పఠనీయం

ఈ తరం కోసం.. గేయ కవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ తరం కోసం.. గేయ కవిత!
పేజీలు:207, వెల:రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ మరియు నవచేతన బుక్‌హౌజ్ అన్ని బ్రాంచీలు, సెల్:9291530714
==============================================================
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు వల్లూరు శివప్రసాద్‌గారి ప్రధాన సంపాదకత్వంలో ‘ఈతరం కోసం.. గేయకవిత’! గ్రంథాన్ని వెలువరించారు.. పెనుగొండ లక్ష్మీనారాయణగారు గౌరవ సంపాదకులుగా, పాపినేని శివశంకర్‌గారు సంపాదకులుగా వ్యవహరించి రూపుదిద్దిన ఈ గ్రంథంలో 20, 21వ శతాబ్దాల్లో వచ్చిన కొన్ని గేయాలను ఏర్చి కూర్చి చోటు కల్పించారు. ప్రజల్ని తక్షణం ఆకట్టుకోవడానికి.. ఉద్యమ సందర్భంలో జన చైతన్యంకోసం.. సహజంగా గేయాలు పురుడు పోసుకుంటాయి! హదృయాలను కదిలించే శక్తి.. జనాన్ని ఆకర్షించే గొప్పదనం పాటలకుంటుంది కనుక అందరి నోళ్లలో నానుతూ ఉంటాయి!
20వ శతాబ్దం ఆరంభంలో ఆంగ్లేయుల వలసపాలనలో.. జన చైతన్యం కోసం.. మన దేశం గురించి తపన ప్రారంభమై.. జాతీయోద్యమంలో భాగంగా భారతజాతి ఐక్యతను చాటడానికి.. దేశభక్తిని ప్రబోధించడానికి గేయం ప్రక్రియను ఎన్నుకుని.. అనేకమంది కవులు తమ భావాలను ప్రకటించారు. సామాజిక రుగ్మతల నివారణకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు గేయం ఓ ఆయుధమైందని చెప్పవచ్చు.. విప్లవ కవిత్వోద్యమాల్లో వచన కవిత్వానికి ధీటుగా లెక్కలేనన్ని పాటలు కుప్పలు తెప్పలుగా వెలువడినాయి!
రచనల ద్వారా వర్తమానంనుండి భవిష్యత్తులోకి పయనించే సత్తా కవులకే వుంటుంది. కనుక వర్తమాన సమస్యలను ప్రతిబింబిస్తూ.. అభిలషణీయమైన ఉద్దేశ్యాన్ని ప్రబోధిస్తూ. పరిష్కార మార్గాన్ని సూచిస్తూ అనేకమంది కవులు పాటలు రాశారు. మాటకు లేనిశక్తి పాటకు ఉందని నిరూపించారు.
జనంలోకి సులభంగా ఇట్టే చొచ్చుకుపోయే ఓ సుగుణం పాటకు ఉంది కనుకనే పాట ద్వారానే జన చైతన్యానికి అనేకమంది కవులు కృషిచేశారు. చాలామంది కవులు, స్థానిక, ప్రాంతీయ, దేశీయ సమస్యలను ప్రతిబింబిస్తూ జనంలో ఓ సంకల్పబలాన్ని నింపుతూ ఉద్యమాలకు ఊపిరిపోసే యుక్తిని పాట ద్వారానే ప్రదర్శించారు. ఈ గ్రంథంలో 1909లో మంగిపూడి వెంకటశర్మ రాసిన పాట ఉంది. 1912లో గురజాడ అప్పారావు రాసిన గేయం ఉంది. 1916లో రాయప్రోలు సుబ్బారావు ‘జన్మభూమి’ శీర్షిక ద్వారా ప్రకటించిన పాట కూడా వుండడం విశేషం!
స్వరాజ్య గీతాల్లో భాగంగా 1921లో ‘‘మాకొద్దీ తెల్లదొరతనము’’ అంటూ గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన గీతంలో మా ప్రాణాలపై పొంచి- మానాలు హరించే తెల్లదొరల పాలన వద్దని గర్జించారు. 1973లో ‘నమో హిందుమాతా!’ అంటూ వడ్డాది సీతారామాంజనేయులు రాసిన గేయంలో భారతమాత భాగ్యాన్ని అద్భుతంగా అక్షరబద్దం చేశారు.
హిమాద్రి మొదలు కన్యాకుమారి వరకు హిందుస్థానం ‘మాదేశం’ అంటూ 1973లో వానమామలై వరదాచార్యులవారు రాస్తే.. తక్కెళ్ల జగ్గడి ధర్మతత్త్వాలను ఉన్నవ లక్ష్మీనారాయణ తమ గేయం ద్వారా 1922లోనే తెలియజెప్పారు.
1925లో నండూరి వెంకట సుబ్బారావు రాసిన ‘కలత నిదర’ పాటలో ప్రకటించిన భావాలు రమణీయంగా ఉన్నాయి.
తెలుగు బాలుండ యింపు నింపుము / తెలుగు బాలుండ పేరు పెంపుము- అంటూ 1930లో ‘వీరగంధం’ శీర్షికతో త్రిపురనేని రామస్వామి రాసిన పాట అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.
పాఠకులకు గిలిగింతలు పెట్టేలా 1934లో బసవరాజు అప్పారావు రాసిన పాట ఉండటం విశేషం! పువ్వులలో నా యవ్వనమంతా పొదిపి పెట్టినానోయ్ బావా! పదవోయ్ పవళింతాం బావా! అంటూ ముగించడం బాగుంది.
పెండ్యాల లోకనాథం ‘కూలిపాట’ శీర్షికతో రాసిన పాటను కూలీలందరు ఏకమైతే.. కూడికి తరుగేమిరా! అంటూ ఉత్తేజవంతంగా ఎత్తుకున్నారు.
దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారి జయ జయ జయ ప్రియభారత / జనయిత్రీ దివ్యధాత్రి అంటూ రాసినపాటలోని ప్రతి చరణం దేశభక్తిని ప్రబోధించేలా కొలువుదీరింది..
1938లో తెలుగు తల్లీ! నీకు జోహారు దేశమాతా! నీకు జోహారు అంటూ తుమ్మల సీతారామమూర్తి తెలుగుతల్లి పాటను అపుడు రాశారు.
- ఇంకాఉంది

-దాస్యం సేనాధిపతి 9440525544