పఠనీయం

సమవీక్షణ సమీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథావిష్కారం కథావిమర్శ రచన:: కె.పి. అశోక్‌కుమార్
వెల : రూ.120/-లు ప్రతులకు
రచయిత మాసంతోషికాలనీ , తుర్కపల్లి రోడ్ బొల్లారం సికింద్రాబాద్ మరియు ప్రముఖ పుస్తక విక్రేతలు
============================================================
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ సంక్షిప్తంగా, క్లుప్తంగా ఉంటున్నాయి. ‘పుస్తకసమీక్ష’ కూడా ఇందుకు మినహాయింపుగా ఉండటం లేదు. మొదటి, చివరి పేజీలు చదివి సమీక్షించటం ఆనవాయిగా మారింది. సమీక్షకుల్లో కొందరు మాత్రమే పుస్తక సమీక్షను ఒక యజ్ఞంగా భావించి నిర్వర్తిస్తున్నారనిపిస్తుంది. ఏటా, వాసిరెడ్డి నవీన్ పాపినేని శివశంకర్ లాంటి వారు ముందు యేడు వెలుగు చూసిన కథల్లోంచి కొన్నింటిని ఏది ప్రచురిస్తున్నాడు.
ఇలా వెలుగు చూసిన కథల్లోని తీరుతెన్నులు, పోకడలు, విశే్లషణలు తెలుగు సాహిత్యంలో అతి తక్కువగా కనిపిస్తాయి.
ఆరోగ్యకరమైన సాహితీ ప్రస్థానానికి మంచీచెడుల విశే్లషకులు అత్యవసరం. ప్రముఖ సాహితీ వేత్త శ్రీగుడిపాటి గారన్నట్లు ‘విమర్శనారంగంలో ఎక్కువమంది కవిత్వ ప్రక్రియ చుట్టూరానే తిరుగాడుతుంటారు. వచన ప్రక్రియల మీద దృష్టి సారించి కూలంకషగా విమర్శచేసేవారు బహు తక్కువ. అవును ఇది అక్షరాల నిజం.
సాహిత్యంతో పాటు సాహిత్యంపై విమర్శకూడా ఏటా రావలి. ఇదొక శశఖ్ఘ ళజూజష్ఘ ళ్దళషరీఖఔ లాంటిది. గమ్యం, గమనం ఈ రెండూ నిర్దేవిత పథలో సాగుతున్నాయో లేదో తెలియాలి.
ప్రస్తుత ‘కథావిమర్శ’ గ్రంథంలో 22 అధ్యాలున్నాయి. 20 మంది కథలు,సీక్వెల్ కథలు, సమకాలిక తెలంగాణ కథల్లో కనిపించే సామాజిక - సాంస్కృతిక పరివర్తనలు మిగతా మూడు అధ్యయనాల్లో వివరించారు.
‘సమీక్ష’ ‘సమవీక్షణం’అన్న నిబద్ధతకు కట్టుబడి ఏ ఒక్క రచయితపై ప్రత్యేకాభిమానం చూపకుండా ప్రముఖ రచయితలైనా నిర్మొహమాటంగా వారి రచనల్లోని లోటుపాట్లను ఎత్తి చూపటం వల్ల అశోక్ కుమార్‌గారి ఈ ‘కథావిమర్శ’ పుస్తకం ఒక కరదీపిక అనుకోవచ్చు. ఒక కొలమానం అని కూడా చెప్పవచ్చు. తాను లోగడ ఒక పుస్తకానికి రాసిన ముందు మాటలు ఒక కథకుడిని ఎన్నుకొని , ఆయన రాసిన రచనలనన్నింటినీ పరిశీలించటం, ఒక కథకుని కొన్ని కథా సంపదుటాలను పాఠకులకు పరిచయం చేయడం, లేదా ఒకటి రెండు కథాసంపుటాలను పరిచయం చేయటం, ఒక కథ, అదే ఇతివృత్తంతో వచ్చిన సినిమాను తులనాత్మకంగా పరిశీలించటం అన్న నాలుగు పద్దతుల్లో సాగుతారుూ వ్యాసాలు.
తనకు పఠనం ఒక వ్యసనమని కొత్త పుస్తకాలకు రెగ్యులర్ గా చదవాలన్న జ్ఞాన తృష్ణ తనను సమీక్షకుడిగా మార్చిందని చెప్పుకుంటున్న అశోక్‌కుమార్ తనకు నచ్చిన తాను మెచ్చిన పుస్తకాలను సినిమాలను నలుగురికి పరిచయం చేయాలన్న అలవాట్లు ఆలోచన ఎంతో శ్లాఘనీయం.
ఏటా వెలువడిన కథల గురించి ఆనవాయితీగా సమీక్షించి తులనాత్మకంగా పరిశీలించి, అందించే సత్సంప్రదాయాన్ని అశోక్ కుమార్‌గారు కొనసాగించాల్సిన అవసరం తెలుగు సాహిత్యానికి ఎంతైనా ఉంది.
రాగద్వేషాలకు,ప్రాంతీయాభిమానతలకు స్వఇష్టాలు, ఇష్టాలకు చోటీయకుండా రాసిన ఈ వ్యాసాలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- కూర చిదంబరం 8639338675