పఠనీయం

మానవత్వం ఉట్టిపడే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధి- పెరుకరాజు కథలు- రచన:పెరుకరాజు వెల:రూ.80/- ప్రతులకు: మైగిఫ్ట్ ఆర్గనైజేషన్, విలేజ్ నర్సింగాపూర్,
చందుర్తిమండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
=================================================================
పెరుక రాజు ఆర్మీలో పనిచేస్తాడు. కళాహృదయంగల రాజు తన తీరిక సమయంలో, దేశం గురించి, దేశ రక్షణ గురించి, మిలిటరీ వ్యవస్థ గురించి, తననింతవాడిని చేసిన తన ఊరు, ఊరి ప్రజల గురించి, వారి బంగారు భవిష్యత్తు గురించి ఆర్తితో తపించే వ్యక్తి. తొమ్మిది భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. లోగడ నాలుగు సాహిత్య సంపుటాల్ని వెలయించాడు. ‘మై గిఫ్ట్ ఆర్గనైజేషన్’ అన్న సంస్థను స్థాపించి, తన ఊళ్ళో పలు సాహిత్య మరియు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుత కథా సంకలనం ‘విధి’ రాజు అయిదవది. సాహి ఇందులో 16 కధలున్నాయి. ఇందులో కథలు తాను పనిచేసే ఆర్మీ సంబంధితమైనవి కాగా మిగతా కథలు, అవిద్య, దారిద్య్రంతో బాధపడుతున్న తోటి పల్లెవాసుల గురించి, వారి జీవన స్థితిగతుల గురించి వివరిస్తాయి.
ఆ సాఫ్ట్‌వేర్ దంపతుల ఇంట్లో అన్నింటికీ అమ్మలా ఆగమ్మ ఆదుకుంటుంది. అనారోగ్యానికి గురియై ఆగమ్మ ఆ యింట్లోంచి వెళ్లిపోతే గాని ఆమె విలువ ఆ సాఫ్ట్‌వేర్ దంపతులకు తెలిసిరాదు ‘ఆగమ్మ’ కథలో. పెళ్ళికొడుకు తరఫువారు అడిగినంత కట్నం ఇవ్వలేకపోతే, మరదలి పెళ్లి ఆగిపోతుండగా ఆదుకుంటాడు గోవింద్ (గోవింద్ కథలో).
కూతురిలో చురుకుదనంపాలు గమనించి, డాక్టర్‌ను చేయాలనుకుంటాడు బళ్ళో అటెండర్ నర్సయ్య. అహోరాత్రాలు శ్రమించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు తన భార్యా పిల్లలు గేలిచేసినా, వెనుకంజ వేయకుండా లక్ష్యాన్ని సాధించి నలుగురిలో శభాష్ అనిపించుకుంటాడు నర్సయ్య తులసి కథలో. రాజు కథల్లో మానవత్త్వం, సాటివారిని ఆదుకోవాలనే తపన కనిపిస్తాయి. ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తన అనుభవాలను మనతో పంచుకోవాలన్న తపన కనబడుతుంది. అభినందించదగ్గ రాజు సత్సంకల్పానికి రచయిత మరియు పబ్లిషర్స్ మరికొంత శ్రద్ధ పెడితే సంకలనం ఇంకా బాగా వచ్చేది. కొన్ని కథల్లో రచయిత ఏం సందేశం ఇవ్వదల్చుకున్నాడో పాఠకుడికి స్పష్టమవదు. ‘విధి’ కథలో ఒకచోట ‘అఘాయిత్యాలు’కు బదులుగా ‘అగచాట్లు’ అనటంవల్ల అర్థమే మారిపోయింది. ఈ కథల వౌలిక స్వభావం బావుంది. ఎటొచ్చీ వివరించిన తీరులో మరికొంత శ్రద్ధ పెట్టి సంకలనాన్ని తీసుకువస్తే మరింత బావుండేది.

-కూర చిదంబరం 8639338675