పఠనీయం

‘ప్రేమ’ పాజిటివ్, మరి మోహం ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహధూపం (కవిత్వం)
వెల:రూ.100/-
రచన రఘు-
ప్రతులకు : పాలపిట్ట బుక్స్, H.No. 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36,
=========================================================
నిజానికి ‘ప్రేమ’ పాజిటివ్ భావనకు ప్రోది అయితే,‘మోహం’ త్యజి ం చ దగ్గ అరిషడ్వర్గ పరంపరలోనిది. కానీ రఘు ‘మోహధూపం’ అని తన కవితా సంపుటికి పేరిడడంలోనే ఒక వైచిత్రి ఉంది. ‘పొగ’ అంటే ఉక్కిరిబిక్కిరి చేసేది కావచ్చు గానీ, ‘్ధపం’ అనడంలో ఒక పవిత్రత స్ఫురించి, ధ్వనిస్తుంది. ‘అగరుధూపం’ అనడం, పూజాదికాల్లో భగవంతునికి ధూపం వేయడం అనుకూల ప్రకంపనల పథమే! ‘మోహధూపం’ అన్న పదబంధం అందుకే వ్యతిరిక్తతలను అనుకూల్యాలుగా మార్చే మాధుర్య పరిణామశీలవౌతోంది. రఘు మంచి అధ్యయనపరుడు. ప్రాచీన సాహిత్యావలోఢనం చేసినవాడు.
మాధుర్య పరమసీమా సారస్వత జలధి మధన సంససభూతా పిబతా మనల్ప సుఖదావసుధాయం మమసుధా కవితా అనే ‘్భమినీ విలాసం’ లోనారసినవాడు. అందుకే మనిషిలోని అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయగల కవిత్వపు ఆల్కెమీ ఎరిగినవాడయ్యాడు. ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ ఆఫీసరే గానీ బ్రతుకు భద్రతకు న్యాయమైన విలువలకు పట్టం కట్టే కవితార్ద్ర హృదయుడు. తన కవిత్వపు పద చిత్రాలు తిలక్, శేషేంద్ర అనే కవిత్వపు ఒడ్డులను ఒరుసుకుని ప్రవహిస్తున్నట్లుంటాయి. కలవరింతలా కాక కళాత్మక తుళ్ళింతగా కానవచ్చే అభివ్యక్తి రఘుది.
‘మోహధూపం’లో ‘అతడు-ఆమె’ ఎవరో ఇలా చెబుతాడు.
ఎగిసిపడే ఆమె ఊపిరే వేసవి
తడిసిన వొళ్ళే వానాకాలం
బిగి కౌగిలి పేరు చలికాలం
ఆమె కాలానికి సంకేతం
అతని ఛాతీ పేరు మైదానం
కళ్ళలో రుచి మరిగిన కోర్కెల దాహం
వాడొక నడుస్తున్న కండల గోళం
వెరసి స్థలానికి ప్రతిరూపం!
జతపడిన అడుగులు
తర్కించని పెదవులు
ముడివిడవని గుండెలు
స్థల కాలాలు వేరు కావు
అతడిని స్థలంగా, ఆమెను కలంగా ‘కాలకన్య’ అనే కవి సమయంగా రూపుకట్టిస్తున్నాడేగానీ ఆమె స్థలాన్ని కాలావధులు లేక ఆలింగనం చేసుకునే అతని మోహధూపాన్ని అంతరాంతరంగా ప్రతిధ్వనిస్తున్నాడు. కవిగా మనిషికి వస్తువుకు మధ్య తలవంచే కంటిచూపుతో ఒక బాధాంతర భృతిని అలరించే వాక్యంగా పోటెత్తించగల వాటమున్నవాడు. ఇందులోని యాభై ఎనిమిది కవితలూ విశుద్ధాంతరంగ వాక్యాలు
ఊహల్లేని కవైనా కదలికైనా
ఆఖరికి కవితలైనా నాకొద్దు.. అంటూ-
నాకు నీ కవిత్వంమీద, దాన్ని భరించే
ఆదివారం పత్రికమీద భ్రమల్లేవు
ఎక్కడైనా ఒక మబ్బు చెట్టు మొలిస్తే
రెండు కళ్ళనూ చినుకులు చేసి
ఇలాతలం తలమీద పాదంలా మోపుకుంటా
కండలు తిరిగిన నా ఊహల్లో
ఒక అంతఃపురం కట్టుకుంటా
ఇప్పుడు కుల సంఘాలు కాదు
కవిత్వమే కావాలి
నా చుట్టూ రాలిన ఎండని, వానని
వాటి ప్రతి అవయవాన్ని పద్యంలా మార్చే
వాక్యం కావాలి
అని నినదిస్తాడు. ఎప్పుడు నా నేల తొలకరిలో వికసిస్తుందో- ఎప్పుడు మట్టివాసన ఒక పువ్వై ఊపిరి పులకరిస్తుందో అప్పుడు కొట్టండి చప్పట్లు. అందాకా ఈ వాక్యాలని మీకు కానుకగా ఇవ్వనుగాక ఇవ్వను అంటున్నాడు గానీ బుద్ధినీ హృదయాన్నీ రెండు చేతులు చేసి కరతాళ ధ్వనులు చేయగల మోహధూపం కవితారసపిపాసువులకు ఒక మంచి ఉపాయనం.

-సుధామ