పఠనీయం

నీతిమార్గం.. ప్రతిచోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
==============================================================
ఆయనను న్యాయమూర్తులు, తోటి న్యాయవాదులు చాలా గౌరవించేవారు. ఆయనకు చాలామంది తెల్లజాతి కక్షిదార్లు ఉండేవారు. భారతదేశంలోగానీ, దక్షిణాఫ్రికాలోగానీ తెల్లవారికి ఎదురగు నల్లవారు జరిపే న్యాపోరాటాల్లో నూటికి 99 తెల్లవారికి అనుకూలంగా ముగస్తూండటం గాంధీ గమనించాడు. అందుకే ‘‘్భరతదేశంలో చేస్తున్న క్రూర హత్యలకు కనీసం ఒక తెల్లవ్యక్తినైనాన్యాయస్థానం కఠినంగా శిక్షించిందా? ఏ తప్పూ చేయని నీగ్రోలను ఉద్దేశ్యపూర్వకంగా హింసించిన తెల్ల అధికారికి కోర్టు విధించిన హాస్యాస్పద శిక్షను గమనించారా?’’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించాడు.
కఠిననియమాలు పాటిస్తున్నా, న్యాయవ్యవస్థ గురుంచి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నా గాంధీ న్యాయవృత్తిలో బాగా వృద్ధి చెందాడు. భారతదేశంలో ఆయన న్యాయవాద వృత్తి కొద్దికాలంలోనే ముగిసిపోనప్పటికీ, దక్షిణాఫ్రికాలో మాత్రం అది 20 సంవత్సరాలపాటు విజయవంతంగా కొనసాగింది.
మొదట్లో ఆయన ఒక మంచి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని, బారిష్టరు హోదాకు తగినట్లుగా సాధన సామగ్రితో, యూరోపియన్ శైలిలో దాన్ని అలంకరించాడు. ఆదివారాల్లోనూ, శెలవు రోజుల్లోనూ పార్టీలు ఇచ్చేవాడు. తన ఇంటిని అందరికీ అందుబాటులో ఉంచుతూ స్నేహితులనూ, తన కింది ఉద్యోగులనూ తనతో కలిసి ఉండమని కోరేవాడు. ఇంటికి ఆరుమైళ్ళ దూరంలో ఆయన కార్యాలయం ఉండేది. అక్కడకు వెళ్ళడానికి ఆయన కొంతకాలం సైకిలును ఉపయోగించారు. ఆ తర్వాత నడిచి వెళ్ళేవాడు. దక్షిణాఫ్రికాలో అమలులో వున్న చట్టాల ప్రకారం భారతీయులు ట్రాము కారు ముందు సీటులో కూర్చుని ప్రయాణించడానికి వీలు లేదు. తాను ప్రత్యేక అనుమతి పొందేందుకు అవకాశంవున్నప్పటికీ ఆయన ట్రాము కారు ఎక్కేవాడు కాదు. క్రమక్రమంగా పేద భారత కార్మికుల ప్రతినిధిగా తనను తాను భావించుకోవడం మొదలుపెట్టాడు నిరాడంబరంగా జీవించడం, అలవాటు చేసుకున్నాడు. 40 సంవత్సరాల వయసులో, సగటున నెలకు 4000 రూపాయలు సంపాదిస్తున్న స్థితిలో ఆయన తన లాయర్ వృత్తిని వదలి ప్రజా జీవితంలోకి ప్రవేశించాడు. అప్పటికి సంపాదించిన ఆస్తులన్నీ సమాజానికి ఇచ్చి, రెక్కల కష్టాన్ని నమ్ముకొని పొలాల్లో జీవించడం మొదలుపెట్టాడు.
చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో న్యాయస్థానాలను నడిపేఖరీదైన పద్ధతినీ, న్యాయవాదులు, బారిష్టర్లు పెద్ద మొత్తాలలో ఫీజులు తీసుకోవడాన్నీ ఆయన విమర్శించాడు. ఇక్కడి ప్రజలు అనుభవిస్తున్న దారిద్య్రానికీ, న్యాయవాదుల ఫీజులకీ సంబంధమే ఉండేది కాదు. ఒక్కో న్యాయవాదికి నెలకు 50 వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉండేది. ‘‘న్యాయవాది వృత్తి జూదం కాదు. న్యాయవాదులూ, న్యాయస్థానాల మాయలో పడకుండా ఉంటే ఇంతకంటే సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉండేవారం. న్యాయవాద వృత్తి అనైతికతను నేర్పుతుంది. రెండు పక్షాల తరఫునా సొమ్ములకోసం ఆత్మలను అమ్ముకునే దొంగసాక్షులు ఉంటూనే ఉంటారు’’, అని గాంధీ చెప్పేవాడు. న్యాయాన్ని పరిశుద్ధమైందిగా, చౌకైనదిగా చేసేందుకు న్యాయవాద వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆయన భావించేవాడు. ఆయన పేదల కేసులను ఫీజు లేకుండానే స్వయంగా వాదించేవాడు. సామాజిక అంశాలకు సంబంధించిన కేసుల్లో న్యాయస్థానానికిచెల్లించాల్సిన రుసుములకంటే పైసా కూడా ఎక్కువ పుచ్చుకొనేవాడు కదా. పేదలైన భారత వలస కర్మికుల నివాసాలను కూలీలకు కేటాయించిన స్థలాలనుంచి అక్కడి పురపాలక సంస్థ బలవంతంగా ఖాళీ చేయిస్తుంటే గాంధీ ఆ కార్మికుల తరఫు వాదించాడు. ఆయన అన్ని కేసులలోనూ చాలా కష్టపడ్డాడు. కానీ ఒక్కొక్క కేసుకూ కేవలం 170 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. మొత్తం 70 కేసులకు 69 కేసులు గెలిచాడు. తనకు వచ్చిన ఫీజులో సగం ఒక ధార్మిక సంస్థ నిర్మాణానికి వినియోగించాడు.
మానవ హక్కుల సాధనకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ చేయమని తన దేశస్థులకు గాంధీ బోధించాడు. ఆయనను అరెస్టు చేసి భారతదేశంలోని న్యాయస్థానాలలోనూ, దక్షిణాఫ్రికాలోని న్యాయస్థానాలలోనూ విచారించారు.