పఠనీయం

అమూల్యమీ ‘ఎదురీత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదురీత
రచయిత:డా అరపిరాల నారాయణరావు
ఆంధ్రకేసరియువజన సమితి, రాజమహేంద్రవరం
128 పుటలు, ప్రతులకు:9985001541, 9849712849.
----------------------------------------------------------------------------------------------------------------------------
సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఈ పుస్తకం నా దగ్గరున్నా రకరకాల కారణాలతో చదవలేకపోయాను. చదివిన తర్వాత తెలిసింది డా.అరిపిరాల నారాయణరావు రాసిన 128 పుటల ‘ఎదురీత’ మన ముందు కందుకూరి వీరేశలింగం జీవిత కృషిని ‘అద్దమందు కొండలా’ నిలిపిందని! కొన్ని పుస్తకాలు గాంభీర్యం ఎక్కువయి పాఠకులను దగ్గరికి చేర్చుకోలేవు. మరికొన్ని పాండితీభారం పెరిగి దూరమవుతాయి. ప్రస్తుతం పుస్తకం పిల్లలకు రాశారా అనేంత సరళంగా ఉంది. కందుకూరి వీరేశలింగం జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు కుదించి, సరళంగా అలవోకగా చెప్పారు ఇందులో. అలాగే పరిశోధక గ్రంథం స్థాయిలో కొటేషన్లు, ఆధారాలు, ఫొటోలు పొందుపరిచారు.
యోచన, జీవనరేఖలు, బాల్యం, వ్యక్తిత్వం, భావజాలం, రాజ్యలక్ష్మమ్మ, పునర్వివాహాలు, వివేకవర్థని, పురమందిర నిర్మాణం, ఆనందోద్యానవనం, హితకారిణీ సమాజము, పాఠశాల వ్యవస్థాపన, సాహిత్యం, అవసానదశ, తెలుగు పదాలకు ఆంగ్ల పదాలు, నాలుగు అనుబంధాలు- ఇన్ని కలిసి 128 పుటల్లో ఇమిడిపోయాయి.
కందుకూరి వీరేశలింగం ఆత్మకథా స్వీయ చరిత్ర మూడు, నాలుగు దశాబ్దాలలో చలామణిలో వున్నది కుదించిన రూపం. నిజానికి పూర్తి రూపం నిడివి 720 పేజీలు. ఆరు దశాబ్దలుగా ఈ గ్రంథం పునర్ముద్రణ కాలేదు. దానిని ఇటీవల మంచి ఛాయాచిత్రాలతో తెలుగులోకి తెచ్చారు. శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు గారి సహకారంతోరచయిత నారాయణరావు స్వీయ చరిత్రం పూర్తి రూపం సంబంధించి మంచి అధారిటీ గల నారాయణరావు సరళంగా వీరేశలింగం ఏమిటో తేటతెల్లం చేశారు. ఈ పుస్తకం చాలా ఆసక్తికరంగా చదివిస్తుంది. ఇవి చూడండి:
-బ్రతికుండగానే తాను ఏర్పరచినసంస్థలలో కనీసం సభ్యత్వం కూడా నిలుపుకోని త్యాగశీలి కందుకూరి. - తన సంస్థలలో అన్ని కులాలవారికి అవకాశం కల్పించారు. తను ఏర్పరచిన ట్రస్టునుండి తను డబ్బు అప్పుగా తీసుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.
-తన జీర్ణవ్యవస్థ దెబ్బతినడానికికారణం తల్లి అమాయకత్వం కారణమని చెప్పారు.
- చిన్నప్పుడు చీట్లపేకాట అలవాటు ఉండేది. ఓ రోజు వేరే చోటుకు తీసుకెళ్లాడు మిత్రుడు. మొదటిరోజు ముదుసలి ఆడగా, రెండో రోజు ఒక సొగసరి ప్రౌఢ ఆడటం ప్రారంభించింది. ఇది నచ్చని వీరేశలింగం పేకాటను పూర్తిగా మానివేశారు.
-తనకున్న అసాధారణ జ్ఞాపకశక్తి కారణంగా బద్ధకం పెరిగిందని వీరేశలింగం భావించారు. దానికితోడు మొండి పట్టుదల.
- వాగ్రూపములైన ఉపన్యాసములు తన లిఖిత ఉపన్యాసాలంతటి శక్తివంతం కాదని భావించారు. పెద్ద గొంతుక కాదు, అభినయ సామర్థ్యం కాదు, వినువారి వంక చూడక తలవంచుకుని తనధోరణిలో చెప్పుకుపోవడం- వక్తకుండవలసిన లక్షణాలుకావని ఆయన రాసుకున్నారు.
-1881 సం. జనాభా లెక్కల ప్రకారం పాతికేళ్ళ వితంతులు 12 లక్షలు; పదిహేనేళ్ళలోపువాళ్లు లక్షా డెబ్బయినాలుగు వేలు. నాటి జనాభాలో హిందువులు 17 కోట్లు.
వీరేశలింగం రచన జాబితా, వారి రచనలలోని సామెతలు, వీరేశలింగం ముద్రించిన తాళపత్ర గ్రంథాల వివరాలు ఇలా చాలా పొందుపరిచారు రచయిత ఈఅరపిరాల తన ఈ ‘ఎదురీత’ గ్రంథంలో.

-నాగసూరి వేణుగోపాల్ 944073233