పఠనీయం

ఆలోచింప చేసే ‘వ్యాసపీఠం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వ్యాసపీఠం (చారిత్రక చలన చిత్ర వ్యాస సంపుటి)
రచన: దేశిరాజు లక్ష్మీ నరసింహారావు
వెల:450/-
ప్రతులకు: రచయిత, 5-1-302, వీధి 10, కొత్త మారుతీనగర్ (వెస్ట్), దిల్‌సుక్‌నగర్, హైదరాబాద్.
=========================================================
కనౌజ్ (కన్యాకుబ్జ)బారీ వంటి నగరాలు నేలమట్టమైనాయి. తన దండయాత్రలకు అనుగుణంగా గజనీ అనేక భూమార్గాలను (రోడ్లు) నిర్మించాడు. ఆ కాలంలో మాల్వా, ధారా (్భజరాజు) వంటి పాలన, భౌగోళిక సామాజిక పరిస్థితులు అల్ బరూనీ చక్కగా వివరించాడు.
‘‘తండ్రి చేసిన అప్పులను కొడుకు తీర్చాలి. తండ్రి ఆస్థిలో కూతురుకు నాల్గవభాగం సంక్రమించేది’’ అని ఆనాటి సాంఘిక సామాజిక నీతులు చాలా అల్ బరూనీ వర్ణించాడు.
అలాగే ఇబ్నెబతూతా (1304-78) భారతదేశంలో పర్యటించిన యాత్రా విశేషాలు చాలా ముఖ్యమైనవి. వీటిని సంగ్రహంగా దేశిరాజు వారు ఒక చిన్న వ్యాసంలో వివరించారు. ఇది చదివినవారికి మూలగ్రంథం చదవాలనే ఆసక్తి కలగటం సహజం.
ఇతడు మహమ్మద్ బిన్ తుగ్గక్ (1342) కాలంలో ఢిల్లీలో కాజీగా ఉద్యోగింపబడ్డాడు.
దౌలతాబాదు ముత్యాల వ్యాపారానికి పెట్టింది పేరు. బెంగాల్ వారణాసిలలో వస్త్రాలు ఉత్పత్తిచేసేవారు. భూమార్గంకన్నా సముద్ర ప్రయాణం చాలా చౌక. దక్షిణ భారతదేశంలో తమలపాకులు పండించటం నమలటం ఎక్కువ. ఢిల్లీలో వస్తూత్పత్తి లేదు కాని అక్కడ మార్కెటింగ్ జరిగేది.
1413-75కు చెందిన అబ్దుల్ రజాక్ భారత్ పర్యటన సందర్భంగా విజయనగర సామ్రాజ్యాన్ని విస్తృతంగా వర్ణించాడు. ఇతడు విజయనగర రాజ్యానికి దూతగా పంపబడ్డాడు. దక్షిణ భారతంలో శాలికట్ పెద్ద ఓడరేవు. ఇక్కడ ముస్లింలు రెండు మసీదులు నిర్మించుకున్నారు. వ్యాపారానికి రక్షణ ఉండేది. ఇతడు వచ్చినపుడు, బెంగాల్ నుండి మలబారు వరకు శ్రీలంక నుండి గుల్బర్గా వరకు రెండవ దేవరాయల సామ్రాజ్యం విస్తరించి ఉంది. టెనాసిరమ్, పెగూ వంటి దూర దేశల రాజులుకూడా రెండవ దేవరాయలకు కప్పములు కట్టేవారు అని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు.
వీధుల్లో బంగారు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు. వీరికి భోజనం ఎంత ముఖ్యమో గులాబీలు అంతే ముఖ్యం. వ్యాపారం కోసం 300 రేవులు అభివృద్ధి చేశారు. ఇలా ఎన్నో విషయాలు అబ్దుల్ రజాక్ వర్ణించాడు.
దేశిరాజు లక్ష్మీ నరసింహారావు భారతీయల వాణిజ్యంపై పారిశ్రామిక విప్లవ ప్రభావం, భారత జాతీయ పునరుజ్జీవనంపై ఆర్య సమాజం పాత్ర వంటి పరిశీలనాత్మక వ్యాసాలు అందించారు.
భారతదేశంలో రైల్వేల అభివృద్ధి ఎలా జరిగింది? 1905లో బెంగాల్‌ను విభజించినపుడు తెలుగువారు ఎలా స్పందించారు? ఇలాంటి చారిత్రకాంశాలు నేటి తరం విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవలసి ఉంది. మన చరిత్రను అధ్యయనం చేయనివాడు చరిత్రహీనుడవుతాడు. అందుకే ప్రాచీన చరిత్ర గ్రంథాలను చదవాలి. కనీసం వాటిపైన వచ్చిన ఇలాంటి వ్యాసాలనైనా చదివి ఈ గ్రంథాన్ని పదిలపరచుకోవాలి.
ఇందులో బర్మా స్వేచ్ఛా పావురం అంగ్ జాన్ సూకీపై ఓ వ్యాసం ఉంది. అలాగే కారల్ మార్క్స్ శ్రీశ్రీల ప్రశంస కూడా ఉంది. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం పొందండి అంటూ రక్త విప్లవాన్ని ప్రోత్సహించిన అమానవీయ వ్యక్తిని ‘మహనీయుడు’ అని దేశిరాజు పొగడటం సమంజసమేనా??
ప్రజాస్వామ్య యుగంలో కూడా ఇంకా రెండు వందల నాటి కాలం చెల్లిన మార్క్సు సిద్ధాంతాలను నమ్మినవారిని సూడో సెక్యులరిస్టులు అంటారు. ఆ మాటకొస్తే రష్యాలో విజయం సాధించింది లెనిన్ ప్రతిపాదించిన జాతీయవాదం (రష్యన్ నేషనలిజం).
శ్రీశ్రీ తను చెప్పిన సిద్ధాంతాలను నిజ జీవితంలో తాను పాటించలేదు. ‘మహిళా సాధికారికత నాడు - నేడు అనే వ్యాసంలో భారతీయ ప్రాచీన సమాజంలోని అర్థనారీశ్వర భావన, స్ర్తి, దేవతారాధన వంటి అంశాలను రచయిత స్పృశించారు. ఇస్లాంలో అసలు స్ర్తి మూర్తులకు స్థానం లేదు. క్రైస్తవంలో మానవ జాతి పతనానికి కారణం ఉంది.
ఈ గ్రంథంలో సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి. అవి వ్రాయడానికి దేశిరాజు లక్ష్మీ నరసింహారావు వంటి పండితులే అక్కరలేదు. ఏ పుల్లయ్య అయినా వ్రాయగలడు. కాని తక్షశిలలో ఆనాటి విద్యా విధానం వంటివి దేశిరాజు వంటి వారే వ్రాయగలరు.
- ఇంకాఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్