పఠనీయం

నయాగరా అందాలకు అక్షరస్తుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయాగరా నాట్య జలపాతం
నా అమెరికా సందర్శనా కావ్యం
ధర: అమూల్యం ప్రతులకు పి.వి. మూర్తి రాజు 9949125796
================================================
చూడడానికి సాదా సీదా, అంటే పొడి పొడి మాటలతో వున్నా, భాషపైన వున్న పట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ఈ కవిరాజు వెలిబుచ్చిన అంత్యప్రాస భూయిష్టమైన వాక్యాలు చాలు ఈతని భాషాశైలి ఎటువంటిదో చెప్పడానికి.
‘‘నయాగరా, వచ్చినాను నీ సన్నిధి-
నువ్వే యిక నా పెన్నిధి
చెబుతున్నాను నా మనసులో దాగున్నది
నా వయసుకు డెబ్భైమూడు మొన్న
నా మనసుకు ఇరవైమూడు నిన్న
ఇంకా నీ తలపులలోనే ఉన్నా’’..
అనే పలుకులను బట్టి కవి ఎంతటి దృఢచిత్తుడో, ఊహాలోక సంచారపరుడో, ఎంతటి తృప్త జీవియో తెలుస్తున్నది. నైరాశ్యం, అసంతృప్తి, ఆవేదన ఈ కవి జోలికి రమ్మన్నా రావు. రావు అనడం కన్నా రావడానికి వాటికి చచ్చే భయం అంటే సమంజసమేమో? అక్కడక్కడ శీర్షికలలో ఉదాహరణకు ‘అపుడెపుడో నా చిన్నపుడు’ లాంటి వాటిల్లో ‘గూనపెంకుల పాతబడిలో అత్తెసరు మార్కులతో తొమ్మిది పాసైనపుడు’ అనే పంక్తులు చదువుతున్నపుడు మహాకవి ధూర్జటి తిన్నడి బాల్యాన్ని వర్ణిస్తూ చెప్పిన ‘అవ్యక్తమధురకల్యంబైన బాల్యంబు’ అనే వాక్యం ఎంత నిజమో గదా అని అనిపిస్తుంది. అలాగే ‘నా కవితల చందనలిపి’, ‘నా శుభాకాంక్ష కవితా సుమతోరణం’లాంటి శీర్షికలలో కవి వెలిబుచ్చిన అభిప్రాయాలూ, పదప్రయోగాలూ ఆపాత మధురాలూ, ఆహ్లాదభరితాలు
. ‘నా అమెరిక సోదర సోదరీమణులారా! మీ మనసున, హిమబిందువునై, మీ సాహితిబంధువునై, అన్ని మతములు మెచ్చు హిందువునై, కవితా సంద్రాన చిరుబిందువునై, మీ ముందు నిలిచిన నేనెవర్ని?’.. అంటూ పూర్ణబింబము నడిమి ‘పుట్టుమచ్చ’ను నేను, చైత్ర మాసావిర్భావ సమయాన.. పుడమి కన్నియ దాల్చు ‘ఆకుపచ్చను’ నేను.. అని అనడం ఒక్క మూర్తిరాజుకే చెల్లింది. ‘అన్ని మతములు మెచ్చు హిందువునై’.. అని అప్రయత్నంగా మూర్తిరాజన్నాడని నేననుకోను.
