పఠనీయం

భావాలు... సుమధుర పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రచయితలు (వచనము) రచన: మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ
వెల:450/- ప్రతులకు: మధునామూర్తి, గణేశ్ హైట్స్-3, ఆనందవనం, ఫ్లాట్ నెం.504, చినముషిరివాడ, పెందుర్తి, విశాఖపట్నం-531173 9398040740
===========================================
ఈ రచనలో కవిగారు సరళ గ్రాంథిన్ని ఉపయోగించారు. ఏ వాక్యంలోను సంక్లిష్టతలేదు.
బహుజనపల్లివారు చిన్నయసూరి ప్రత్యక్ష శిష్యుడు. కాని ఆ విషయమును పేర్కొనలేదు. తాను వారితో సావాసము (ఫ్రెండ్‌షిప్) చేసినట్టు పేర్కొనటంలోని ఔచిత్యము విమర్శనీయము- దానిని నొప్పింపక తానొవ్వక ధ్వనిగర్భితంగా మధునాపంతులవారు బహుజనపల్లివారి పరిచయంలో (64 వ పుట) సున్నితంగా పేర్కొన్నారు.
359వ పుటలో వారి పరిచయంలో (64వ పుట) సున్నితంగా పేర్కొన్నారు. 359 పుటలో కృష్ణశాస్ర్తీగారిని పరిచయం చేయడానికి ముందు అనగా ఉపోద్ఘాతం చూడండి.
‘‘తమ్మన్నశాస్ర్తీగారి కుమారుడీయన. తమ్మన్నశాస్ర్తీ గారి అసలు పేరు వేంకటకృష్ణ శాస్ర్తీ. తండ్రీకొడుకుల పేరులొకటే. నాడు తండ్రికంటే నేడు కొడుకు పేరు విన్నవారి జనసంఖ్య పెద్దది. కాని తండ్రి ముందు కొడుకు వ్యుత్పత్తిలో పెద్దవాడు. శివస్వరూపుడైన తమ్మన్నశాస్ర్తీగారి తేజస్సు ముందు కృష్ణశాస్ర్తీ కుమారమూర్తి. ఆయన కూర్చుండుటకు మేలి జాతి మణివితర్దిక కావలెను. ఇతనికి మెత్తని పూల పానుపు మీద కాని నిదురపట్టదు.
ఇందు తమ్నన్నశాస్ర్తీగారి పాండిత్యాన్ని ప్రశంసిస్తూనే భావకవితపై అన్యాపదేశంగా మధునాపంతులవారి ఛలోక్తి సహృదయ వేద్యము.
అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు పండిత శ్రేష్ఠుడు. అనంత పంతుల రామలింగస్వామి శుక్లపక్షము, భావకవిత్వముపై విమర్శ. ఇక మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్ర్తీ వంటి శతకకర్తలు, కాళ్లకూరి నారాయణరావు వంటి ప్రజాదరణ పొందిన నాటకకర్తలు స్పృశింపబడవలసిందే. తెలంగాణ సంస్థానములు నిజాం పాలనలో కొందరు కవులను పోషించటం జరిగింది. అలాగే నూజివీడు, చల్లపల్లి, కరవది వెంకటగిరి వంటి సంస్థానములలో కూడా కవిశేఖరులున్నారు. ఇక భాషా శాస్తప్రరంగా గంటి జోగి సోమయాజి కోరాడ రామకృష్ణయ్యలు చేసిన సేవ గణనీయమే. ఎస్వీ జోగారావు, ప్రసాదరాయ కులపతి (నేటి కుర్తాళం పీఠాధిపతి), కల్యాణానంద మాంతాచార్యులు వంటివారు 1940-50 ప్రాంతములలో రాణకెక్కినవారే. భారతుల మార్కండేయ శర్మ (ఒంగోలు), ముట్నూరి కృష్ణారావు (బందరు) ఇంకా శ్రీదేవి (కాలాతీత వ్యక్తులు) వంటి నవలాకారులు ఈ గ్రంథ పరిధిలోకి రాలేదు. నాళం కృష్ణారావు శ్రీరంగం శ్రీనివాసరావు, భాగవతుల శివశంకరశాస్ర్తీ, ఆవంత్స సోమసుందర్ నరసరావుపేటలోని నయాగరా కవులు అత్యాధునికులు. అయితే మధునాపంతుల వారు కొన్ని స్వీయ ప్రమాణములను నిర్ణయించుకొని ఆంధ్ర రచయితలను పరిచయం చేసినట్లు సుస్పష్టం.
‘‘ఏమో రుూ కృతి యంత శాశ్వతమటోయి యందురా? కాదు కానీ మాధుర్య ధురీణ కావ్య రచనా నిత్యోత్సవ శ్రీకళాధాముల్ నూర్వురు పెంచు నీ యమృత గాథా జ్యోతులే నాటితోనే మిన్నందియు వట్టి మంద కొడుకులేనే యెట్టు లూహించినన్’’.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246