పఠనీయం

ఏకాంతంలో ధైర్యంతో.. ధ్యానంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యం.. మృత్యువుకే మృత్యువు
మూలం:ఓషో అనువాదం:్భరత్ పుటలు:176 మూల్యం: రూ.225/- ప్రతులకు:గాంధీ బుక్‌హౌస్, 9490004261

ఓషోకి ధైర్యం ఎక్కువ.
దూసుకుపోవటమే తప్ప వెనుతిరిగిచూడటం తెలీనివాడు.. వెరపులేనివాడు.. వెరవనివాడు.. ‘మృత్యువుకే మృత్యువు’ కాగలిగినవాడు.
లోకం కాకిగోల చేసినా తాను కోకిలగానం చేసినవాడు.. అర్థం చేసుకోగలిగినవారికి అర్థం చేసుకోగలిగినంతవాడు.
నదిలో ఈతకొట్టడం కాదు కానీ అగ్నిగుండంలో సైతం అడుగులేసి, చిందులేసి పాదాలు బొబ్బలెక్కకుండా మళ్లీ ప్రపంచాన్ని ఆకర్షించగల అతిథి. చూపులతో ఎంతలా మెస్మరైజ్ చేయగలడో పదాలతోను అంతలా వశీకరించుకోగలడు. అందుకే, ఓషో వ్యక్తిత్వంపై మచ్చలు పడ్డప్పటికీ అతడి అక్షరాలు మాత్రం నిప్పుకణికలే! కడిగిన ముత్యాల్లాంటి వాస్తవాలు నేస్తాల్లా పలకరిస్తుంటాయి. అనేక సందర్భాల్లో స్నేహితునిలా హెచ్చరిస్తుంటాయి. అక్కడక్కడ చెప్పిన కథలు కాకమ్మ కబుర్లులా కాక సిగ్గిలని సత్యాలను ఆవిష్కరిస్తుంటాయి.
అసలు, ఓషో ఎంత హాయయిన మనిషంటే ‘‘మీరు ఏకాంతంలో మీతో హాయిగా ఉండటమే’’ ధ్యానం అనగలిగినంత హాయయిన వ్యక్తిత్వం వున్న మార్గదర్శి. ఇది చాలదన్నట్లు, ప్రేమ చేతిలో అందరూ నిస్సహాయులే అంటూ ఏ ఒక్కరికీ ఎగ్జెంప్షన్ ఇవ్వకుండా తేల్చేసిన తాత్విక సంపన్నుడు.
‘ప్రేమ లేని ధ్యానంతో తూర్పు దేశాలు, ధ్యానం లేని ప్రేమతో పాశ్చాత్య దేశాలు పూర్తిగా ఓడిపోయాయి’- ఈ వాక్యాలు చదువుతుంటే ప్రేమకు, ధ్యానానికి అంతటి రహస్య ఒప్పందం ఉందా అని అనిపిస్తుంటుంది. అవును, ఈ సంసార జీవనంలో ఒక కొసన ప్రేమ పుష్పించి, పరిమళించక తప్పదు. మరొక కొసన ధ్యానం గురించి, చరమాంకందాకా తోడు రాకా తప్పదు. ఇలా ప్రేమ ధ్యానాలది చిరంజీవిత్వమే! ఈ రెండింటినీ సమన్వయం చేయగలిగిన మనం చిరంజీవులమే! ఇదండీ ఓషో చిరంతన ప్రయాణం.
అన్నట్టు, ‘ఒంటరిగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నపుడు అంతరంగంలోపల, అంతరంగం వెలుపల అందరూ సంతోషంగా ఉండగలిగాలి’ అన్న ఓషో మాటలు చెవులలో గింగిర్లుకొడుతున్నప్పుడల్లా మనం ధ్యానమగ్నం అయ్యే తీరతాం. అందుకే, ఓషో ఎంతో ధైర్యంగా ‘‘నేను అందరినీ చాలా సున్నితంగా, బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండేలా చేస్తాను’ అంటూ మనల్ని తనముందు హట్సాఫ్ అనేలా చేస్తాడు. తాను మాత్రం హాట్ పెట్టుకుని - పుస్తకం అట్టమీద వున్నట్టు ఒక ఫోజ్ పెడతాడు- అయినా ఆ చూపులే కాదు.. ఆ గడ్డమూ ధైర్యంగానే మనల్ని గిలిగింతలు పెడతాయి. ఓషో ఆ పొడవాటి గడ్డం మనల్ని బ్రషఫ్ చేస్తుంటే, చూపులు గుండెలోతుల్లోకి దిగుతాయి. మన అంతరంగాన్ని ఒక్క కుదుపు కుదుపుతాయి.
‘‘మనం దేనిని దాచినా అది ఎదుగుతూనే వుంటుంది’’. అవును, దాచిన మనం ఎదగం కానీ, దాగిన అది ఎదుగుతూనే వుంటుంది. ఈ రహస్యం తెలిసినవాడు, నిత్య ధ్యాని. అంటే, కళ్లు మూసినా, కళ్లు తెరిచినా ధ్యానమే! ధ్యానించని క్షణమంటూ ఉండదు.
అన్నట్టు, సన్యాసానికి ఓషో మరో నిర్వచనం చూడండి-
మన నగ్నత్వాన్ని మనం తెలుసుకోవటమే సన్యాసం! అట.
- మన వాస్తవాలను ఇతరులతో కాక మనతో ధైర్యంగా చెప్పుకోగలగటమే ధార్మికత! అట.- మన భయాలను మనం అంగీకరించటమే నిర్భయత్వం! అట! - మనం ఏకాంతంలో మనతో హాయిగా ఉండగలగటమే ధ్యానం! అట!