ఈ మాటలు అనాలంటే ఉత్తమ సంస్కారంతోపాటు, చిక్కని గుండె ధైర్యం కూడా గావాలి. బోలెడంత జాతీయభిమానం ఉండాలి. అన్నింటినీ మించి అచ్చమైన స్వచ్ఛమైన ఆవేశం ఉండాలి. అది ఓరుగల్లు ఖిల్లాలో జీవ లక్షణం. మూర్తిరాజు కలంలో, గళంలో దాగివున్న విలక్షణం. ‘నీ నడకల నాట్యం’ ‘మది గోడల వెలసినావు’ ‘నీ చెక్కుటద్దాలు మెరియ’ మొదలైన ఎన్నో శీర్షికలు లలితా కళా బంధురాలు. భావం, భాష అన్నీ మనల్ని కదిలించి నాట్యం చేయిస్తాయి. మూర్తిరాజుగారి ఈ ‘నయాగరా నాట్య జలపాతం’ కావ్యంలో అష్టవిధ నాయికలూ, వాళ్ళ అందచందాలూ, హావభావాలూ అన్నీ ఒక దృశ్య చిత్రంగా మనకళ్ళముందు కనబడతాయి. దానికి తగ్గట్టు వారు ప్రత్యేక శ్రద్ధతో ముద్రింపించిన నాట్యకత్తెల భంగిమలు, ఈ కావ్యానికి మరింత సొగసును కూర్చిపెట్టాయి. అలాగే ‘చేతులెత్తిన చెల్లె’.. గజేంద్ర మోక్షము.. ఒకనాటి నడిరాత్రి.. మల్లెపూవుల జల్లులట్లు.. మా భారతగంగా ప్రవాహమట్టు మొదలైన శీర్షికలు ప్రతి కళాహృదయుడూ చదివితీరాల్సిందే గజేంద్ర మోక్షము, శివతాండవమాడునపుడు మొదలైన పౌరాణిక ఇతివృత్తాలను తనదైనశైలితో చిత్రించిన ఈ మూర్తిరాజు నిజంగా అభినందనీయుడు. ఇలా ప్రతి శీర్షికలోని అంతస్సౌందర్యాలూ, అలరుతావులూ నేను విడమరచి చెప్పేకంటే, పాఠకులే చదివితే చాలా ఆనందిస్తారు. చక్కని కవితా ప్రతిభా సంపన్నుడైన మూర్తిరాజు గారి కలం నుండి మరన్ని భావ పరీమళాలు వెదజల్లే కావ్య కుసుమాలు రావాలని ఆశిస్తున్నాను. ఈ కవిగారి పూర్తి పేరు ‘ప్రతికంఠం వామన మూర్తిరాజు’ (్భట్ట రాజు) వీరి కవితలను ప్రతికంఠం ఆలపించాలని ఆశిస్తున్నాను. ప్రతికంఠం ‘కవి వామనుడూ’ కవితా త్రివిక్రముడై విజృంభించాలని అభిలషిస్తున్నాను. ఇంత మంచి ‘ముద్దమందారం’లాంటి కావ్యాన్ని మన తెలుగు ప్రజానీకానికి అందిస్తున్న కవిమూర్ధన్యుడు మూర్తిరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా పద్యసుమమాలను వారి ప్రతిభకు అందిస్తున్నాను.
సీ సౌందర్య వర్ణనాచాతుర్య నిధి నీవు- పుడమి నిక్కంబిద్ది మూర్తిరాజ!
జలపాతములకహో కలహంసనడలెన్నొ- పొల్పునేర్పితివీవు మూర్తిరాజ!
మంజుకైతలునీవి మల్లెల గంధాలు -
ముమ్మాటికి నిజము మూర్తిరాజ!
పరిణతింగన్నవాక్కున్న భావుకుడవు
జగతిమెచ్చిన సద్గుణ సంయుతుడవు
వాణిమెచ్చిన మా కాత్మబందుగుడవు
కీర్తి ధనమన నీదెరా! మూర్తిరాజ!
వరకవీంద్రుని నిన్ను వామనుడని పల్క
బుద్ధిహీనత న మూర్తిరాజ

కం ‘ప్రతికంఠ’ వంశవార్థిని
స్తుతులను గొనుచున్న నిందు సోముడవయ్యా
మతివాచస్పతి, కవిసఖ!
సతిశారద ప్రొచుగాక సత్కవి నిన్నున్!

సంపూర్ణం

- డా. అక్కిరాజు సుందర రామకృష్ణ, 9885020205