పఠనీయం

సంవిధానంలోనే సాహితీ సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక నివాళి
రెండవ భాగం- రచయిత: సింగంపల్లి అశోక్‌కుమార్, పుటలు:120, వెల:రూ.100/-, ప్రతులకు:‘ఆలోచన’, 305, ప్రగతి టవర్స్, వీరయ్య వీధి, విజయవాడ - 520004.
=======================================================
చదవాలి, చదివినది పదిమందికీ చెప్పాలి, రాయాలి; రాసింది లక్ష్యాన్ని చేరాలి అనే సదాశయంతో సారస్వత కృషి చేసేవాళ్ళు సమాజానికి సదా, సర్వథా అవసరం. అలాంటివాళ్ళల్లో సంప్రాదయవాద కవులూ ఉన్నారు, వామపక్షవాదులూ ఉన్నారు. ఎవరు ఏది రాసినా అందులో సమాచారంతోపాటు సముదాత్త శిల్పమూ ఉంటే సాహిత్యలోకం సంతోషిస్తుంది. ఇలాంటి సంతోషం కలిగించే ‘రీతి’లోనే శ్రీ సింగంపల్లి అశోక్‌కుమార్ వచన రచనా శిల్పపు సౌరుతో తన ‘అశోక నివాళి - రెండవ భాగం’ పాఠకులకు అందించారు.
ఇందులో రాంభట్ల కృష్ణమూర్తి, దాశరథి, పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, సినారె మొదలైన వందమంది సాహితీ సమరాంగణ సమర్థ, అతిరథ, మహారథుల జీవిత వివరాలను, సాహిత్య గ్రంథ రచనా విశిష్టతలను, సంక్షిప్తంగానే అయినా, చక్కని శైలిలో అందించాడు రచయిత.
ఆయా రచయితలు సాందర్భికంగా అన్న మాటలను కూడా చాలాచోట్ల పొందుపరచటం విశేషం. ఉదాహరణకు రాంభట్ల కృష్ణమూర్తిగారు ‘‘శంకరుని అద్వైతం నన్ను హేతువాదిగా చేస్తే, తాంత్రిక వేదాంతం నన్ను భౌతికవాదిని చేసింది’’ అన్నారట. కృష్ణమూర్తిగారు అన్న ఈ రెండు వాక్యాలూ ఎంతో ఆలోచనాత్మకంగా ఉండి, ఒక అద్భుత సామాజిక, మానవతావాద, తాత్త్విక జిజ్ఞాసను రేకెత్తిస్తాయి ఎవరికైనా.
అలాగే పెద్ద్భిట్ల సుబ్బరామయ్యగారు అంటూ ఉండే ‘మంచి పుస్తకం కరెన్సీ నోటులాంటిది. అది చెలామణి అయిపోతూ ఉండాలే గానీ ఎవరిదగ్గారా నిలచిపోగూడదు’- రవ్వల లాంటి ఇలాంటి సూక్తులు ఇందులో చాలాచోట్ల ఆయా రచయితల దృక్పథాలను బట్టి తళుక్కుమంటుంటాయి. ఇది అభినందనీయం.
‘‘తాను చదివిన మంచి పుస్తకలను- ఒక్క ప్రతి గూడా ఉంచుకోకుండా - (అవసరమైనప్పుడు అందరి చుట్టూ తిరిగే అవస్థ వేరే ఉన్నా) తన పుస్తకాలను పంచి, పదిమంది చేతా చదివిస్తూ ఉండే గొప్ప సాహిత్య ప్రచారకుడు పెద్ద్భిట్ల’’(95వ పుట) వంటి వాక్యపు పేరాగ్రాఫ్ సుబ్బరామయ్యగారి ఉదాత్త వ్యక్తిత్వానికి మణిదర్పణం, నిలువెత్తు నీరాజనం సింగంపల్లి వారి కలం ద్వారా.
శ్రీ అశోక్ కుమర్ వచన రచన రమ్యతకు 11వ పుటలో రాంభట్ల కృష్ణమూర్తిగారి గేయాలు ‘‘ఆయన చైతన్య అంగారానికి, సాహిత్యపు బంగారానికి మచ్చుతునకలు, అచ్చుతునకలు, ప్రజల మెచ్చుతునకలు’’ అన్న పంక్తులు మెచ్చదగిన మచ్చులు- భాష, భావముల రెంటి దృష్ట్యా కూడా. ఇక్కడ అంగారము అంటే వున్న అరుణిమ, ఒక ఔషధి అనే రెండు అర్థాలూ పూర్వపదమైన ‘చైతన్యా’నికి సమాసోత్తర పద సముచితంగా, అర్థవంతంగా, సమర్థనీయంగా సమన్వయిస్తాయి. విషయ సూచికలోని రచయితల గురించే కాకుండా, పాదసూచికలు అనే శీర్షిక కింద సి.ఆర్.రెడ్డి, ముళ్ళపూడి వెంకటరమణ, ఆర్.ఎస్.సుదర్శనం, గుంటూరి శేషేంద్ర శర్మ మొదలైన వారి గురించి కూడా క్లుప్తంగా రాశాడు రచయిత.
రచయిత రాతలో తమాషా ఒకటి చెప్పాలి. ‘శ్మశానాల నిఘంటువులు దాటి’ అంటూ వివాదాస్పదపు అభిప్రాయి అయిన శ్రీశ్రీ యొక్క భావజాలపు అడుగుజాడల్లో నడిచే అశోక్‌కుమార్ విశ విషాణం (కుందేటి కొమ్ము అనటానికి), సాహితీ భిషక్ (సాహిత్య వైద్యుడు), అనిగీతం(పోరాటపు పాట), అక్షర శరధి (అక్షరాల పొది), విస్ఫులింగం (నిప్పుకణిక)-ఇలా అంటూ రచయితల పేర్ల కింద సగటు పాఠకుడికి అర్థంకాని, అంతుపట్టని అలాంటి తళుకులు (లేబుల్స్) అంటించడం ఒక భాషా తౌల్యపు తమాషా కాదా? అది?
ఏది ఏమైనా మొత్తంమీద పుస్తకంలోని సమాచారం, అందించిన విధానం రెండూను బాగున్నాయి.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290