పఠనీయం

ఆపాత మధురాలు -చిన్ననాటి జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాను వీధి కతలు
రచన:రామదుర్గం మధుసూదనరావు, వెల: రూ.120/-, ప్రతులకు: ఆర్.జయలక్ష్మి, 304, కౌస్త్భు టవర్స్, కొత్తపేట, హైదరాబాద్ విశాలాంధ్ర నవచేతనా బుక్ హౌస్‌లు
------------------------------------------------------------------------------------------------------------
ఒకే ‘కథావస్తువు’(Theme) కధలు రాయటం ఒక పద్ధతి. వివిధ వస్తువుల్ని ఎన్నుకుంటూ కధలల్లటం మరో పద్ధతి. మొదటి పద్ధతిలో ఒక సౌలభ్యం వుంటుంది. కధ రాసే ప్రతిసారీ ‘వస్తువు’ను వెదుక్కోనవసరం లేదు. వైవిధ్య కోణాల్లోంచి వస్తువును ఫోకస్ చేస్తూ రాసుకుపోవచ్చును. అయితే ఈ ఏక వస్తు ప్రాధాన్యతగల కధల్లో ఒక రిస్క్ ఉంటుంది. సరైన శిల్పాన్ని మెయిన్‌టెయిన్ చెయ్యకపోతే పాఠకుడికి విసుగుపుట్టి ప్రక్కకు పెట్టవచ్చును.
కర్నూలు జిల్లా ‘ఆదోని’ అనే ఊరిలో ‘కమాను వీధి’ అనే ప్రాంతం వుంది. కమాను (ఆర్చి) దాటి ఆ ప్రాంతంలో ప్రవేశిస్తే పదమూడు ఇళ్లు కనబడతాయి. పదమూడు ఇళ్ళున్న ఈ వీధిని తన కధా వస్తువును చేసుకున్నాడు ఈ రచయిత రామదుర్గం మధుసూదనరావు. తన బాల్యాన్నీ, ఆ వీధిని, వీధిలో వున్న పదమూడు కుటుంబాల వ్యక్తులను, ఆ కుటుంబాలతో పెనవేసుకుపోయిన దైనందిత జీవితాలను 25 కధలుగా మలచి ఈ సంకలనం ద్వారా పాఠకులకు రచయిత రామదుర్గం మధుసూదనరావు పరిచయం చేస్తున్నాడు.
ప్రధమ పురుషలో సాగే ఈ కథలన్నింటిలోనూ, బాలుడైన కధకుడే ప్రముఖ పాత్రధారి.
అయితే, ఈ కథలన్నీ, ఎంతో సహజంగా నడిపించబడ్డాయి. ఈ కధలు చదువుతోన్న ప్రతి పాఠకుడూ తన బాల్యాన్ని వెద్కుంటాడు. తన బాల్యాంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను, ఈ కథల్లో చదువుతూ కధలతో మమేకవౌతాడు.
విద్యార్థి దశలో నాటకాలు వేయటం, ఆటలు ఆడటం, పెన్నులు పోగొట్టుకోవడం, తండ్రి మందలింపులు, తల్లి అనునయాలు- అతి సహజంగా ఆ ప్రాంతపు భాషతో, యాసతో, వివరించబడ్డాయి. మార్క్ ట్వెయిన్, ఆర్కే నారాయణ, రవీంద్రనాధ్ టాగోర్‌లాంటి ప్రఖ్యాత రచయితలు సృష్టించిన టాంసామర్, స్వామి, పథిక్ చక్రవర్తులను గుర్తుకు తెప్పిస్తాడీ రచయిత.
కధ అన్నాక ‘కల్పన’ తప్పదు. కాని ఇందులో మనకు కనిపించే- సెలబ్రిటీ శరభణ్ణ, కోమలమ్మ, తల్లి శాంతమ్మ, కమాను వనజమ్మ, విశాలాక్షమ్మ; స్నేహితులు చంద్ర రఘు, వేణు, నగేష్‌గాడు, పొట్టి డాక్టరు అనబడే గాయత్రి డాక్టరు, వంటలమ్మ పద్దమ్మ; సామిబాబా కానె్వంటు స్కూలు అర్ధగేరి బసవన గౌడ మున్సిపల్ స్కూలు, హాసన్నపేట స్కూలు; దీపావళి మందుగుండు సామాను- కేపులు, పాంబిళ్ళలు, మతాబు పెట్టెలు, వంకయ బాణాలు, లక్ష్మీ బాణాలు; గోళీలాట, బచ్చాలాట, బొగిరి (బొంగరం), గాలిపటాలు- ఇవన్నీ గ్లోరిఫై చేయబడుతాయి. ఈ సంఘటనలలో పాఠకులు తమను తాము మళ్లీ ఓసారి వెదుక్కునేలా చేస్తారుూ కథలు.
చిన్నపిల్లాడిగా పద్దమ్మ (పే 125)ను వివరించిన తీరు, గాయత్రి డాక్టరు దగ్గరి కాంపౌండర్ గీర, కర్ఫ్యూలో హైద్రాబాద్ నుంచి వచ్చిన పోలీసుల వీరవిహారం, పుకార్లు (పే.89), నాటకాలు (పే.132), కౌన్సిలర్ పోటీకి గోడలమీది రాతలు (పే.138)- ఇవన్నీ బాల్య ప్రపంచాన్ని ఆవిష్కరించిన ఘనత ఈ రచయితకు దక్కుతుంది. నోటాల్జియా (బాల్యస్మృతులు) ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. ఆ బాల్య స్మృతుల మాధుర్యాన్ని మరోమారు ఆస్వాదించాలనుకుంటే ఈ కమాను వీధి కతలు తప్పక చదవాలి.

-కూర చిదంబరం 8639338675