పఠనీయం

జీవితానుభవాలు- కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త కథలు కథల సంకలనం
సంకలకర్త:డా తెనే్నటి సుధాదేవి, వెల:రూ.500/-,
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
==================================

క థల సంకలనాల్ని ప్రచురించదలచుకున్న ప్రకాశకులు ఒక నిర్దిష్టమైన కాలాన్ని, నిర్ణయించి వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడిన కథలను సేకరించుతారు. అలా సేకరించిన కథలను, వడపోత ప్రక్రియ ద్వారా ప్రచురణార్హతను నిర్ణయించి ప్రచురించుతారు. ఇది కొద్ది కాలంగా వస్తున్న ఆనవాయితీ.
అయితే ఏఏ కథలు ప్రకాశకులు నిర్ణయించిన ప్రమాణాలకు సరితూగుతాయో, ఏయే కథలు సరితూగలేవో నిర్ణయించటం కష్టతరము మరియు క్లిష్టతరము కూడా! ఒక్కోసారి ప్రకాశకులు ఒత్తిడులకు తలొగ్గారన్న ‘అపవాదు’ కూడా వింటుంటాము.
ఇలాంటి వివాదాల జోలికి పోకుండా ప్రచురణకర్తలు - వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్టువారు గత సంవత్సరంనుండి ఒక క్రొత్త ఒరవడికి పూనుకున్నారు. కొత్త కథలు (2017) అన్న టైటిల్‌తో లబ్ద ప్రతిష్ఠులైన కథకులను ఆహ్వానించి ప్రచురించారు. అయితే 2017 కొత్త కథల సంకలనంలో పాల్గొన్న వారందరూ రచయిత్రులే అవటం గమనార్హం.
ఈ యేడు కూడా ప్రచురణకర్తలు అనుభవజ్ఞురాలైన డా.తెనే్నటి సుధాదేవి గారి ఆధ్వర్యంలో ‘యద్దనపూడి సులోచనా రాణి స్మరణలో’ అంటూ 65 మంది పేరుగాంచిన రచయితలు రచయిత్రుల కొత్త కథలు ప్రస్తుత సంకలనంలో పొందుపరిచారు. వీరిలో 44గురు రచయిత్రులు, 21 రచయితలు కాగా మిగతా తొమ్మిడుగురు ప్రవాస తెలుగు రచయితలు. ప్రవాసులలో ఐదుగురు ఎన్‌ఆర్‌ఐలుండటం విశేషం.
కథా వస్తువుపరంగా గమనించితే రచయిత్రుల్లో సింహభాగము, కుటుంబం, కుటుంబ సంబంధాలను, ఒక స్ర్తి తాత్త్విక దృష్టితో గమనించి రాసినట్లనిపిస్తుంది. సమాజాన్ని మైక్రో లెవెల్లో పరికించి మన ముందుంచారు వీరంతా. కొందరు రచయిత్రులు, వృక్షాలపై రాసారు (చెట్టు కూలింది) జంతువులమీద ప్రేమ కనబరిచారు (సేంద్రియ ఎరువు). ఒక కధ - పెళ్లి వర్సెస్ స్వేచ్ఛ (ఒక పెళ్లికధ)ను వివరించింది. పోలీసులు పోలీసు స్టేషన్ (వాటా) సెల్‌ఫోన్ లోకంగా (పూలకారు). కొడుకూ కోడలే అయినా తల్లిదండ్రులతో ఎవరి జీవితం వారిదైతేనే మంచిది (పర్సనల్ స్పేస్) లాంటి వస్తు కథల్ని ఎన్నుకున్నారు.
రచయితల కథలు వీటికి భిన్నంగా ఉండి తాత్వికము (దానం) ఐఫోన్ (మరో చిన్న యవ్వనం) లోకం దృష్టిలో ‘తప్పు’ చేసైనా సంసారాన్ని నెట్టుకురావటాన్ని సమర్థించటం (పునిస్ర్తి) రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను మానవ జీవితాలకి అన్వయించటం (సిగ్నల్) లాంటివి వివరించారు.
ఇక ఎన్‌ఆర్‌ఐలు వారు ఎన్నుకున్న వస్తువుల్లో అమెరికా జీవితం (ఆరడుగులుంటాడా?) అమెరికా జీవితం వద్దనుకుంటూనే అందులో చిక్కిపోవటం (పరీక్ష). ప్రవాస యాంత్రిక జీవితంలో కూడా తమ రచనా కౌశలాన్ని చూపించారు.
సీరియస్ జీవితాలకు ఆటవిడుపు ఇచ్చి, హాయిగా నవ్వుకోగలిగేది ఒకే ఒక కథ (ఎంకిపెళ్లి సుబ్బిచావు)
జీవితాలను, జీవితానుభవాలను, కథలుగా మలిచిన తీరు బావుంది. పాఠక లోకానికి ఇదివరకే పరిచయం ఉన్న పాత రచయిత్రుల / రచయితల కొత్త కధలు ఇవి. 65 కథల్నీ, ఆరువందల పేజీలను హాయిగా తిరగెయ్యగలం. ‘చర్విత చర్వణం’ అవునో కాదో తెలియదు. కానీ రచయితల వ్యక్తిగత వివరాలు కొద్దిమేరకైనా, ఇస్తే ఇంకా బావుండేది.

-కూర చిదంబరం 8639338675