప్రసంగంలో ఉదాహరించి క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఎందుకంటే, 3ఏసు2ను నమ్మనివారంతా నరకానికి పోతారు అనే ఏకవాక్య సిద్ధాంతం మీద ప్రాతిపదికమీద పునాదిమీద ఆ మత నిర్మాణం జరిగింది. ఇదుగో ఈ కారణం చేతనే శ్రీ శివప్రసాద్ ఇప్పుడొక గ్రంథాన్ని వెలువరించారు. దీని పేరు 3ఈ కల్పన బాగుంది. ఇందులో నాలుగు అధ్యాయాలున్నాయి. ప్రామాణికంగా శాస్ర్తియంగా బైబిలునుండే వాక్యాలు ఉదాహరిస్తూ శాస్త్ర చర్చ చేశారు. ఎట్టి స్వార్థమూ మొండితనమూ లేకుండా జరిపిన తాత్విక విశే్లషణ. ఆదియందు ఒక వాక్యముండెను. ఆ వాక్యమే దేవుడై వుండెను- ఆదికాండము. ఆ వాక్యమేమిటో వారు చెప్పలేదు. ఓమ్ ఇతి ఏకాక్షరం బ్రహ్మమ్ అని భారతీయ శాస్త్రం స్పష్టంగా చెప్పింది. భారతదేశానికి లోగడ ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునేవారు. కిరోసిన్, గ్లాస్కో వస్త్రాలు దిగుమతి చేసేవారు. ఐతే సెమిటిక్ మతాలు కూడా దిగుమతి చేసుకోవలసినంత కరువు ఆధ్యాత్మికంగా ఇండియాలో ఉందా? ఇక్కడ ప్రతివాడూ ఒక తత్వవేత్తయే కదా!
గాంధీగారి శిష్యుడు జె.సి.కుమారప్ప ఇలా అన్నారు.34బ్రిటీషువారికి చతురంగ బలగాలున్నాయి, పదాతి సైన్యం, వాయుబలం, నౌకాబలంతోపాటు నాల్గవది చర్చి22అన్నాడు. నా ఆధ్యాత్మిక తృష్ణను తీర్చడానికి భగవద్గీత చాలు, మరో అన్యమతం ఎందుకు?22 అన్నాడు మహాత్మాగాంధీ.
భారతదేశంలో సనాతన వైదిక విశ్వాసాలు గోబ్రాహ్మణ భక్తి నశించిపోతున్నాయి. ఇపుడు ఈ దేశాన్ని మన మతం ఆక్రమించుకోకపోతే తప్పు ఎవరిది? అని సూటిగా ప్రశ్నించాడు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే 3ఈ కల్పన బాగుంది2 రచన చేశారు.
భారత రాజ్యాంగంలోని 19ఏ అధికరణం వ్యక్తి స్వేచ్ఛను వాక్ స్వాతంత్య్రాన్ని భావ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. దాని అర్థం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పయనించే బస్సు టిక్కెట్లపై శిలువ ముద్ర వేసి జెరుసలేం యాత్రకు వెళ్ళండి అని బోధించటం మత స్వాతంత్య్రం భావ స్వాతంత్య్రం కిందికి వస్తుందా? ఆలోచించండి. వినాయక చవితికి తయారుచేసే గణేశుని విగ్రహాల నెత్తిమీద మేరీమాత విగ్రహం పెట్టడం మత స్వాతంత్య్రం క్రిందికి వస్తుందా? ఆలోచించండి.
అన్ని మతాలూ సమానమే అయితే హిందువులను హిందూ దేవీ దేవతలు పూజించకూడదు, మంగళసూత్రాలు తీసివేయాలి అని పాస్టర్ల ప్రచారం చేయటం దేనికి?
ఈ అంశంపైన విశే్లషణాత్మకంగా గణాంకాలతో 2000 సంవత్సరాల చారిత్రక నేపథ్యంలో 3ఈ కల్పన బాగుంది2 వ్రాశారు. చదివి స్పందించండి.
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చేసిన పరిశోధనకు నమస్సుమాంజలి. అందరూ చదివి తీరవలసిన గ్రంథం 3ఈ కల్పన బాగుంది2.

-జొన్నాభట్ల నరసింహ ప్రసాద్ 7995 900 497