పఠనీయం

హంపీ దిద్దిన అక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంపీ దిద్దిన అక్షరాలు కవితా సంపుటి
రచన -శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
వెల:రూ.150/- ప్రతులకు: విద్యార్థి మిత్ర ప్రచురణలు, ఫ్రెండ్స్ బుక్ డిపో, 14-పార్క్ రో, మునిసిపల్ బిల్డింగ్, కర్నూలు
======================================================
శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశంగారు ప్రతిభ, వ్యుత్పన్నత అభ్యాసము త్రివేణీ సంగమంగా మేళవించిన రచయిత. లోగడ ఎన్నో వ్యాసాలు, సమీక్షలు వెలువరించి లబ్దప్రతిష్ఠితుడైనాడు. ఇప్పుడు తన రచనలను సంకలనాలుగా తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇతడు ఆధునికులలో ప్రాచీనుడు. ప్రాచీనులలో ఆధునికుడు. అటు సంప్రదాయ స్పృహ ఇటు వర్తమాన చైతన్యం రెండూ కలవాడు. వృత్తము స్వేచ్ఛా కవిత్వమూ రెండూ వ్రాయగల సవ్యసాచి. అటు కాళిదాసును ఇటు కీట్సును తులనాత్మకంగా అధ్యయనం చేసి ఆవిష్కరించిన వాడు.
హంపీ దిద్దిన అక్షరాలు అనే సంకలనంలో వస్తు వైవిధ్యం ఉన్నదే కాని వైరుధ్యం లేదు. హంపిని చూచి లోగడ కొడాలివారు ‘శిలలు ద్రవించి ఏడ్చినవి’ అని కవితలు వ్రాసినట్టే ఈ కవి హంపీ శిల్పాలకు అక్షరాంజలి సమర్పించాడు. ఈయనను పీఠికలో రామడుగు వెంకటేశ్వరశర్మ గారు చైతన్య చకచ్చకిత కళాక్షరమూర్తి అంటూ ప్రశంసించారు.
ఈ సంకలనంలో ఖడ్గములపై ఒక విశేష రచన ఉంది. ఇది శైవ సంప్రదాయమునకు చెందినది. వీరభద్రపళ్లెమును పట్టే ఉత్సవ సందర్భంలో ఈ ఖడ్గమాలను పాడుతారు. ఇవి వీరరస ప్రధానమైనవి.
ఈ సంకలనంలో పార్వతీశం కొన్ని ప్రయోగాలు చేశారు. వామన కవితలు పుష్కలంగా వస్తున్న రోజులలో ఈ రచయిత సూక్ష్మ కవితలకు శ్రీకారం చుట్టారు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఏకపాద కవితకు బదులు ఏక పద కవిత ప్రారంభించారు. తల్లిదండ్రులు స్పీడ్ బ్రేకర్స్ అన్నాడు. ఇందులో కొంచెం కారమువలె కొంచెం చమత్కారము ఉంది.
అట్లే ‘‘మధుమాస కామినీ మాంగల్య సంభార / సంశోభనీ కృతిన్ సాగుగాక! / గ్రీష్మఖానూష్మల క్రీడా నిరాసక / గంధంబు నీకృతిన్ గలుగుగాక / వర్ష దభ్రద్భ్రమ ప్రౌఢ విద్యుల్లతా/ కాంతయే నీ కృతిన్ కలయుగాక / శారద చంద్రికా సాంద్ర సమాహ్లాద / సౌఖ్యంబు నీ కృతిన్ సాగుగాక (133వ పుట)-
ఇలా ఋతు సౌఖ్యం వరుసగా అక్షరాకాంక్షలో వర్ణింపబడింది. ఇది పార్వతీశంగారికి కూడా వర్తిస్తుంది.
‘‘నగరం దిన దిన గండాల సంకీర్ణ సాగరం /వ్యాకులాతా సంకీర్ణ వాయుగుండాలతో సామాన్యుని జీవతం అతలాకుతలం’’ (259 పుట) అంటూ సామాజిక స్పృహను ప్రదర్శించారు.
ఒకప్పుడు సప్త సుప్త స్వరాలను పలికించిన హంపిలో నేడు ‘‘అకట! యుద్భట భటకోటి యచట లేదు / చెదల పురుగులును జెముడు పొదలె గాని / కవిత కట పెళ్లిపందిళ్లు కానలేము / రాళ్ల క్రిందను దాగిన త్రేళ్లు తప్ప’’ (46వ పుట) అంటూ ఆనాటి హంపీ వైభవాన్ని వర్తమాన దుస్థితిని కవి స్మరించి కన్నీరు పెట్టుకున్నారు.
శ్రీ పార్వతీశంగారు పేరడీలు వ్రాయటంలో ఘనాపాటి. ప్రాచీనుల పద్యలనేకములకు ఆనాటి జరుక్ శాస్ర్తీ వలె వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కవితలల్లారు. ఇంతటి బహుముఖీన ప్రజ్ఞ గల ఈ కవి నుండి వస్తు ప్రధానమైన ఏక ప్రబంధం ఆచంద్రార్కంగా నిలిచేది ఆశించటం సబబుగానే ఉంది. ఎడారిలో ఒయాసిస్సులా ఈ హంపీ దిద్దిన అక్షరాలు తళుక్కున మెరిసి జీవధారయై పారింది.

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్