పఠనీయం

అనుబంధాల టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ జీవితం (కథలు)
- డా లక్ష్మీరాఘవ
- జె.వి.పబ్లికేషన్స్ ప్రచురణ, వెల:రూ.100/-, 3-99, అప్పగారివీధి, కురబలకోట-517350, చిత్తూరు. 9440124700.
================================================================
‘టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకుని వెలుగు వైపు ప్రయాణం చేయాలి కానీ దాని వెలుగునే చూస్తూ అంధకారంలో పడిపోకూడదు, కదా’ అనే హెచ్చరికతో, టెక్నాలజీ పెరిగి క్షణికానందాన్ని ఇచ్చే వస్తువులపై బంధాన్ని పెంచుకుని జీవితాల్ని గడుపుతూ, పిల్లలను అసలైన రక్తసంబంధాలను దూరం చేసుకుంటున్న నేటి తరం జీవితాలకు అద్దం పట్టే కథల సంపుటి డా. లక్ష్మీరాఘవ- ‘స్మార్ట్ జీవితం’. గతంలో ‘నావాళ్ళు’, ‘అనుబంధాల టెక్నాలజీ’, ‘అపురూపం’ కథా సంపుటులు వెలువరించిన రచయిత్రి నాలుగవ కథా సంపుటి ఈ స్మార్ట్ జీవితం.
రచయిత్రిలో ప్రథమగణ్యమైన విశేషం ఏమిటంటే ఈ కథలన్నీ అధిక శాతం చిన్న కథలే. వర్ణనలతో విసుగెత్తించే వైఖరి ఎక్కడా కనబడదు. 23 కథానికలు, తొమ్మిది మినీ కథలు మొత్తం 32 కథల సంపుటి ఇది. వ్యర్థపదార్థాలతో వివిధ ఆకృతులు చేసి కళాత్మక ప్రదర్శనలు ఇచ్చే హస్తకళల విదుషీమణి కనుకనే లక్ష్మీరాఘవ కథానికల్లో వ్యర్థమైనదేమీ లేని సార్థకభావనలకు పట్టం కట్టడం కనిపిస్తుంది.
‘ఇదే’ అన్న కథలో ఇక ముందు కులం, గోత్రం లేకుండా ఆడ, మగ అన్న విషయంమీదే పెళ్లిళ్ళు జరుగుతాయేమో’ అన్న లలిత ఆర్తికి సమాధానంగా ‘అలా ఎందుకు అనుకుంటారండీ! ఎలాటి పెళ్ళిళ్ళు అయినా పిల్లలు సుఖంగా ఉండటమే కదా కావాల్సింది. వాళ్ళకు బాగుంటే మనకు బాగుంటుంది అనుకుంటే పోలా- అన్న రాధమ్మ పలుకు నిజంగా నేడు జీర్ణించుకోదగిన వాస్తవం. నిత్య జీవన సమస్యలనుండి ఖేదపడటం కాక వాటి ఉత్పన్న హేతువులు తెలుసుకుని పరిష్కారాల దిశగా ఆలోచింపజేసే కథానికలు ఇవి.
ఇంటింటికీ మరుగుదొడ్లు స్వచ్ఛ్భారత్ నినాదంగా వున్నాయి గానీ, కొన్ని పల్లెల్లో నెలసరి వచ్చే ఆడవాళ్ళకు శానిటరీ నాప్‌కిన్స్ కూడా లేక, లారీలవాళ్ళు రోడ్లపై పారేసే బట్టలకోసం పిల్లల్ని ఏరుకురమ్మని తరుముతున్న హృదయవిదారక స్థితిని రూపుకట్టిస్తూ కర్తవ్య ప్రబోధాన్ని తెలిపే కథ ‘శుచి’.
శరణాలయాల పేర స్వార్థంతో అనాథలను అడ్డం పెట్టుకుని డొనేషన్లు అవీ సంపాయించి వైభోగంగా వెలిగేవారు కాక నిజమైన మంచిమనసుతో వున్నంతలో ఆర్తులను ఆదుకోవడమే కావాల్సింది అనీ, అలాంటివారివల్లనే భగవంతుడికి నిశ్చింత అని చెప్పే కథ ‘శరణాలయం’. కాబోయే శ్రీమతిపై పెళ్లికి ముందే నిఘా పెట్టే మగబుద్ధి గురించి ‘ఎంక్వయిరీ’ కథ, చిన్న బిడ్డనుంచి ముసలివారి వరకు అకృత్యలు జరిపే కామాంధులు పెరిగిపోతున్న ఈ సమాజంలో స్కూల్లో ఆడపిల్లలకు కలిగించవలసిన అవగాహనను ‘ఝాన్సీ’ కథ, అలాగే ‘నిఘా’ కథలో మనవడి మాంద్యతను కనిపెట్టి శారదమ్మ కొడుకు, కోడలుకి పిల్లలపై నిఘా పెట్టవలసిన ఆవశ్యకతను వివరిస్తోంది.
‘కాలం మారింది చాలా’ అంటూ సంపుటి చివర స్వగతాన్ని ఓ కవితగా కూడా సంతరించారు లక్ష్మీరాఘవగారు. ఏడు పదులు నిండిన వయసులోనూ ఎవర్‌గ్రీన్‌గా కాలంతోపాటు ‘అప్‌టు డేట్’ అవుతూనే నిలబెట్టుకోవలసిన విలువల గురించి తన కథానికల ద్వారా రచనా వ్యాసంగం సాగిస్తున్న రచయిత్రి అభినందనీయురాలు.

-సుధామ