పంచప్రాణాలు లేచొచ్చి మనల్ని ధ్యానమగ్నం చేసే మాటలు ఇవి! మనసును నియంత్రించే ఓషో తంత్రాలు ఇవి!!
ఉడుక్కోనంటే మరొక్క మాట-
‘‘చిరాకుపడుతూ విసుక్కునే ఏకైక జంతువు కేవలం మనిషి మాత్రమే!’’- ష్.. చిరాకుపడకండి! జంతులక్షణాలకు వారసులు కాకండి!! అబ్బా.. అట్టమీది ఓషో చేతిలోని కత్తి ఇలా మన మనసు పొరల్ని చీల్చిందేమిటి?!
ఇంతకీ మన కింకర్తవ్యం ఏమిటి? మన పట్ల మనం బాధ్యతగా ఉండటం! దీనే్న ఓషో ‘‘మీరు మీ పట్ల బాధ్యతయుతంగా ఉండాలి కానీ బుద్ధుడు, కృష్ణుడు, నానక్, జీసస్, మహావీరుల పట్ల బాధ్యతాయుతంగా ఉండవలసిన పనిలేదు’’ అని కుండ బద్ధలు కొడతాడు. యస్.. హి ఈజ్ యాన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్! అస్తిత్వాన్ని కేంద్రంగా చేసుకుని తన ప్రపంచాన్ని తానే రూపింపచేసుకున్న తాత్విక ప్రభంజనం! అయినా, అగ్నిగుండం మాటల్ని ఆకాశానికి ఎగదన్ని అడుగుజాడల్ని మిగుల్చుకున్నవాడికి ఈ లౌకిక సునామీలు ఒక లెక్కా!?
ఇంతకీ, ‘్ధర్యం’ అంటే ‘్భయం లేకపోవం’. పోనీ, భయం లేకపోవటం అంటే- మన శ్వాస చాల హాయిగా, నిశ్శబ్దంగా సాగటం-అందుకే, గాఢ ధ్యాన స్థితిలో మన శ్వాస దాదాపుగా ఆగిపోయినట్లనిపిస్తుంది, అనిపించటం కాదు- అంతలా మందగిస్తుంది. అదీ ధైర్యం అంటే! అదీ ధ్యానం అంటే! ఇలా శ్వాస మందగించటం ఇచ్ఛగించనివారిలో ధ్యానం ఈ జన్మలో వారిని గట్టెక్కించదు కాక గటెక్కించదు. భయాన్ని అంగీకరించటమే మనకున్న స్వేచ్ఛను వ్యక్తీకరించటం.. అది నిర్భయానికి చేరువ చేస్తుంది. అలాగని భయాన్ని నిరాకరించినా అది అపరాధంగా పరిణమిస్తుంది. అంటే, పరిణమించటానికి మనం చేయవలసింది భయాన్ని నిరాకరించటం కాదు.. భయాన్ని అంగీకరించటం. భయపడటం జీవితం.. భయపడకపోవటం ధ్యాన జీవితం. భయం లోలోతుల్లోకి వెళ్లి, ఆ భయం రుచిని పూర్తిగా ఆస్వాదిస్తేనే ‘అభయం’ వొడి చేరుకోగలం. ఇలా మన ధ్యాన ముద్ర అభయముద్ర కావాలి.. మన జీవితం అభయ ధ్యానం కావాలి.
భరత్- అనువదించిన కాదు కానీ -తెనిగించిన ఈ పుస్తకాన్ని చదువుతూంటే ఓషో నిర్వచనాలు భరత్ పదాల్లో ఇట్టే వొరిగిపోవటం మనం చూడొచ్చు.
-లయంలోని కేంద్రం అన్నివైపులకు ఒకే మార్గంలో ఉంటుంది.
-ప్రతీక్షణం జీవితకాలాన్ని పోగొట్టుకుంటూ వెళ్లిపోతున్నది మీరే.
- బతికున్నంతవరకు కాలం వెళ్లిపోతున్నట్లుగా భావించే మనిషి మరణిస్తున్నపుడు తాను వెళ్లిపోతున్నట్లుగా భావిస్తాడు.
-ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి, ఒక్క రూపం నుంచి మరొక రూపంలోకి ఒక్కసారిగా ఎగిరి దూకడమే మరణమంటే.
-్భయం ఒక చెట్టులాంటిది.. ఆ చెట్టు పేరే మృత్యువు.
మరొక్కమాట-
అవును, ఆధ్యాత్మిక రహస్యాలను, తాత్విక విశే్లషణలను, ఆత్మ దర్శనాలను తనలో పొదువుకుని జననం నుండి మరణం దాకా సాగే జీవితం ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా మర్మమే!
అవును, ‘‘మనకే తెలీని మన రహస్యాలు’’ ఇలా ఎన్నో, ఎనె్నన్నో!
సృష్టి పరిణమిస్తున్నట్లే, మనిషి పరిణమిస్తున్నట్లే.. మర్మమూ పరిణమిస్తుంటుంది, మృత్యువూ పరిణమిస్తుంటుంది. అందుకే, మృత్యువుకే మృత్యువుకావటం అంటే పరిణామానికే పరిణామం కావటం.
అలాగే, చదువుకుంటూ పోవటం కూడా పరిణామమే! పరిణామ రస్యమే! అయితే, పుస్తకాలు చదివితే సరిపోదు.. వాటిల్లోని మర్మాలను చదవగలగాలి. దానికి, కావలసిన ‘్ధర్యాన్ని’చ్చే తాత్వికులలో ఓషో ధైర్యంగానే ముందువరసలో చేరతాడు.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946