పఠనీయం

వివిధ విషయాల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాస సరసి
-డా.పుట్టపర్తి నాగపద్మిని
వెల: రూ.75.. పేజీలు: 102
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్, ప్లాట్ నెం.37, వంశీ నిలయం, తరుణా ఎవెన్యూ, ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్-47.

తెలుగులో తన ఆరవ సంకలనం ఈ ‘వ్యాస సరసి’ అని రచయిత్రి చెప్పారు. ఈ గ్రంథంలో ‘గాథల్లో జంతుప్రేమ’ నుంచి ‘తెలుగింటి సిరుల పంట’ వరకు వివిధ విషయాల మీద శ్రీమతి నాగపద్మిని రచించిన వ్యాసాలు ఉన్నాయి.
1వ వ్యాసంలో ‘గాథల్లో జంతుప్రేమ’లో ‘గాథాసప్తశతి’లో వర్ణించిన జంతువుల ప్రేమ గురించి సోదాహరణంగా వివరించారు.
2వ వ్యాసం ‘మీరైనా చెప్పండి’ మన సనాతన సంస్కృతి, ఆచారాల గురించి, అవి ఎట్లా మనం మర్చిపోతున్నామో అనే ఆవేదన వ్యక్తం చేశారు రచయిత్రి.
3వ వ్యాసంలో ఫ్రాయిడ్ అనుచరుడు ఎడ్లర్ గురించి హిందీ వ్యాసానికి అనువాదం.
4వ వ్యాసం ‘సామాజిక స్పృహ నేపథ్యం’లో పూర్వ కవులు రాసిన దాంట్లో సామాజిక స్పృహను వివరించారు.
5వ వాయసం ‘బౌద్ధ భామతీ సమాజం వారి రామాయణం’లో ఈశాన్య భారతంలో భామతీ జాతుల వారు బౌద్ధులైనా రామాయణం రచించుకున్నారు. దాని గురించి వివరణ అనగా భేదాలు అవీ చెప్పబడ్డాయి.
6వ వ్యాసం ‘అమిష్’లో (అమెరికాలోది) హింసను తట్టుకోలేక ప్రశాంతంగా బతుకగలిగే చోటు కోసం వచ్చి కొంతమంది స్థిరపడిన ప్రదేశం ఇది. నేటి అభివృద్ధి అనుకుంటున్న వాటికి దూరంగా (అనగా టి.వి. సెల్, కంప్యూటర్లు) ఉండవు. వ్యవసాయానే్న నమ్ముకున్నారు. ఇది నేటి మానవ సమాజాన్ని నేనే లేక మేమే అభివృద్ధి చేశామనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కాగలదు.
7వ వ్యాసం ‘జాతీయోద్యమంటి తెలుగు గేయాలు’ వివరించారు.
8వ వ్యాసం - ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి వారి రచనలలో సంస్కృతీ సౌరభాలు - భారతీయ సంస్కృతిలో పుట్టపర్తి వారి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ వారు లౌక్యంగా వ్యవహరించి ఉంటే ‘జ్ఞానపీఠం’ వారి గడపనే నిలిచేది అన్నారు. అది అక్షర సత్యం. ఇలా జ్ఞానపీఠాన్ని లేక జ్ఞానపీఠం వాళ్లు వదులుకున్న వారు తెలుగులో పుట్టపర్తి వారు కవి సమ్రాట్ నోరి వారు.
9వ వ్యాసం ‘శుభంకరం’ 10వ వ్యాసం పుట్టపర్తి వారి స్ర్తి పాత్రలు.
పుట్టపర్తి వారు అనగానే ‘శివతాండవం’ గుర్తుకు వస్తుంది. అది వివరిస్తూ పదవ వ్యాసంలో పుట్టపర్తి వారి రచన ‘జనప్రియ రామాయణం’లో స్ర్తి పాత్రల గురించి రచయిత్రి సోదాహరణంగా వివరించారు. ఎంత అభిమానమున్నా ఆ గ్రంథాన్ని గురించి నండూరి వారు ‘ఆ గ్రంథం వాల్మీకి రామాయణాన్ని మించిపోయింది’ అనటం మాబోంట్లకు సమ్మతము కాదు.
చివరి వ్యాసంలో ‘తెలిగింట సిరుల పంట’లో తెలుగు ఇళ్లలో పాడుకునే పాటలు అవీ వివరించారు. ఆనాటి ఆచార వ్యవహారాలు ఈ పాటల్లో తెలుస్తాయి.
రచయిత్రి వివిధ విషయాల మీద రాసిన విధం ఆయా రంగాలలో వారికున్న అభినివేశనం వ్యక్తమవుతున్నది. ఆమె ముందు మాటలో వివిధ రచయితలు రాసిన వ్యాసాల గురించి ప్రస్తావించారు. నోరి వారి వ్యాసాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ప్రచురించారు) తలమానికం. రచయిత్రి దృష్టిలోకి అవి ఎందుకు రాలేదో తెలియదు. ఏమైనా అన్ని వ్యాసాలు చదివాక రచయిత్రికి సనాతన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాల మీద ఉన్న అభిమానానికి అభినందనీయులు.

-నోరి సుబ్రహ్మణ్య శాస్ర్తీ 9849793649