పఠనీయం

సాహితీ మంజూష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ సాహిత్య వ్యాస సంపుటి
వెల:రూ.150/-
విహారి
సలీంనగర్,
హైదరాబాద్-36,
ఫోన్:9848025600,
*
కవిగా, కథా రచయితగా, సాహితీవేత్తగా సుప్రతిష్టుతులై ఇటీవలే అజో విభో ప్రతిభా వైజయంతి విశిష్ట పురస్కారం లక్షరూపాయల సత్కార ప్రకటితులైన విహారిగారి అసలు పేరు శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి. సప్తతికి ఓ ఏడాదిలో చేరువవుతున్న విహారిగారు నిత్య సాహిత్య రచనా విహారులే! వారిది అవిశ్రాంత కలం. ‘వివిధ’ పేరిట వారి సాహిత్య వ్యాస సంపుటి ఇరవై ఏడు వ్యాసాలతో నక్షత్రమాలికలా వెలువడింది. గురజాడ, పాలగుమ్మి పద్మరాజు, జి.వి.కృష్ణారావు, గిడుగు, సినారె, బోయి భీమన్న, అద్దేపల్లి, నగ్నముని, అదృష్టదీపక్ వంటి వారి రచనలపై వెలువరించిన వ్యాసాలు ఇందులో వున్నాయి. అదీకాక ఇటీవలే దివంగతులైన స్వాతంత్య్ర సమరయోధులు, సాంస్కృతిక, సామాజిక సేవానిరతులు, జంగమ విజ్ఞాన సర్వస్వం, జానపదకళాబ్రహ్మ, కళారంగ భీష్మ, కళారత్న, జానపద కళా నటకిరీటిగా వనె్నవాసికెక్కిన కర్నాటి లక్ష్మీ నరసయ్యగారికి వారి 94 సంవత్సరాల పుట్టినరోజుకి వారు వున్నప్పుడే గ్రంథం వెలువరించి అంకితం చేయడం నిజంగా పరితృప్తులను చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోగలగడం ఈ గ్రంథం విశిష్టత. సినారెపై, అద్దేపల్లిపై రెండేసి వ్యాసాలున్నాయి. అయితే ఇందులోని కొన్ని (ఓ నాలుగైదు కావచ్చు) విహారిగారు ఆయా గ్రంథాలకు రాసిన పుస్తక సమీక్షలు. అయితే గ్రంథసమీక్షలను సైతం వ్యాస స్థాయిలో క్లుప్త సుందరంగా రాయగలగడం ఆయన ప్రజ్ఞే!
కానయితే వారు చేసిన పుస్తక సమీక్షలతో నిజానికి నాలుగైదు సంపుటాలు వెలువడగల వీలుంది. రామచంద్రవౌళి నవల ‘కాలనాళిక’, నగ్నముని ‘విలోమకథలు’పై రాసిన వ్యాసాలు ప్రత్యేకించి చెప్పుకోదగినవి. అలాగే ఈ గ్రంథాన్ని అంకితం చేసిన కర్నాటి లక్ష్మీ నరసయ్యగారిపై పుస్తకంలోని తొలి వ్యాసంగా ‘జానపద కళా నటకిరీటి’ వ్యాసాన్ని సంతరించడం ఔచితీమతంగా వుంది. ‘వివిధ’ విహారిగారు వెలువరించిన 14వ వ్యాస సంపుటి. అర్జునుడితో పాటు భగవద్గీతను విన్న సంజయుడిలా, ధర్మదేవతతో పోరాడి ఆత్మరహస్యం తెలుసుకున్న నచికేతుడిలా విహారిగారు తనకు పొడగడతారని కీ.శే. మునిపల్లెరాజుచే ప్రశంసలందుకున్న సార్థక కలంజీవికి అభినందనలు.

-సుధామ