పఠనీయం

భేదాలు దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధి నెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
===============================
దానికి గాంధీ ఎంత సంతోషించాడంటే ‘‘ఇంక ప్రపంచంలో నాకెవ్వరూ సర్ట్ఫికెట్ ఇవ్వకపోయినా పర్లేదు’’ అనుకున్నాడు.
దక్షిణాఫ్రికాలోని ఆశ్రమాలలో నీటి కొరత ఉండేది. బట్టలు ఉతకడానికి మహిళలు దూరంగా వున్న సెలయేటివద్దకు వెళ్లాల్సి వచ్చేది. వారికి గాంధీ సహాయం చేసేవాడు. ఖద్దరు ఉత్పత్తి తొలి రోజుల్లో చేతి మగ్గాలమీద చాలా మందమైన, బరువైన చీరలు తయారయ్యేవి. ఆశ్రమంలోని మహిళలు వాటిని ధరించేందుకు ఒప్పుకున్నారు కానీ వాటిని ఉతకాల్సి వచ్చినపుడు విసుక్కునేవారు. అలాంటప్పుడు గాంధీ వారికి ఆ పనిలో సహాయపడటానికి ముందుకొచ్చాడు.
ఆయన ఇతరుల దుస్తులు ఉతకడానికి సిగ్గుపడేవాడు కాదు. ఒకసారి ఆయన ఒక సంపన్నుడికి అతిథిగా వున్నాడు. గాంధీ స్నానాల గదిలోకి వెళ్ళేసరికి అక్కడతలుపుమీద ఒక శుభ్రమైన తెల్లని తుండు వేసి ఉంది. ఆయన స్నానం పూర్తిచేసి తన దుస్తులతోపాటు ఆ తుండును కూడా ఉతికి బయట ఎండలో ఆరేయడానికి తీసుకెళ్ళాడు. తెల్లని గుడ్డలను ఎండలో ఆరేయడంపట్ల గాంధీ శ్రద్ధ చూపేవాడు. ఎందుకంటే అలా ఎండలో ఆరేస్తే అవి తెల్లగా మెరవడమేగాక వాటిలో వున్న సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి. ఆ సంపన్నుడు అడ్డుకుంటూ ‘‘గాంధీజీ మీరేం చేస్తున్నారు?’’ అన్నాడు. ‘‘ఇందులో తప్పేముంది? అక్కడ వదిలేస్తే ఆ తెల్లతుండు మురికి పట్టేది. అందుకే ఉతికేశాను. అయినా వస్తువులను శుభ్రంగా ఉంచడానికి కొద్దిపాటి చేతి సాయం చెయ్యడానికి నేనేమీ సిగ్గుడను’’ అని గాంధీ జవాబిచ్చాడు.
ముసలివయసులో కారాగారంలో వున్నపుడు కూడా గాంధీ తన అంగవస్త్రాన్ని, తుండుగుడ్డను, జేబురుమాలును తానే ఉతుక్కుని తనతోపాటు జైలులో వున్నవాళ్ళు అదనపు పనిచేయాల్సిన అవసరం లేకుండా చేసేవాడు. కస్తూర్బా ఆఖరి దశలో జబ్బుగా ఉన్నపుడు ఆగాఖాన్ పాలెస్‌లో ఆమె వాడిన జేబురుమాళ్ళను గాంధీ ఉతికేవాడు. ఆయన జీవితమంతా తన దుస్తులపట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉండేవాడు. చిన్నపిల్లవాడుగా ఉన్నపుడు మిల్లులో తయారైన తన సన్నని ధోవతిని మిగిలిన పిల్లలకన్నా తెల్లగా ఉతుక్కునేందుకు పోటీపడేవాడు. నూతిలోంచి నీరు తోడుకొని దాన్ని ఉతికేవాడు. గాంధీ నిరాడంబరంగా ఉండటాన్ని ఇష్టపడేవాడు. కానీ మాసిపోయిన, నలిగిపోయిన దుస్తులను అసహ్యించుకొనేవాడు. ఆయన తన అంగవస్త్రం, కండువా, తుండుగుడ్డలను చిన్న మరక కూడా లేకుండా శుభ్రంగా, ఒక్క అనవసరమైన మడత కూడా లేకుండా ఉంచుకునేవాడు. పరిశుభ్రతకు ఆయన ప్రతిరూపం.
క్షవరం చేసేవాడు
దక్షిణాఫ్రికాకు వచ్చిన ఒక వారం తర్వాత తన న్యాయవాద పనికోసం ఆయన ఒక పట్టణంలో ఒక రాత్రి గడపాల్సి వచ్చింది. ఆయన ఒక గుర్రపుబండి కట్టించుకొని పట్టణంలోకెల్లా పెద్ద హోటలుకు వెళ్ళాడు. గది కావాలని అడిగాడు. అక్కడి తెల్ల మేనేజరు గాంధీని కిందనుండి పైదాకా పట్టి పట్టి చూసి ‘‘సారీ, అన్ని గదులూ నిండిపోయాయి, ఖాళీల్లేవు’’ అన్నాడు. గాంధీ ఆ రాత్రి ఒక భారతీయ స్నేహితుని దుకాణంలో గడిపాడు. హోటలు సంఘటనని స్నేహితునికి చెబితే అతడు ఆశ్చర్యపడి ‘‘నీకు హోటల్లో గది ఇస్తారని ఎలా అనుకున్నావు?’’ అని అడిగాడు. దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాల గురించి అపుడు గాంధీకి తెలిసింది. భారతీయుడిగా పుట్టినందుకు ఆయన చెంపదెబ్బలు, పిడిగుద్దులు, తన్నులు తిన్నాడు. గుర్రపు బగ్గీలోంచి, రైల్లోంచి, ఫ్లాట్‌ఫాంమీంచి నెట్టివేయబడ్డాడు. అయినా నల్లవాళ్ళను తెల్లవాళ్లు ఎందుకు అసహ్యించుకుంటున్నారో ఆయనకు అర్థం కాలేదు. మనుషులందరూ ఒకే దేవుని బిడ్డలు కాదా? క్రైస్తవమతం ప్రేమను బోధించడంలేదా?
ఒక రోజు గాంధీ తన జుట్టును కత్తిరించుకోవడానికి క్షౌరశాలకు వెళ్లాడు. అక్కడున్న తెల్ల క్షురకుడు ‘‘నీకు ఏం కావాలి?’’ అని అడిగాడు. ‘‘నేను క్షవరం చేయించుకుందామని అనుకుంటున్నాను’’ అని గాంధీ చెప్పాడు. ‘‘సారీ, నేను నీకు క్షవరం చెయ్యలేను. నల్లవాళ్లకి క్షవరం చేస్తే నేను నా తెల్ల ఖాతాదారులను పోగ్టొకోవాల్సి వుంటుంది’’ అన్నాడు.