పఠనీయం

పోషకాలపై అవగాహన అమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
====================================================
గాంధీగారి 70వ పుట్టిన రోజున జనరల్ స్మట్స్ ఉత్తరం రాస్తూ ‘‘జైలులో ఆయన నా కోసం ఒక చెప్పుల జత తయారుచేశాడు. ఆ గొప్ప మనిషి తయారుచేసిన చెప్పులు ధరించే యోగ్యత నాకు లేదని నేను భావిస్తున్నప్పటికీ వేసవి కాలాలు నేను వాటిని ధరించాను’’ అని రాశాడు.

సేవకుడు
ఆశ్రమంలో సాధారణంగా పనిమనుషులు చేసే వివిధ రకాల పనులు చేసేందుకు గాంధీ ఆసక్తి చూపేవాడు. అంతకుముందు న్యాయవాదిగా వేలాది రూపాయలు సంపాదిస్తున్నప్పుడు కూడా రోజూ ఉదయమే గోధుమలను విసిరేవాడు. తిరగలితో గోధుమలను పిండి చేసే ఈ కార్యక్రమంలో కస్తూర్బా, అతని కుమారులు కూడా పాలు పంచుకొనేవారు. అలా సిద్ధం చేసిన పిండి వారు ఇంటివద్దే హోల్‌మీల్ బ్రెడ్ తయారుచేసుకునేందుకు సరిపోయేది. గాంధీ ఈ అలవాటును సబర్మతీ ఆశ్రమంలోనూ కొనసాగించాడు. తిరగలిని బాగుచేయడానికి ఆయన చాలా గంటలు వెచ్చించేవాడు. ఒకసారి ఒకపనివాడు ఆశ్రమంలో పిండి విసరడంలో సహాయపడేందుకు సిద్ధపడ్డాడు. విసిరేముందు గోధుమలను శుభ్రం చేయడంలో గాంధీ చాలా శ్రద్ధ చూపేవాడు. గోచీగుడ్డతో గోధుమలను శుభ్రం చేస్తున్న గాంధీని సందర్శకులు తరచు చూస్తుండేవాళ్ళు. బయటవాళ్ళ ముందు శారీరక శ్రమ చేయడానికి ఆయన సిగ్గుపడేవాడు కాదు. ఒకసారి తన ఆంగ్ల పాండిత్యానికి గర్వపడే ఒక కళాశాల విద్యార్థి అడిగాడు. ఏదో రాతపని చెబుతాడని అతని ఉద్దేశ్యం. దాన్ని గ్రహించిన గాంధీ ‘‘సరే మీకు ఖాళీ ఉంటే కాస్త ఈ చాటలోని గోధుమలను బాగుచేసి పెట్టు’’ అన్నాడు. మాటిచ్చి దొరికిపోవడంతో ఆ యువకుడు తప్పనిసరిగా పని మొదలుపెట్టాడు. ఒక గంట తర్వాత గోధుమలు చెరిగే పనిలో అలసిపోయిన అతను నీరసమైన కంఠంతో గాంధీకి వీడ్కోలు చెప్పి వెళ్ళాడు.
కొన్ని సంవత్సరాలపాటు గాంధీ ఆశ్రమంలో సహాయ స్టోర్‌కీపర్‌గా పనిచేశాడు. ఉదయపు ప్రార్థనల తర్వాత ఆయన వంటింట్లో కూరగాయలు తరిగేవాడు. వంటింట్లోగానీ, సరుకుల గదిలోగానీ, ఏ మూలైనా చిన్న సాలీగూడు కనిపించినా తోటి పనివారిని మందలిచేవాడు. ఆయనకు కూరగాయలు, పళ్ళు, ధాన్యాలలోని పోషక విలువల గురించి బాగా తెలుసు. ఒకసారి ఒక ఆశ్రమవాసి బంగాళా దుంపలను కడగకుండానే తరిగాడు. బంగాళా దుంపలను, కూరగాయలను కొయ్యకముందు ఎందుకు కడగాలో అతనికి గాంధీ వివరించాడు. ఒకసారి ఒక ఆశ్రమవాసి అరటిపళ్ళమీద నల్లటి మచ్చలుండటం చూసి వాటిని తినడానికి నిరాకరించాడు. అప్పుడు గాంధీ అలా ఉన్న అరటిపళ్ళు అతని జీర్ణవ్యవస్థకు అనువైనవి కాబట్టే ఇచ్చానని వివరించాడు. గాంధీజీ చాలాసార్లు తానే స్వయంగా వడ్డించేవాడు. దానితో వాళ్ళకు ఆహార పదార్థాలు రుచిగా లేవని ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. దక్షిణాఫ్రికాలో జైల్లో ఉండగా ఆయన రోజుకు రెండుసార్లు వందలాది మంది తోటి ఖైదీలకు వడ్డన చేసేవాడు.
ఎవరి కంచాలూ, గినె్నలూ వాళ్ళే కడుక్కోవాలనేది ఆశ్రమవాస నియమాల్లో ఒకటి. వంటపాత్రలను కొన్ని బృందాలు వంతులవారీగా కడిగేవి. ఒక రోజు గాంధీ మసితో నిండిన బరువైన మూకుళ్ళను కడిగేందుకు సిద్ధమయ్యాడు. చేతులనిండా బూడిద తీసుకొని ఒక పెనాన్ని రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ అకస్మాత్తుగా కస్తూర్బా ప్రత్యక్షమైంది. ‘‘ఇదిమీ పనికాదు. ఈ పని చేసేందుకు వేరేవాళ్ళు ఉన్నారు’’ అని పెనం లాక్కుంది. ఆ పని ఆమెకు వదలడమే మంచిదనుకున్న గాంధీ అక్కడినుంచి వెళ్లిపోయాడు. వంట పాత్రలు శుభ్రంగా తళతళమెరవకపోతే గాంధీ ఊరుకొనేవాడు కాదు. ఒకసారి జైల్లో తోటి సహాయకుని పనితీరు నచ్చక ఇనుప పాత్రలను కూడా వెండి పాత్రల్లా మెరిసేలా ఎలా తోమవచ్చో అతనికి చూపించాడు. ఆశ్రమం నిర్మాణంలో వున్నపుడు కొంతమంది అతిథులు గుడారాల్లో పడుకోవలసి వచ్చేది. కొత్తగా వచ్చిన ఒకతను తన పక్కబట్టలు మడిచి వాటిని ఎక్కడ పెట్టాలో అడగడానికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి గాంధీ ఆ పక్కబట్టల మూటను తన భుజాలమీద మోస్తూ ఎదురొచ్చాడు.