రాష్ట్రీయం

‘పేటెంట్’ మంజూరులో జాప్యం నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 28: దేశంలో అర్హులైన వారికి పేటెంట్ హక్కుల మంజూరులో చాలా జాప్యం జరుగుతోందని, ఇకపై జాప్యానికి ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర శాస్తస్రాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సుజనాచౌదరి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ జెఎన్‌టియులో సోమవారం విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు. పీజీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడారు. విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు విద్యార్థులు, పరిశోధకులు ప్రపంచానికి మేలు చేకూర్చే అనేక పరిశోధనలు నిర్వహిస్తూ, వినూత్న ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తుండటం హర్షణీయమన్నారు. అయితే అటువంటి వారికి సకాలంలో పేటెంట్ హక్కులు లభిస్తే, ప్రతి ప్రయోగానికి సార్ధకత చేకూరుతుందన్నారు. విద్యార్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, ఇతర రంగాలపై దృష్టిసారించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు చోటుచేసుకున్న మార్పులు, పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాస్తస్రాంకేతిక సంస్థలు, పరిశ్రమల స్థాపనకు సాంకేతిక విద్యార్థులు కృషి చేయాలని కోరారు. స్వయంప్రతిపత్తి కలిగిన జెఎన్‌టియుకె శాస్తస్రాంకేతిక రంగాల అభివృద్ధికి కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో విసి విఎస్‌ఎస్ కుమార్, వర్సిటీ రెక్టార్ ఆచార్య బి ప్రభాకరావు, రిజిస్ట్రార్ ఆచార్య జివిఆర్ ప్రసాదరాజు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.