పఠనీయం

వినూత్న కథన కదంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోగతం కథన కదంబం
రచన: బి.ఎన్.శాస్ర్తీ,
వెల:రూ.150/-, కాపీలకు: బి.సీతారామలక్ష్మి, 12-1-448, వారాసిగూడ, హైదరాబాద్-61
================================================================
‘మనోగతం’ కథన కదంబ రచయిత బి.ఎన్. శాస్ర్తీ బ్యాంకు ఉద్యోగి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగం చేశారు. 2015-17 మధ్యకాలంలో కేరళలో పనిచేశారు. ఆ ప్రాంతపు జనుల్నీ, జీవజాలాన్నీ, కాకుల్నీ, కోళ్ళనీ, గోవుల్నీ పరిశీలించేవారు. రిటైరయ్యాక కూడా, అదే అలవాటును కొనసాగిస్తూవచ్చారు. మనోగతమైన తన ఆలోచనల్ని ఇలా మన ముందుకు తెచ్చారు.
ఇవి కథలు కావు, కథానికలు కావు. వ్యాసాలుగా మనం అనుకునే వీటిని రచయిత కథనాలు అన్నారు. కథ కాని కథలుగా 14 మనోగతాల్ని ఇందులో చేర్చారు. కేరళలోని ఉద్యోగానుభవం తర్వాత వీరి ఆలోచనా విస్తృతి పెరిగింది. విదేశీయానం, ‘బెగ్గర్’లు గీతలోని శ్లోకాలపై తనదైన వ్యాఖ్యానాలు- తాను కన్నవీ విన్నవీ అనుభూతించినవీ - అన్నింటినీ మనతో పంచుకుంటున్నారు.
లోతైన శోధన వివరణ తనకు తెలిసిన విషయాల్ని పాఠకులకు పంచాలన్న తపన ప్రతి కథనం / వ్యాసంలోను కనిపిస్తాయి.
పూజకు వాడే పసుపులో లెడ్ క్రోమేట్ కల్తీ (గోమాత (నిర్)విచారం), కాకుల్లో 42 వర్గాలుంటే 4 రకాలు అంతరించిపోయి 28 రకాలు మాత్రమే మిగిలి ఉండటం, మామూలుగా ‘కావ్’మనే వాయిస్‌లో 22 రకాలుండటం, వాటి ఆయుర్దాయం, గ్రీకు పురాణాల్లో కాకులు (కాకుల సమారోహం) వివిధ దేశాల్లోని కోళ్ళ వయోపరిమితి, కోడి మాంసంలో వుండే ‘సల్మొనెల్లా’ బాక్టీరియా, కోళ్ళ సంతానోత్పత్తి వివరాలు, (కోడికల) తన బరువుకు రెట్టింపు తిండి తినే కోళ్ళు లాంటి ఆసక్తికరమైన సంగతులెన్నో తెలుస్తాయి ఈ కథన కదంబం చదవటంవల్ల. ఒక్కో చోట అనుభవాల్ని యధాతథంగానో, మరోచోట ఆ సంఘటన అనే కొమ్మ కి కొత్త పూవులు పూయించి, ఋతు వు మారితే, ఎలా ఉంటుందో ఊహించి కథనాలకు రూపకల్పన గావించారు శాస్ర్తీగారు.
ఇది తన మొదటి సంకలనం అని మళ్లీ మళ్లీ రాస్తానని భయపడవద్దని పాఠకులకు భరోసా ఇస్తున్నారు శాస్ర్తీగారు. మరేం ఫరవాలేదు శాస్ర్తీగారూ! ఆంధ్ర పాఠకులు గులకరాళ్ళను కూడా హరాయించుకోగల జఠరాగ్ని కలవారు.

-కూర చిదంబరం 8639398675