పఠనీయం

పాడుతా తీయగా ఒక ఖండకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథం పేరు -పాడుతా తీయగా
రచయిత్రి: డా పర్యాద సరళ పేజీలు: 60, ధర:రూ.50/-
ప్రతులకు:పర్యాద సరళ, 37-93/45/2, మధురానగర్, నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్డు,
సికిందరాబాద్ మరియు అభి భారతీయ సాహిత్య పరిషత్తు, సికిందరాబాద్.
================================================================
ఈటీవీలో ‘పాడుతా తీయగా’ అనే కార్యక్రమాన్ని చూచి పులకించి, స్పందించిన రచయిత్రి డా. పర్యాద సరళ గారు రచించిన కృతి ఈ ఖండకావ్యం. ఇది ఒక విధంగా ఒక వినూత్న ప్రయోగం. 108 సీస పద్యాలతో 28 శీర్షికలుగా వున్న గ్రంథం.
దీనికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డిగారు ‘పద్యంలో పరిమళ స్వరాలు’ అని రాస్తూ ఇలా అన్నారు- ‘పాడుతా తీయగా’తో పరవశించిపోయి గాన రస గాంధర్వంతో అద్వైతసిద్ధి పొంది, మందార మకరంద మాధుర్యాన్ని నింపి పాడుతా తీయగా సాగే భవ్యగతుల సాగె, ప్రభలు విరిసి, సాగి పరిమళించె, పాట పరిమళించె, సాగి పరవశించి, సాగి పల్లవించి’ అనే వివిధ మకుటాలతో అందమైన 108 పద్యాల నందించారు.
సుప్రసిద్ధ చలనచిత్ర గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈటీవీలో ‘పాడుతా తీయగా’ శీర్షిక క్రింద తాను పాడుతూ ఎంతోమంది చేత పాడించి గానంలోని లోపాలను వారికి సున్నితంగా చెబుతూ ఒక విజ్ఞాన బోధకంగా ఈ కార్యక్రమం సాగింది.
దీనిలో రచయిత్రి మందార మకరందాలులో ఇలా అంటారు ‘రాగమై, భావమై రస గంగ తానమై సాగెనే సంగీత రాగసుధలు’, ‘దివ్యనాదాల సురగంగ భవ్యగతుల సాగివచ్చెను దివినుండి సంతసమున’-
‘నాదబ్రహ్మం’లో ‘ఓంకారమే తొల్త నొక రాగమై వెల్గె’ అనే పద్యం మొదటిదే అయినా ఈ కావ్యానికి మకుటాయమానంగా ఉన్నది.
‘తెలుగు వెలుగులు’ (పద్యం 80)లో ‘అమ్మ భాష మరచి ఆంగ్ల పోకడ నేర్చి భారతీయతలోని ప్రతిభ మరచి, అమ్మ నాన్నలె కాదు కమ్మనైన తెలుగు సంస్కృతినే విడనాడి జగతిలోన’ అనే పద్యం నేటి యువతరానికి ఒక మేలుకొలుపులాగా ఉండి రచయిత్రి ఆవేదనను వ్యక్తం చేస్తున్నది.
ఈ గ్రంథానికి ముందుమాటలో ‘ఆశీరాభినందనాలు’ అందిస్తూ డా. సి.నారాయణరెడ్డిగారు ఇలా అన్నారు. ‘‘ఈ సీస పద్యాలలోని విశేషాలను వివరించాలనుకుంటే ప్రతి పద్యం నేనంటే నేనని ముందుకొస్తుంది. అందువల్ల ఒక్క వాక్యంలోనే ‘్భళిరా పర్యాద సరళమ్మ భళిరా! భళిరా’ అన్నారు. ఇది అక్షరసత్యం. చివరి పద్యం జయనాదంలో (108) జయము పద్యమునకు అనేది మాబోంట్లకు ఎంతో మక్కువైనది. ఈ కావ్యాన్ని చదివితే రచయిత్రి యొక్క సంగీత సాహిత్యాలలోని ప్రతిభ, ఆవిడ చేసిన వర్ణనలు, వాటికి వారు పేరుపెట్టిన విధం అంటే ఆ పద్యాలను వివిధ పేర్లతో (శీర్షికలు) విశే్లషించారు. ఇవన్నీ కడు రమ్యంగా ఉన్నాయి. పద్యం ఆమె చేతిలో హృద్యమై పాఠకులను పరవశింపచేస్తోంది. తెలుగు భాష అన్నా, తెలుగు పద్యమన్నా అభిమానం వున్న ప్రతివారు తప్పక చదవాల్సిన గ్రంథమిది. రచయిత్రిని అభినందిస్తూ ఆమె ప్రతిభను ఇంకా మంచి కావ్యాలతో ప్రకటీకృతం చేయగలరని నమ్ముతున్నాను.ఈ గ్రంథంలోని పద్యాలు 28 శీర్షికలుగా ఉండటం శ్రీవిద్యను సూచిస్తోంది.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649