పఠనీయం

ఇది నిన్నటి సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిపడని సంగతులు - నాటకం
రచయిత కీ.శే. బళ్ళారిరాఘవ పుటలు: 86,వెల: రూ50/-లు,
ప్రచురణ :ప్రజాశక్తి బుక్ హౌస్ విజయవాడ, ప్రతులకు: ప్రజాశక్తిబుక్‌హౌస్ కార్ల్ మార్క్స్‌రోడ్,గవర్నర్ పేట, విజయవాడ -2
=================================================================
గతశతాబ్దిలో జరిగిన వితంతు వివాహ సంస్కరణ అప్పట్లో చాలాముఖ్యమైనది. ఆ సంస్కరణ ప్రధాన వృత్తాంతంగా బళ్ళారి రాఘవ రాసిందీను, ఆరోజుల్లో నటనకు - నాటక వృత్తాంతానికి ఒక గీటు రాయిగా పేరు తెచ్చుకున్న నాటకంగాను ‘సరిపడని సంగతులు’ ఒక ప్రముఖ దృశ్యకావ్యం. ‘కన్యాశుల్కం’, ‘వరవిక్రయం’ నాటకాల తర్వాత ఆ కోవలో మూడవస్థానంలో ‘సరిపడని సంగతులు’ ఎక్కువ ప్రచారం పొందింది. అని నాటక రంగ చరిత్ర చెప్తోంది.
తన ఇంటిపేరు, ఊరు రెండూనూ తాడిపత్రి. అయినా, రాఘవ బళ్ళారిలోనే తన జీవితమంతా గడిపాడు. కనుక ‘బళ్ళారి రాఘవ’ గానే సుప్రసిద్దుడు. అంతే కాదు గొప్ప నటుడు, రచయిత, ప్రయోక్త, ఖండాంతర యశస్వీమ.
రాఘవ రాసిన ఈ సరిపడని సంగతులు నాటకం నూటికి నూరుపాళ్లు ఉత్కంఠ భరితంగానే సాగిపోతుంది. మొత్తం మూడు అంకాల నాటకం. ఉత్తమ నాటక లక్షణాలలో ఒకటైన ‘కథాగతి’ అంకం, అంకానికి, అందులోని రంగం రంగానికి రసారోహణ క్రమంలో గ్రాఫిక్‌గా పురోగమిస్తుండాలి.’అనేది ఈ నాటకంలో కనిపిస్తుంది. భాష సరళ గ్రాంథికంలో ఉండడం వల్ల దాదాపు అందరికీ ఆస్వాదయోగ్యంగానే ఉంటుంది. ఒక అమ్మాయి ఒక వృద్ధునునికి బాల్య వివాహితై కొద్ది రోజుల్లోనే బాల వితంతువు అవుతుంది. మేనమామ ఇంట్లో పెరగుతుంటుంది. తనకు వయస్సు వచ్చినాక మేనమామ యొక్క కొడుకును ప్రేమిస్తుంది. గర్భవతి కూడా అవుతుంది. ఆమెకు బాల్యంలో జరగాల్సిన భర్తృ వివాహానంతర కేశ ఖండనాన్ని ఎలాగో ఆ ఊరి ఆచార్యుల వారికి కొంత లంచమిచ్చి తప్పిస్తాడు ఆమె మేనమామ. కానీ వితంతువుగా ఉంటూ ఆమె గర్భం దాల్చిన విషయం బయటకు పొక్కితే ఏమవుతుందో నని ఆందోళన చెందుతాడు. గర్భం తీయించేసుకోమని ఆమెపై ఒత్తిడి చేస్తాడు. పేగు తీపిని, బంధాన్ని తెంచుకోలేక ఆమె ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. మేన మామ వద్ద పని చేసే గుమాస్తా ఆమెను కాపాడి తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు. ఆ తరువాత కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరకు ఆమెకు తాను ప్రేమించిన మేనమామ కొడుకుతోనే మనువు జరుగుతుంది. అదీను మేనమామ మనపూర్వక అంగీకారంతోనే.
సంభాషణల్లో భగవద్గీతా శ్లోకాలు, భిన్న భిన్న ధర్మశాస్త్ర క్రోఢీకరణలు, సంప్రదాయ కుటుంబాల్లో తరచుగా వినిపిస్తుండే లోకోక్తులూ అవీ ఏ ప్రాతకు ఆ ప్రాతకు సజీవత నిస్తాయి. దాదాపు ఇందులో ప్రధాన రసం కరుణయే అని చెప్పాలి. ‘‘లోకులు ఎవ్వరూ నన్ను దగ్గరకు రానివ్వరంటున్నావు. చివరకు నీవు కూడా నన్ను దగ్గరకు రానివ్వవా మామయ్య ? వంటి దీన వాక్కులు , తల్లికి తన గర్భస్థ భ్రూణం మీద ఉండే పెరుగుతుండే పేగు తీపి, ఆత్మీయతా బంధ సాంద్రతల గురించిన స్ర్తి సహజ సంభాషణలు రసార్ద్రతకు కాణాచులు.
48 పుటలోని ‘ప్రేమ కామము కాదు, మోహము కాదు, స్వార్థము కాదు, అది చీకటిని వెనె్నలగా చేయును, పేదను పెద్దనుగా చేయును’ అంటూ శ్రీధర శాస్ర్తీ పాత్ర నోట అనిపించిన మాటలు రాఘవ లోని భావ కవిని బయటకు చూపిస్తాయి. ఆరోజుల్లో కొందరు మతాచార్యులు కూడా కొన్ని ఊళ్లల్లో ఎంత ధన వ్యామోహులో కూడా తెలుస్తుంది. అందులోని ఒకటి రెండు పాత్రల ద్వారా.
కానీ తాను బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణులను కించపరిచే, హేళన చేసే కొన్ని సంభాషణలు కూడా రాఘవ ఈ నాటకం లో రాయడం వల్లనూ, వితంతు వివాహం నేడు సర్వ సాధారణం, చట్టబద్ధమూ కావటం వల్లనూ ఈ నాటకం ఇపుడు ప్రదర్శనా అవసరాన్ని కోల్పోయింది. కులద్వేషం, ఒకసామాజిక వర్గాన్ని కించపరచటం, వాళ్ల మనోభావాల్ని దెబ్బతీయటం ఇలాంటివి రేపాలను కుంటేనే ఈ నాటకం నేడు అవసరమేమో మరి!

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290