పఠనీయం

జ్ఞానాన్నిచ్చేది విద్యాగంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=========================================================
కొద్దికాలంపాటు వారికి ఆంగ్లం బోధించేందుకు ఒక ఉపాధ్యాయురాలిని కూడా నియమించాడు. వారు ఆమె వద్ద కొంతా, గాంధీ ఆంగ్ల స్నేహితుల వద్ద కొంతా ఆంగ్లం నేర్చుకున్నారు.
ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో గాంధీ ఆశ్రమవాసుల పిల్లలకోసం ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించాడు. ఆయనే దానికి ప్రధానోపాధ్యాయుడు. ఇతర సహచరులు ఆయనకు సహాయపడేవారు. అక్కడి విద్యార్థులు వివిధ మతాలకు చెందినవారు, ఉపాధ్యాయులు ఇంగ్లాండు, జర్మనీ, ఇండియా తదితర దేశాలకు చెందినవారు. ఉపాధ్యాయులు శారీరక శ్రమతో ఎంత తీరిక లేకుండా ఉండేవారంటే ఒక్కొక్కసారి పంట పొలాల నుంచి బురదకాళ్ళతోనే తిన్నగా తరగతులకు వచ్చేవారు.
గాంధీ అయితే ఒక్కోసారి తన భుజంమీద పసిపిల్లవాడిని జోకొడుతూనే పాఠాలు చెప్పేవాడు. తాను ఆచరించని ఏ పనీ ఆయన విద్యార్థులకు బోధించేవాడుకాదు. ‘ఒక భయస్తుడైన ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఎప్పటికీ ధైర్యవంతులుగా చేయలేడు’ అనేవాడాయన. ‘‘ఒక ఉపాధ్యాయుడు శిష్యులకు తానే ఒక పాఠం కావాలి’’. గాంధీ విస్తారంగా పుస్తకాలు చదివేవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే ఆసక్తితో ఉండేవాడు. 65 ఏళ్ల వయసులో ఆయన నక్షత్రాల గురించి అధ్యయనం ప్రారంభించాడు.
ఫీనిక్స్ సెటిల్‌మెంటులోని పాఠశాలను ప్రయోగాత్మకంగా నడిపేవారు. అక్కడ చాలా కఠిన నియమాలుండేవి. జీవితం నిరాడంబరంగా, కఠినంగా ఉండేది. బానిస కార్మికులతో ఉత్పత్తి చేస్తారు కాబట్టి టీ, కాఫీ, కోకోల సేవనంపై నిషేధం ఉండేది. విద్యార్థులలో చాలామంది అక్కడే నివసించేవారు. గాంధీ చాలా అరుదుగా పుస్తకాలతో పాఠాలు చెప్పేవాడు. పుస్తకాల పాఠాలతో బరువును మోపి వారి మెదళ్లను మొద్దుబార్చడం ఆయనకు ఇష్టం లేదు. తన చిన్నతనంలో పరీక్షలకోసం తీవ్రంగా చదవటం అనేది పుస్తక పఠనంమీద ఆసక్తిని పోగొట్టిన సంగతి ఆయన గుర్తుచేసుకొనేవాడు. చదవటం, పునశ్చరణ చేయటం, అప్పజెప్పటం అనే బండ పద్ధతికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చేవాడుకాదు. మానసిక సంస్కారం, వ్యక్తిత్వ నిర్మాణం ఆయన బోధన లక్ష్యాలు. అన్ని మతాలను గౌరవించటం విద్యార్థులకు నేర్పించేవాడు. రంజాన్ నెలలో ముస్లిమ్ విద్యార్థులతోపాటు హిందూ విద్యార్థులు కూడా ఉపవాసాలు ఉండేవారు. కొంతమంది ముస్లిమ్ విద్యార్థులను కొన్ని నెలలపాటు హిందూ కుటుంబాలలో ఉంచేవారు. వారు గృహస్థులతో కలిసే భోజనం చేసేవారు. అందరూ పూర్తిగా శాకాహారులే. వారు సామూహిక ప్రార్థనలలో పాల్గొనేవారు. తోటపనిలోనూ, పారిశుద్ధ్యపనిలోనూ, చెప్పుల తయారీలోనూ, వడ్రంగం పనిలోనూ, వంటపనిలోనూ సహాయపడేవారు. విద్యార్థులకు సంగీతాన్ని ఆస్వాదించడం నేర్పవారు. టెన్నిసో, క్రికెటో ఆడటానికి బదులు విద్యార్థులు రోజువారీ పనులకు సంబంధించిన శారీరక శ్రమ చేసి దృఢంగా ఎదగాలని ఆయన కోరుకొనేవాడు. టాల్‌స్టాయ్ క్షేత్రంలోనూ, సబర్మతీ ఆశ్రమంలోనూ కూడా గాంధీ చెప్పుల తయారీలో శిక్షణ ఇచ్చేవాడు. టాల్‌స్టాయ్ క్షేత్రంలో ఆయన ఉర్దూ, తమిళ భాషలకూ సంబంధించిన ప్రాథమిక పాఠాలు చెప్పేవాడు. సాహిత్య శిక్షణ ఎప్పుడూ మాతృభాషలోనే జరిగేది. గాంధీకి గుజరాతీ, మరాఠీ, హిందీ, ఉర్దూ, తమిళం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్ భాషలు వచ్చు.
సబర్మతీ ఆశ్రమంలో ఫీజులేమీ తీసుకునేవారు కాదు. తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ఆశ్రమ నిధికి ఎంతో కొంత ఇస్తారని ఆశించేవారు. నాలుగేళ్ల వయసు దాటిన పిల్లలను గురుకుల విద్యార్థులుగా చేర్చుకొనేవారు. చరిత్ర, భూగోళం, గణితం, అర్థశాస్త్రాలను స్థానిక భాషలో బోధించేవారు. సంస్కృతం, హిందీ, ఏదో ఒక ద్రావిడ భాష నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లీషు ద్వితీయ భాషగా ఉండేది. ఉర్దూ, తమిళం, తెలుగు, బెంగాలీ అక్షరాలు కూడా నేర్పేవారు. రోజుకు మూడుసార్లు ఆహారం ఉండేది. అది చాలా సాధారణంగా ఉండేది. ఉప్పు తప్ప మరే మసాలా దినుసులు వాడేవారు కాదు. ఒకేలాంటి సాధారణ దుస్తులను వాడేవారు. అవి కూడా స్వదేశీ దుస్తులైతే బావుంటుందని సూచించేవారు. బాలబాలికలు కలిసే విద్యాభ్యాసం చెయ్యాలని గాంధీ సూచించేవాడు.