పఠనీయం

మూలకథలో వొదిగిన కల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేహల (చారిత్రక నవల)
-గొర్తి సాయి బ్రహ్మానందం
వెల: రూ.250
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర

** *** ****************

తెలుగులో చారిత్రిక నవలలు స్వాతంత్య్ర పూర్వ - స్వాతంత్య్రోత్తర అని రెండు భాగాలు చేశారు. పూర్వం స్వాతంత్య్ర సంగ్రామంలో అంతర్భాగంగా చారిత్రక నవల వచ్చింది. భారతదేశ చరిత్ర ఎంతటి వైభవోపేతమైనదో తెలియజేసి సమరయోధులకు స్ఫూర్తి నివ్వడం దాని ప్రయోజనం - స్వాతంత్య్రానంతరం స్వరాజ్యాన్ని స్వరాజ్యంగా మార్చుకోవటం కోసం చారిత్రక నవల వచ్చింది. తెలుగులో చారిత్రక నవలకు విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్ర్తీ, ముదిగొండ శివప్రసాద్ నాలుగు స్తంభాలు. ఇటీవలి కాలంలో పాలంకి సత్య వంటి వారు కొన్ని చారిత్రక నవలలు వెలువరించారు. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యంలో 1400 ప్రాంతంలోని ఒక ప్రేమకథను తీసుకుని గొర్తి శాయి బ్రహ్మానందం బృహత్ గ్రంథం రచించారు. దీని పేరు నేహల. ఇందుకు సంబంధించి మనకు చరిత్రలో ‘్ఫర్ గాటన్ ఎంపైర్’ వంటి గ్రంథాల్లో చాలా తక్కువ సమాచారం లభిస్తున్నది. రచయిత దానిని విస్తృతమైన నవలారాజంగా పెంచి పోషించారు. ఇందు శ్రీకృష్ణ దేవరాయలు, నేహల, వేదరాయలు, మంజరి వంటి ఎన్నో పాత్రలున్నాయి. ఇవి కొన్ని చరిత్రకాలు మరికొన్ని కల్పితములు. బసన్న అనే గూఢచారి మసూమ్‌గా పేరు మార్చుకొని బహమనీల వ్యూహాలను కనిపెట్టినట్టు రాశారు. అలాగే నేహల రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిందని రచయిత కథాకథనంలో చెప్పారు. చారిత్రక నవలలో చరిత్ర అందుబాటులోకి రాని చోట (లింకు) అనుసంధానంగా కల్పనలను వాడుకోవచ్చు. అంతేకాని పూర్తి కాల్పనిక కథను చారిత్రక నవల అనకూడదు. ఇందలి ఫిరోజ్‌షాహి, సుదరాజ్ వంటి పాత్రలు కొన్ని చారిత్రకమైనవే. కాకుంటే రచయితకు సంస్కృత భాషా పరిజ్ఞానం లేకపోవటం వల్ల దీనినొక సాంఘిక నవలా శైలిలో తీర్చిదిద్దాడు. అంటే చారిత్రక నవలకు వాడే శైలి వేరుగా ఉంటుంది. దానిని ఈయన నోరి నరసింహశాస్ర్తీ, విశ్వనాథ సత్యనారాయణ వంటి పూర్వ చారిత్రక నవలా రచయితలను అధ్యయనం చేసి నేర్చుకొని ఉండవలసింది.
‘మూలకథను ఎట్టి పరిస్థితులలోను మార్చకూడదని, కల్పనలు ఉన్నా మూలకథలో వొదగాలని’ తాను రెండు నియమాలు పెట్టుకున్నట్లు రచయిత చెప్పుకున్నారు.
లూకాస్ అనే హంగేరియన్ మార్క్సిస్టు చారిత్రక నవలలను మార్క్సిస్టు దృక్పథంతో చూడాలని నిర్వచించాడు. అంటే ఏ రచనలో అయినా వర్గ సంఘర్షణ, రాచరికపు దుర్మార్గులు స్ర్తిని విలాస వస్తువుగా భావించటం వంటి లక్షణాలకు ప్రతిపాదించాలనేది ఆయన సారాంశం. ఇది పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రం - అన్నట్లుంది అని పీఠికలో వేలూరి వెంకటేశ్వరరావుగారు అభిప్రాయపడ్డారు. ‘శంభుడు గీచిన నేహల బొమ్మ ఈ కథకు ప్రాణం’ - కాదు ప్రాణకంటకం’ ఇదొక ప్రేమకథ. దీనిని అలాగే చూడాలని ఏమీ లేదు. ఆనాటి హిందూ ముస్లిం సంఘర్షణల రూపంలో కూడా చూడవచ్చు. ఏ సంఘటనను అయినా చూచే దృష్టినిబట్టి ఉంటుంది. ఈ నవల లోగడ ఒక పత్రికలో ధారావాహికంగా వచ్చి ఇప్పుడు నవలా రూపంలో ముద్రింపబడింది.
నలుగురు గుడ్డివాళ్లు ఒక ఏనుగును పట్టుకున్నారు. వారిలో ఒకడికి ఏనుగు తోక దొరికింది. ఏనుగు శూలంగా పొడవుగా ఉంటుంది అని చెప్పాడు. ఒకడికి చెవులు చేతికి తగిలాయి. ఏనుగు చేటలా ఉంటుంది అని చెప్పాడు. ఈ కథ అందరికీ తెలుసు. ఇదిగో ఇలా ఈ నవలలో కాత్యాయనాయ విద్మహేకు స్ర్తివాదం కన్పించింది. వాసిరెడ్డి నవీన్‌కు మార్క్సిజం కనిపించింది.
చారిత్రక నవలా రచన ఒక యజ్ఞం లాంటిది. చరిత్రను మన అభీష్టాలకు అనుగుణంగా వక్రీకరించి వ్యాఖ్యానించకూడదు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బది సంవత్సరాలు దాటినా మన చరిత్రను పాఠకులకు భారతీయ దృష్టిలో చెప్పకపోవటం ఈ జాతి చేసుకున్న దురదృష్టం. గొర్తి సాయి బ్రహ్మానంద రాసిన ‘నేహల’ నవల చదివి ఆనందించండి.

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం