పఠనీయం

మంచితనాన్ని మేల్కొలిపే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి మేరీ జాన్ - కథలు రచన: సంగెవేని రవీంద్ర,
వెల:రూ.150/-, ప్రతులకు: రచయిత, ముంబాయి. ఫోన్:09987145310 / 085356962974
మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు)
======================================
కప్పి చెప్పేవారు కవిత్వం రాస్తారు. విప్పి చెప్పేవారు విమర్శలు రాస్తారు. ఈ రెంటికి మధ్యస్థంగా గుప్పిట తెరిచీ తెరవనట్లు చెబుతారు కథకులు. ఏడు కవితా సంకలనాలు, రెండు వ్యాస సంకలనాలు, మరెన్నో సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన సంగెవేని రవీంద్రగారు తన కథల్లో కూడా కవితాత్మకతను కనబర్చుతారు. కవితల్లోని పాదాల్లాగే చిన్న చిన్న వాక్యాలు, ప్రతీకాత్మకత ఆయన కథల్లో కనిపిస్తాయి. కష్టాలను అధిగమించి, రేపటి వెలుగుల్లోకి ప్రస్తావించమంటాయి. కులం, మతం, నమ్మకం వేరైనా అందరిదీ మానవత్వమనే కులం అని అంటాయి. మానవ కళ్యాణమే మతం అని అంటాయి. ఇవి లోపించిననాడు, ఎంతటి మహోన్నతుడైనా ‘మరుగుజ్జు’తో సమానం అని నిర్థారిస్తాయి. ఒక వ్యక్తిని కాని, గుంపును కాని చూసి వారు చేసే అకృత్యాలవల్ల అందరిపై ద్వేషం పెంచుకోవటం తగదు. నీ ఆనందం కోసం మరొకరి హృదయంలోకి తొంగి చూసేవేళ, ఆ హృదయ వేదనను అర్థం చేసుకొమ్మంటాయి. మనిషికి, మనిషికి మధ్య కలిగే అనుస్పందనని అర్థం చేసుకుని ఎదుటివారిమీద కాస్త కరుణను కనబర్చమంటాయి. అలా కనబర్చలేకపోయిన్నాడు, మనసుకు అంటిన ‘మకిల’ను ఏ గంగాజలమూ శుద్ధి చేయలేవంటారుూ కథలు! అటు పల్లెటూరి పచ్చదనాన్ని కల్లాకపటంలేని మనసుల్ని ఇటు పట్నవాసపు పరుగు, వేగం సంకుచితం స్వార్థాన్ని గమనించిన రవీంద్ర- రెంటికీ వారథిగా నిలిచి రెంటిలోని మంచితనాన్ని ఎంచి చూసి కథలల్లటంవల్ల ఈ కథలకు గొప్ప విలువ చేకూర్చారు.
జీవితం అంటే కష్టసుఖాల మేళవింపు. అన్నింటినీ సమంగా స్వీకరించాలన్న సందేశం ఇవ్వదలచుకున్నాడు కాబోలు- ‘మరో ఉదయంలో 9 గజాల చీరలో బుట్టబొమ్మలా ముద్దుగా బొద్దుగా ఉంటూ నేలమీద కాళ్ళాన్చి నడవమని భర్తకు అనుక్షణం గుర్తుచేసే చిలకమ్మను ముంబయి వాసులు ఆగ్రహానికి బలిచేస్తాడు. ‘బతుకుపోరు’లో ఓడిన గంగవ్వ పట్ల కూడా రవీంద్ర ఇలాంటి పరాజయాన్ని నెత్తిన మోసుకుని తిరిగి స్వగ్రామం పయనం కట్టిస్తాడు.
అందుకే ఇవి కాలక్షేపపు కథలు కావు. ఉరుకుల పరుగుల మహానగరానికి వచ్చినా, పసితనము అమాయకత్వము, ఉత్సుకత పెనవేసుకుని ప్రశ్నించిన కథలు. పెడదారి పడుతోన్న స్వప్న (..మమజీవన) మొకద్దాం (శిక్ష)లకు సరియైన దోవ ఏదో చూపే కథలు. ఒక కెరటం వేగంగా లేచింది.. అంతేవేగంగా ముక్కలు ముక్కలుగా విరిగి తిరిగి ఆ జలనిధిలోకే జారిపోయింది (రేపటి చూపు) లాంటి ప్రతీకాత్మకమైన వాక్యాలు ఎన్నో కనిపిస్తారుూ కథల్లో. ‘రంగమ్మ పెళ్లి’, ‘దయ్యాల గోల’ ఈ జనరల్ ట్రెండ్‌కు భిన్నమైన కథలు. మొదటి కథ నేటి వయసు మీరిన పెద్దలందరికీ ఓ కనువిప్పు. రెండవది కాస్త హాస్యం మేళవించిన, సరదాగా చదువుకోగలిగిన కథ.
నవ్య వీక్లీ సంపాదకులు ఎ.ఎన్.జగన్నాధ శర్మ తన ముందుమాటలో అన్నట్లు.. ఈ పుస్తకంలోని ప్రతి పదమూ ఓ కథ చెబుతోంది. చదివి చూడండి మీరూ, శర్మగారితో ఏకీభవిస్తారు.

-కూర చిదంబరం 8639338675