పఠనీయం

అనుభవాలే కథాంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగుల చీకటి
(కథలు)
ఇండ్ల చంద్రశేఖర్
వెల:రూ.100/-
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
విజయవాడ-4,
*
చంద్రశేర్ ఐండ్ల రాసిన ‘రంగుల చీకటి’ కథల సంపుటిలో పనె్నండు కథలున్నాయి. ఒంగోలు పక్కన కందుకూరుకు చెందిన రచయిత చంద్రశేఖర్ స్వాతికి సరస కథ రాస్తే పదివేల రూపాయలు డబ్బులొస్తాయన్న ప్రేరణతో కథలు రాయడం మొదలెట్టి, డబ్బులు రాకపోయినా కథలు రాయగల ధీమాతో ఎదిగి రచయిత అయ్యారు. సాక్షిలో ‘నీ వేళ్ళతో నా కళ్ళు పొడిచేయ్’ అనే తొలి కథ అచ్చయినా, తన మొదటి కథా, 2009 రచనలో అచ్చయిన ‘ముళ్ళు’ కథేనంటారు. తన తండ్రి ఆ కథను చదివి మురిసిపోయిన వైనాన్ని గుర్తుచేసుకున్నారు. ఇందులోని ప్రతి కథా ఆయన తండ్రి ఐండ్ల అంకయ్యగారికే అంకితం.
అమెరికా వెళ్లిపోయిన కొడుకు, కోడలు ఎప్పుడు తిరిగొస్తారా అని వృద్ధాప్యంలో ఎదురుచూసే ఎందరో దంపతులకు ప్రతీక లాంటి కథ ‘ముళ్ళు’. ‘మాతమ్మ’, ‘గుండు’ అనే కథలు రెండూ కులాంతర వివాహ నేపథ్యంలో కులానికికున్న వర్గ స్పృహను చిత్రించేవి. రచయిత స్వయంగా ఒక తమిళం, కులాంతర స్ర్తిని వివాహం చేసుకున్న అనుభవ నేపథ్యం వుంది. అందుకే ఆయన కథల్లో నిత్య జీవితంలో తారసపడే పాత్రలు నేడు ద్యోతకవౌతున్న విభిన్నమైన జీవితాలు యధార్థ స్పృహతో గోచరమవుతాయి. ‘గుండు’ కథ కూడా కూడా కులాంతర యువకుడిని పెళ్లాడి ఎలా సంఘ మమేకమై జీవించినదీ చిత్రించిన సహజసిద్ధ కథ. కాట్రగడ్డ దయానంద్ అన్నట్లుగా ప్రకాశం జిల్లా కందుకూరు మాదిగపల్లెలోని జీవద్భాషని ఈ కథల్లో అద్భుతంగా చూపారు రచయిత.
ఈ కథల్లో జీవన తాత్వికతను నాటకీయంగా కాకుండా ఒక వాస్తవిక దృక్పథ సౌందర్యంతో అందుకోగలం. ఐండ్ల చంద్రశేఖర్ నాటకానే్న వృత్తిగా తీసుకున్నా జీవితాలనే తన కథన రంగస్థలంమీద సజీవం చేస్తున్నందుకు అభినందనలు. *

-సుధామ